Niharika Konidela Hello World Web Series Trailer Released - Sakshi
Sakshi News home page

Hello World Web Series: మనకు సాలరీ ఇత్తరా బ్రో.. ఆసక్తిగా ట్రైలర్

Published Sat, Aug 6 2022 3:12 PM | Last Updated on Sat, Aug 6 2022 4:53 PM

Niharika Konidela Hello World Web Series Trailer Released - Sakshi

వరుస వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్‌’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్‌ సిరీస్‌తో ముందుకొచ్చింది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘హలో వరల్డ్‌’. ఈ సిరీస్‌కు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా వ్యవహరించారు.

Niharika Konidela Hello World Web Series Trailer Released: వరుస వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్‌’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్‌ సిరీస్‌తో ముందుకొచ్చింది. ఐటీ ఉద్యోగుల నేపథ్యంలో రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘హలో వరల్డ్‌’. ఈ సిరీస్‌కు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా వ్యవహరించారు. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై విభిన్నమైన వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్న ఆమె తాజాగా ఈ సిరీస్‌ను జీ5తో కలిసి నిర్మించారు. ఇంతకుముందు జీ5తో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సిరీస్‌ను కూడా రూపొందించారు. 

8 ఎపిసోడ్లుగా రూపొందిన 'హలో వరల్డ్‌' వెబ్‌ సిరీస్‌కి శివసాయి వర్థన్‌ దర్శకత్వం వహించారు. ఆర్యన్‌ రాజేశ్‌, సదా, రామ్‌ నితిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను శనివారం (ఆగస్టు 6) ప్రముఖ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. నిమిషం 46 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. 'చిన్నప్పటి నుంచి అందరి పిల్లల్లానే చాలా అవుదామనుకున్నా' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లో 'మనకు సాలరీ ఇత్తరా బ్రో', 'నీకు ఇవ్వాల్సిన రెండు లచ్చలు ఒక్క సంవత్సరంలో కట్టిపడేత్తా', 'చావడం కన్ఫర్మ్‌ అయినప్పుడు ఎంజాయ్‌ చేస్తూ చావాలి కానీ, ఇలా ఏడుస్తూ చస్తే లాభమేంట్రా' అనే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 

కాగా భారీ అశలతో ఓ ఐటీ కంపెనీలో చేరిన ఎనిమిది మంది యువతకు చెందిన కథ ఇదని దర్శకుడు శివసాయి తెలిపారు. ఐటీ కంపెనీలో చేరిన ఆ ఎనిమిది మంది జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశారనేది ఆసక్తిగా చూపించామన్నారు. తెలుగులో ఆఫీస్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌లు చాలా తక్కువని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతికి కలిస్తుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ సిరీస్‌కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement