
కెసిఆర్- మెదక్ ఫామ్ హౌస్
హైదరాబాద్: మెదక్ జిల్లా ఫామ్ హౌస్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించిన తరువాత పార్టీ ముఖ్య నేతలతో ఆయన మొదటి సమావేశమయ్యారు. దాంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలను ఆహ్వానించారు.
పార్లమెంటులో ఆహాభద్రత బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టిఆర్ఎస్లో చేరిన ఎంపి వివేక్, మందా జగన్నాధంలు విప్ పేరుతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో భవిష్యత్ వ్యూహంపైన, పార్టీ ఉనికిని కాపాడుకోనే ప్రయత్నం గురించి చర్చిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే అంశం కూడా చర్చిస్తారని తెలుస్తోంది.