ఐదు కథలను కలిపే పాత్ర | Aryan Rajesh new Movie Panchamukhi | Sakshi
Sakshi News home page

ఐదు కథలను కలిపే పాత్ర

Published Wed, Dec 3 2014 10:25 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

ఐదు కథలను కలిపే పాత్ర

ఐదు కథలను కలిపే పాత్ర

 ఆర్యన్ రాజేశ్, మాదాల రవి, కిరణ్, ఉత్తేజ్, చిన్నా ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘పంచముఖి’. చల్లా భానుకిరణ్ దర్శకుడు. యార్లగడ్డ కిరణ్ నిర్మాత.  ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నటుడు మాదాల రవి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అయిదు కథలుంటాయి. ఆ కథలను కలిపే పాత్రను నేను పోషించాను. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. వెండితెరపై ఇప్పటివరకూ కొన్ని వేల సినిమాలు విడుదలయ్యాయనీ, వాటన్నింటిలో తమ సినిమా భిన్నమైందని దర్శకుడు నమ్మకంగా చెప్పారు. ఆద్యంతం ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇదని నటుడు కిరణ్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement