ఫ్లోరాశైని చేసిన ప్రత్యేక పాట ‘పిల్లా ఓ పిల్లా..’
ఫ్లోరాశైని చేసిన ప్రత్యేక పాట ‘పిల్లా ఓ పిల్లా..’
Published Mon, Aug 5 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
‘‘ఈరోజు ఫ్రెండ్‌షిప్ డేని పురస్కరించుకుని ఈ చిత్రం వీడియో సాంగ్స్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లోరా శైని చేసిన ప్రత్యేక పాట ‘పిల్లా ఓ పిల్లా..’ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆడియో హిట్ అవ్వడం ఓ ఎస్సెట్.
ఈ నెలాఖరున సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు డా. పీఎల్‌ఎన్ రాజు. శ్రీ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీవిశాల్ కందుకూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన చిత్రం ‘సహస్ర’. శ్రీ ఐర, కృష్ణుడు, షఫి, రాజీవ్ కనకాల, రేవా తదితరుల కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది. గీతాపూనిక్ పాటలు స్వరపరిచారు.
ఈ చిత్రం పాటలు విజయం సాధించిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఇలాంటి ఎనర్జిటిక్ సాంగ్‌కి డాన్స్ చేసే అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలు ఫ్లోరాకి కృతజ్ఞతలు తెలిపారు. తన నుంచి దర్శకుడు మంచి పాటలు రాబట్టుకున్నారని గీతాపూనిక్ అన్నారు.
Advertisement
Advertisement