Panchamukhi
-
ఐదు కథలను కలిపే పాత్ర
ఆర్యన్ రాజేశ్, మాదాల రవి, కిరణ్, ఉత్తేజ్, చిన్నా ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘పంచముఖి’. చల్లా భానుకిరణ్ దర్శకుడు. యార్లగడ్డ కిరణ్ నిర్మాత. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నటుడు మాదాల రవి పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అయిదు కథలుంటాయి. ఆ కథలను కలిపే పాత్రను నేను పోషించాను. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. వెండితెరపై ఇప్పటివరకూ కొన్ని వేల సినిమాలు విడుదలయ్యాయనీ, వాటన్నింటిలో తమ సినిమా భిన్నమైందని దర్శకుడు నమ్మకంగా చెప్పారు. ఆద్యంతం ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇదని నటుడు కిరణ్ అన్నారు. -
ఐదు కథలతో హారర్
దెయ్యాలతో అనుబంధం ఉన్న ఓ అయిదుగురి కథతో రూపొందిన చిత్రం ‘పంచముఖి’. ఆర్యన్ రాజేశ్, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్ ప్రధాన పాత్రలుగా గల ఈ చిత్రంలో సుమన్ ప్రత్యేక పాత్ర పోషించారు. చల్లా భానుకిరణ్ దర్శకుడు. యార్లగడ్డ కిరణ్ నిర్మాత. సుమన్, ప్రమోద్, మోహన్ బల్లేపల్లి, జయసూర్య, భాను కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని అల్లరి నరేశ్ ఆవిష్కరించి, తొలి ప్రతిని మాదాల రవికి అందించారు. ఆద్యంతం అలరించే హారర్ చిత్రమిదని, ఇందులో ఓ భిన్నమైన పాత్ర పోషించానని ఆర్యన్ రాజేశ్ చెప్పారు. ‘‘ఇందులోని ప్రధానమైన అయిదు పాత్రలకీ ఒకదానికొకటి లింకు ఉంటుంది. అదే ఇందులో ఆసక్తికరమైన అంశం’’ అని దర్శకుడు చెప్పారు. ఐదు కథలు, ఐదుగురు హీరోలు, ఐదు పాటలు, ఐదుగురు సంగీత దర్శకుల సమాహారమే ఈ సినిమా అని నిర్మాత తెలిపారు. -
‘పంచముఖి’ సినిమా న్యూ స్టిల్స్
-
పంచముఖి మూవీ ఆడియో అవిష్కరణ
-
‘పంచముఖి’ సినిమా స్టిల్స్
-
ఐదు కథలు... ఐదుగురు హీరోలు
ఆర్యన్ రాజేశ్, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్ ముఖ్య తారలుగా ఆర్ట్ ఇన్ హార్ట్ పతాకంపై యార్లగడ్డ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘పంచముఖి’. చల్లా భానుకిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ -‘‘యథార్థంగా జరిగిన ఐదు కథల సమాహారమే ఈ సినిమా. ముఖ్యంగా ఐదు పాత్రలతో సాగుతుంది. థ్రిల్‌కు గురి చేసే సినిమా ఇది. కేవలం 38 రోజుల్లోనే సినిమాని పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘ఐదు కథలు, ఐదుగురు కథానాయకులు, ఐదు పాటలు, ఐదుగురు సంగీత దర్శకుల కాంబినేషన్లో ఈ సినిమా చేయడం విశేషం’’ అని నిర్మాత చెప్పారు. మంచి సినిమా అని మాదాల రవి, కృష్ణుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్యప్రకాశ్, సంగీతం: సుమన్-ప్రమోద్-మోహన్ బల్లేపల్లి-జయసూర్య-భాను.