
సాక్షి, హైదరాబాద్ : ఆవేశంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రీరెడ్డిని దూషిస్తూ.. బెదిరిస్తూ.. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. పవన్‌కు, ఆయన తల్లికు సారీ చెప్పారు. ఇదిలా ఉండగా.. పలు సినిమాల్లో హీరోగా నటించిన ప్రముఖ నటుడు కృష్ణుడు కూడా ఫేస్‌బుక్‌లో ఈ వివాదంపై స్పందించారు. పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల విషయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించాలి అంటూ ఆవేదనగా ఆయన ఒక పోస్టును షేర్ చేశారు. ‘ఇవాళ పవన్ కళ్యాణ్ ని అన్నది, రేపు మిమ్మల్ని అంటుంది. మీరు స్పందించండి, అక్కడ పవన్ కళ్యాణ్‌ని అనలేదు, పవన్ తల్లిని అసభ్యంగా అన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. రేప్పొద్దున పెద్ద సినీ రచయితలు, దర్శకులు, ప్రొడ్యూసర్ల అమ్మల్ని, అక్కల్ని అనడానికి కూడా ఆమె ఏమాత్రం ఆలోచించదంటూ పేర్కొన్నారు. ‘మా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ, కళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ గళం విప్పండి. సహనంతో ఉండే సమయం మించిపోయింది. ఓపికగా ఉండే హద్దులు పగిలిపోయాయ్. ఇక అడుగేయండి, ఒకే ఒక్క అడుగు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
‘అభిమానులూ స్పందించండి.. ఇవాళ మా హీరో, రేపు మహేష్ ఫాన్స్, ఎల్లుండి ప్రభాస్ ఫాన్స్, ఆ తర్వాత తారక్ ఫాన్స్, వదిలేస్తే మీదాక కూడా వస్తుంది. మీ హీరో మా హీరో కాదు, మన సిన్మావాళ్ళు. మన ఇండస్ట్రీ గుర్తుంచుకోండి’ అని పేర్కొన్నారు. ‘స్త్రీల గౌరవం కోసం పోరాడే మహిళా సంఘాలు ఎక్కడికి పోయాయి?? పవన్ కళ్యాణ్ అమ్మ కూడా ఒక స్త్రీనే! ఒక స్త్రీ గౌరవం కోసం స్పందించకపోతే మీరు చేసే పోరాటానికి అర్థమేముంది? ప్రేక్షకులు, ప్రజలు కూడా స్పందించండి సినిమా వాళ్ళు ఏ ఆదివారమో, నెలకోసారో నువ్వూ నీ ఫ్యామిలీ సరదాగా హాల్ కెళ్తే మిమ్మల్ని నవ్వించే, ఆనందంగా ఇంటికిపంపించే సినిమా వాడు కదా మీరు కూడా స్పందించండి. ఇప్పుడు నాకు భాస్కరభట్ల గారి మాటలు గుర్తొస్తున్నాయి. 'సరదాగా మీరంతా మా సినిమాలే చూస్తారండి. అయినా మేమంటే ఓ చిన్న చూపులేండి!'’ అని కృష్ణుడు పేర్కొన్నారు. అయితే, మిహిరా అని చివర్లో రాయడంతో ఇది ఆ వ్యక్తి రాసిన షేరింగ్ పోస్ట్ అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment