చెన్నైలోని జయలలిత సమాధిని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సందర్శించారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఘనంగా నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్లోని జయ సమాధిని శనివారం విజయశాంతి సందర్శించారు. అమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ జయలలిత గొప్ప నాయకురాలు అని కొనియాడారు. అన్నాడీఎంకే పార్టీ బాధ‍్యతలు శశికళకు అప్పగించడం సరైన నిర్ణయమేనని ఆమె చెప్పారు.