Khammam Ex MP Ponguleti Srinivasa Reddy Security Reduced BRS - Sakshi
Sakshi News home page

Khammam: పొంగులేటి వ్యాఖ్యలపై కేసీఆర్‌ సర్కార్‌ గరంగరం? సెక్యురిటీ తగ్గిస్తూ నిర్ణయం

Published Wed, Jan 4 2023 7:28 PM | Last Updated on Wed, Jan 4 2023 7:44 PM

Khammam Ex MP Ponguleti Srinivasa Reddy Security Reduced BRS - Sakshi

ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ప్రస్తుతమున్న 3+3 పోలీసు భద్రతను 2+2కు తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్‌ను, ఇంటి ముందు ఉండే గన్‌మెన్‌లను కూడా తొలగించింది. ఈ విషయం ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

పొంగులేటి గత కొంతకాలంగా సొంతపార్టీ అయిన బీఆర్‌ఎస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. పొంగులేటి తీరుపై బీఆర్ఎస్ అధిష్ఠానం గుస్సా అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చదవండి: ఖమ్మం పాలిటిక్స్‌లో కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement