ఐదు కథలు... ఐదుగురు హీరోలు | Five stories Five heroes Panchamukhi movie | Sakshi
Sakshi News home page

ఐదు కథలు... ఐదుగురు హీరోలు

Published Mon, May 19 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

ఐదు కథలు... ఐదుగురు హీరోలు

ఐదు కథలు... ఐదుగురు హీరోలు

ఆర్యన్ రాజేశ్, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్ ముఖ్య తారలుగా ఆర్ట్ ఇన్ హార్ట్ పతాకంపై యార్లగడ్డ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘పంచముఖి’. చల్లా భానుకిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ -‘‘యథార్థంగా జరిగిన ఐదు కథల సమాహారమే ఈ సినిమా. ముఖ్యంగా ఐదు పాత్రలతో సాగుతుంది. థ్రిల్‌కు గురి చేసే సినిమా ఇది. కేవలం 38 రోజుల్లోనే సినిమాని పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘ఐదు కథలు, ఐదుగురు కథానాయకులు, ఐదు పాటలు, ఐదుగురు సంగీత దర్శకుల కాంబినేషన్‌లో ఈ సినిమా చేయడం విశేషం’’ అని నిర్మాత చెప్పారు. మంచి సినిమా అని మాదాల రవి, కృష్ణుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్యప్రకాశ్, సంగీతం: సుమన్-ప్రమోద్-మోహన్ బల్లేపల్లి-జయసూర్య-భాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement