సాక్షి, కత్తిపూడి : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆకర్షితుడై సినీ నటుడు కృష్ణుడు వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్ జగన్ సమక్షంలో నటుడు కృష్ణుడు వైఎస్సార్ సీపీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్.
వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. జననేత వైఎస్ జగన్ పాదయాత‍్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్సార్ సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment