గుండెల్లో మోగిందే నీ కబురే! | Nikhil Spy Jhoom Jhoom Re Song launch | Sakshi
Sakshi News home page

గుండెల్లో మోగిందే నీ కబురే!

Published Mon, Jun 12 2023 3:48 AM | Last Updated on Mon, Jun 12 2023 3:48 AM

 Nikhil Spy Jhoom Jhoom Re Song launch - Sakshi

నిఖిల్, ఐశ్వర్యా మీనన్‌ జంటగా ఆర్యన్‌ రాజేష్, సన్యా ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ దర్శకత్వంలో కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘‘మొదటిసారిగా చూపు తగిలే... గుండెల్లో మోగిందే నీ తొలి కబురే, జుమ్‌ జుమ్మనే గుండెల్లోన యుద్ధాలే.. సిద్ధంగా ఉంచా నీకే ఏడుజన్మలే..’ అంటూ సాగే  పాట లిరికల్‌ వీడియోను చిత్రయూనిట్‌ ఆదివారం విడుదల చేసింది.

కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడారు. స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ డెత్‌ మిస్టరీ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement