breaking news
Flora Saini
-
'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్? ప్రోమో రిలీజ్
బిగ్‌బాస్ 9లో ఐదు రోజులు విజయవంతంగా పూర్తయింది. అలానే వీకెండ్ వచ్చేసింది. దీంతో హోస్ట్ నాగార్జున.. హౌస్మేట్స్ ముందుకు వచ్చేశారు. ఓవైపు అందరినీ సరదాగా నవ్విస్తూనే మరోవైపు తనదైన స్టైల్లో కౌంటర్స్ వేశారు. ఈసారి కెప్టెన్ సంజనకి కాస్త గట్టిగానే పంచులు పడ్డాయి. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోంది. మరోవైపు శనివారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందా అనేది ప్రోమోతో కాస్త క్లారిటీ ఇచ్చారు. వస్తూవస్తూనే అందరిని పలకరించిన నాగార్జున.. రాము రాథోడ్ బట్టలు ఉతకడం గురించి, ఇమ్మాన్యుయేల్.. హరీశ్‌ని గుండంకుల్ అనడం గురించి పంచులు వేశారు. అలానే సంజన.. ఫ్లోరా రిలేషన్ గురించి కల్పించుకోవడంపైన స్పందించారు.(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రాము రాథోడ్‌కి తన రిలేషన్ టాపిక్ గురించి చెబుతుంటే మధ్యలో వచ్చిన సంజన.. తనని ఫ్రీ బర్డ్ అనడం అస్సలు నచ్చలేదని ఫ్లోరా, నాగార్జునకు కంప్లైంట్ చేసింది. తను చెబుతున్నప్పుడు సంజన మధ్యలో దూరడం కరెక్ట్ కాదనేది ఫ్లోరా వాదన. కానీ సంజన మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్రీ బర్డ్ అనడం తప్పెలా అవుతుందని అడిగింది. కెప్టెన్ అయిన తర్వాత సంజన.. తనకు కాఫీ ఇవ్వొద్దని హౌస్‌మేట్స్‌తో చెప్పిందని ఫ్లోరా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కాఫీ టాపిక్కే రాలేదని సంజన చెప్పింది గానీ మిగతా టీమ్ మేట్స్ మాత్రం సంజన అలానే అనిందని క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ ఏదీ ఇవ్వకూడదని మిమ్మల్ని మందలించినప్పుడు రాముకి టీ ఇవ్వాలని మీరు ఎలా డిసైడ్ చేశారు? అని సంజనని నాగ్ అడిగాడు. ఇలా అడిగిన అన్ని ప్రశ్నలకు సంజన ఎలాంటి సంజాయిషీ ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?) -
డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?
గంపెడాశలతో బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకర్ని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్‌బాస్ తెలుగు తొమ్మిదో సీజన్లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, డిమాన్ పవన్, తనూజ, ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్‌లో ఉన్నారు.వీళ్లంతా కనిపించారువీరిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు ఇమ్మాన్యుయేల్ (Emmanuel). ఓనర్ల (కామన్‌మ్యాన్)కు నచ్చిన వంటలు చేస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది తనూజ. కెప్టెన్సీ టాస్క్‌లో ఇరగదీశాడు రాము రాథోడ్. ఒక్క గుడ్డు దొంగిలించి హౌస్‌ను షేక్ చేసింది సంజనా. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమాయిషీ చూపించే కెప్టెన్‌గా నిలించింది. గ్లామరస్ కంటెంట్నిచ్చే రీతూకు ఎలాగో బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఎపిసోడ్లో జాడ లేని కంటెస్టెంట్లుమిగిలిందల్లా డిమాన్ పవన్, శ్రష్టి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ (Flora Saini). సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన పవన్ హౌస్‌లో అప్పుడప్పుడు పులిహోర కలుపుతూ కనిపిస్తున్నాడు. కాబట్టి కొన్నాళ్లు అతడిని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రష్టి, ఫ్లోరా ఎపిసోడ్లో పెద్దగా కనిపించడమే లేదు. ఫ్లోరా అయితే సంజనాతో గొడవైనప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్ క్లీన్ చేసే పని అప్పజెప్పడంతో రోజులో ఎక్కువభాగం ఆ వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతోంది.ఇలాగైతే ఎలిమినేషన్ ఖాయంఆమె నుంచి పాజిటివ్ లేదా నెగెటివ్.. ఎటువంటి వైబ్స్ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఈ లెక్కన ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేదంటే అప్పుడే ఎలిమినేషన్ ఎందుకని నాగ్ (Nagarjuna Akkineni) కనికరించాడంటే మాత్రం ఈ వారం ఫ్లోరాకు గండం గడిచినట్లే! మరి నాగార్జున కనికరిస్తాడా? లేదంటే ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడనేది వేచి చూడాలి!చదవండి: ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!
బిగ్‌బాస్ షో (Bigg Boss 9 Telugu)లో మొదటివారం నామినేషన్స్ సిల్లీగా ఉంటాయి. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు, ఆయన సరిగా ఇల్లు తుడవలేదు, నాకింకో ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అందరికీ బలమైన పాయింట్ అందించేందుకు నేనున్నానంటూ సంజనా గల్రానీ అభయమిచ్చింది. చీటికిమాటికి చిరాకు పడుతూ, గొడవలతో విసుగు తెప్పిస్తూ అందరికంట్లో పడింది. నీ పనిమనిషినా?ఇంకేముంది ఓనర్స్ అందరూ కలిసి సంజనాను ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. తర్వాత వాష్‌రూమ్ దగ్గర రచ్చ మొదలైంది. కండీషనర్, షాంపూ బాత్రూంలో పెట్టకండి, బయటపెట్టుకోండి అని ఫ్లోరా చెప్తుంటే సంజనా అడ్డంగా వాదించింది. విసుగెత్తిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా? బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా? అని నిలదీసేసరికి సంజనా కోపం నషాళానికంటింది. మ్యానర్స్ లేదు, అదీ ఇదీ అని చెడామడా తిట్టేసరికి ఫ్లోరా ఏడ్చేసింది.ఫుటేజ్ కోసమా?అదంతా చూసిన శ్రీజ.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమైన సంజనా.. ఏమన్నావ్? ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తూనే చీప్ అని తిట్టింది. తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్‌తో శ్రీజను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అని చీదరించుకుంది తర్వాత టెనెంట్స్‌లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలన్నాడు బిగ్‌బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్‌లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. రీతూ తలకు గాయంసుత్తిని అందుకున్నవారు నామినేషన్స్ చేస్తారు. ఈ ప్రక్రియలో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దాంతో ఆమెను మెడికల్ రూమ్‌కు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎక్కువగా మౌన వ్రతంలోనే ఉంటున్న సుమన్.. ఎట్టకేలకు నిన్న నోరు విప్పాడు. కానీ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి.చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ -
బిగ్‌బాస్: 20 ఏళ్లకే లవ్, ప్రియుడి చేతిలో నరకం చూసిన హీరోయిన్
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, ప్రేమతో రా, మైఖేల్ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించింది. లక్స్ పాప.. సాంగ్‌తో బాగా ఫేమస్ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది.రానా నాయుడు, ద ట్రయల్ వెబ్ సిరీస్‌లలోనూ మెరిసింది. అందరమ్మాయిల్లాగే తనూ ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిల్లో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకాన్నే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మానాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్‌బాస్ 9 షోలో అడుగుపెట్టింది.అసలేం జరిగిందంటే?20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా సైని. అప్పటికే దాదాపు పది చిత్రాలు చేసింది. మోడల్‌గానూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్దిరోజులకే పరిస్థితులు తారుమరయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఫోన్ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. ఏడాదిన్నర పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వలేదు. ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై కొట్టాడని ఫ్లోరా సైని సోషల్ మీడియాలో వాపోయింది. ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది. -
బిగ్‌బాస్‌లోకి 'లక్స్ పాప'.. 'ఉల్లు' ఓటీటీతో మరింత పాపులర్
తెలుగు వారికి ఆశా సైనీ (Asha Saini)గా బాగా దగ్గరైన బ్యూటీ ఇప్పుడు బిగ్‌బాస్-9లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె అసుల పేరు ఫోరా సైనీ.. 1990లో ‘ప్రేమకోసం’ సినిమాతో టాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత 'నరసింహ నాయుడు, 'నువ్వు నాకు నచ్చావ్', 'ప్రేమతో రా,143 వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది. ముఖ్యంగా నరసింహ నాయుడు చిత్రంలో బాలకృష్ణతో 'లక్స్ పాప.. లక్స్ పాప' అంటూ స్టెప్పులేసింది. అయితే, 2011 తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ, బాలీవుడ్ పరిశ్రమలో బిజీగానే ఉంది. హిందీ వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాల్లొ గ్లామరస్ పాత్రలే ఎక్కువ చేస్తుంది. రానా నాయుడు, ఆర్య, X.X.X వంటి సీరిస్‌లో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఏకంగా ఉల్లు ఓటీటీ కోసం ఒక రొమాంటిక్ ఫిలింలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్-9లో తన గ్లామర్ టాలెంట్‌ను చూపించేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.వివాదాలు 2008లో నకిలీ వీసా కేసులో అరెస్టు కావడం వల్ల తమిళ పరిశ్రమలో ఆమె కొంతకాలం నిషేధం ఎదుర్కొంది. తాజాగా ఆమె ఓ నిర్మాతతో తన గత సంబంధం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు తనను చిత్రహింసలకు గురి చేశాడని, 14 నెలల పాటు ఒంటరిగా ఉంచాడని వెల్లడించింది. ఆ నిర్మాతతో ప్రేమల పడి నరకం చూశానని చెప్పింది. తన ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై రోజూ కొట్టేవాడని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన తల్లి వద్దే ఉంటున్నానని ఆమె చెప్పింది. అయితే, తాను తిరిగి వెండితెరపై కనిపించాలని ప్లాన్ చేస్తుంది. తనకు మొదట లైఫ్ ఇచ్చింది తెలుగు పరిశ్రమనే కాబట్టి మరోసారి ఇక్కడ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే పనిలో ఆమె ఉన్నట్లు సమాచారం.తాజాగా బిగ్‌బాస్-9 నుంచి ఒక ప్రోమో విడుదలైంది. అందులో బిగ్‌బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే! -
14 నెలలు నరకం.. ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి.. ప్రముఖ నటి
బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ నిర్మాత తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. గత 14 నెలలుగా నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. ప్రముఖ నిర్మాత తనను అత్యంత దారుణంగా హింసిచాడని వాపోయింది. అంతే కాకుండా ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరిచాడని వెల్లడించింది ఫ్లోరా సయానీ. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అతని నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొంది. సయానీ తనకు జరిగిన దారుణాన్ని గుర్తుచేసుకుంటూ..'నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించా. అంతలోనే కానీ నా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతను నన్ను దుర్భాషలాడాడు. అతను నా ముఖం,ప్రైవేట్ భాగాలపై విచక్షణారహితంగా కొట్టాడు. అతను నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు.నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేశాడు. చివరికి అతని వద్ద నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చా.'అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నానని తెలిపింది. ఆ నరకం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని చెప్పింది. నన్ను ఇష్టపడే వారి వద్దకు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నానని ఫ్లోరా పేర్కొన్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉన్నానని వీడియోలో వెల్లడించింది. అయితే ఆ ప్రముఖ నిర్మాత పేరు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు సయానీ. ఫ్లోరా సయానీ సినీ కెరీర్ 1999లో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ పెద్దగా సినిమాల్లో నటించలేదు సయానీ. 2016 నుంచి మైడ్ ఇన్ ఇండియా, గాండీ బాత్, మాయనగరి: సిటీ ఆఫ్ డ్రీమ్స్, ఆర్య వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. ఆ తర్వాత ఫ్లోరా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించింది. ఇటీవల భేడియా, దో లఫ్జోన్ కి కహానీ, గుడ్డు కి గన్ బాలీవుడ్ చిత్రాలలో కనిపించింది. View this post on Instagram A post shared by Flora Saini (@florasaini) -
ఒంటిపై బట్టలు కూడా సరిగా లేవు, ప్రాణభయంతో పరుగెత్తా: నటి
ఢిల్లీలో జరిగిన శ్రద్హ వాకర్ ఘటన ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ప్రియుడే ఆమె ముక్కలు ముక్కలు నరికి చంపిన ఈ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేల చేసింది. శ్రద్ధా వాకర్‌లాగే తాను కూడా తన ప్రియుడి చేతిలో బలైపోయేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నువ్వు నాకు నచ్చావ్ ఫేం ఆశ(అలియాస్ ఫ్లోరా సైనీ). ఫ్లోరా తెలుగులో పలు చిత్రాలు చేసి ఇక్కడ గుర్తింపు పొందింది. ‘నరసింహ నాయిడు, నువ్వు నాకు నచ్చావు, ప్రేమతో రా, సొంతం’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత అవకాశాలు లేక టాలీవుడ్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన విషయాలు బయటకపెట్టింది. ‘శ్రద్ధా వాకర్‌కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో నాకు కూడా అలాంటిదే జరిగింది. నా బాయ్ ఫ్రెండ్, నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి నేను బయటకొచ్చిన కొద్దిరోజుల్లోనే అతడిలో చాలా మార్పు కనిపించింది. తనకోసం అందరినీ వదిలేసి వస్తే.. నన్ను తీవ్రంగా హింసించేవాడు. పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. ఎందుకు కొడుతున్నాడో అర్థమయ్యేది కాదు. అతడు కొట్టిన దెబ్బలకు నా దవడ విరిగింది. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టడమే కాదు చంపేస్తానంటూ బెదించాడు. దాంతో నేను ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదా అని కూడా చూడకుండా ప్రాణభయంతో పరుగెత్తాను. అప్పుడే మా అమ్మ వచ్చింది. దాంతో తన వెంట ఇంటికి వెళ్లిపోయాను. అలా నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఆ తర్వాత రోజు అతడిపై కేసు పెట్టాను. మొదట పోలీసులు నేను చెప్పింది నమ్మలేదు. ప్రతి రోజు పోలీస్ స్టేషన్ చూట్టూ తిరిగాను. చివరకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు’ అంటూ ఫ్లోరా సైనీ ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్ వెంకటేశ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప -
నా దవడ పగలగొట్టాడు, కొట్టి చంపాలనుకున్నాడు: నటి
బాలీవుడ్ నటి ఫ్లోరా సైని తను ఎదుర్కొన్న వేధింపులను తాజా ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్ దోషి తనను చితకబాది చంపినంత పని చేశాడని వాపోయింది. అతడిని వదిలి వెళ్లిపోతే తనను, తన తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడంటూ ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంది. మొదట్లో గౌరంగ్ ఎంతో ప్రేమగా ఉండేవాడు. కానీ తర్వాతే అసలు రంగు బయటపడింది. శ్రద్ధావాకర్ హత్యకేసులో ఏదైతే జరిగిందో నా విషయంలో కూడా అదే జరిగేదేమో! మొదట నా కుటుంబానికి దూరం చూశాడు. ఇంట్లో వాళ్లు వద్దని హెచ్చరించినా వినకుండా ఇల్లు వదిలి అతడి దగ్గరకు వెళ్లిపోయాను. కానీ అతడి ఇంటికి వెళ్లిన వారం రోజుల్లోనే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. సడన్‌గా నన్ను ఎందుకు కొడుతున్నాడో అర్థం కాలేదు, అయినా అతడు మంచివాడనే నమ్మాను. నేనే ఏదైనా పొరపాటు చేశానేమోనని మనసుకు సర్ది చెప్పుకున్నాను. కానీ తరచూ నన్ను హింసించేసరికి భరించలేకపోయాను, వదిలి వెళ్లిపోతానన్నాను. అలా చేస్తే నన్ను, నా పేరెంట్స్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఒకరోజు రాత్రి నన్ను చావబాదాడు. అతడు కొట్టే దెబ్బలకు నా దవడ పగిలింది. అతడి నాన్న ఫొటో చూపిస్తూ ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, ఈరోజు నిన్ను చంపడం ఖాయమంటూ నన్ను చితకబాదాడు. నాకు ఫొటో చూపించిన తర్వాత ఫోన్‌ను పక్కన పెట్టేందుకు కొంచెం దూరం వెళ్లగానే సడన్‌గా నా చెవిలో అమ్మ గొంతు వినిపించింది. అంతే, ఆ క్షణం నా ఒంటిమీద బట్టలున్నాయా? లేదా? డబ్బులు అవసరమా? కాదా? ఇవేవీ ఆలోచించలేదు. బతికి బట్టగడితే అంతే చాలనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను. నా ఇంటికి వచ్చేశాను. ఇంకెప్పుడూ తిరిగి అతడి దగ్గరకు వెళ్లాలనుకోలేదు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు నా మాటలు నమ్మలేదు. కానీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేసరికి కేసు నమోదు చేసుకున్నారు అని చెప్పుకొచ్చింది. కాగా ఫ్లోరా 2018లో మీటూ ఉద్యమం సమయంలో తొలిసారిగా తన మాజీ ప్రియుడు చేసిన అకృత్యాలను బయటపెట్టింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించింది. హిందీలో లవ్ ఇన్ నేపాల్, దబాంగ్ 2, లక్ష్మి, ధనక్ సినిమాలు చేసింది. స్త్రీ చిత్రంలో దెయ్యం పాత్రలో భయపెట్టింది. చదవండి: దే..వుడా, ఒకేరోజు 17 సినిమాలు రేవంత్ ఇక మారడా? తిండి దగ్గర కిరికిరి అవసరమా? -
‘మగవారిని కూడా ‘బోల్డ్ యాక్టర్’ అనగలరా’
ఫ్లోరా షైనీ (ఆశా షైనీ).. ‘చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన ఫ్లోరా షైనీ గందీ బాత్, మెయిడ్ ఇన్ ఇండియా వంటి వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఈ క్రమంలో తనను బోల్డ్ యాక్ట్రెస్ అని పిలవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు ఫ్లోరా షైనీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు, మీడియా చాలా ఎదగాలని నా అభిప్రాయం. ఎందుకంటే వారు నేను ఎంచుకునే పాత్రలను, జానర్లను పట్టించుకోకుండా కేవలం బోల్డ్ యాక్ట్రెస్‌గా మాత్రమే గుర్తిస్తున్నారు. మరి అలాంటి సన్నివేశాల్లో నాతో పాటు నటించే నటులను కూడా బోల్డ్ అనాలి. మరి మీడియాకు, జనాలకు మగ నటులను అలా పిలిచే ధైర్యం ఉందా’ అని ప్రశ్నించారు. ‘కేవలం మహిళననే సాకుతో నన్ను ఇలా పిలవగల్గుతున్నారు. లింగవివక్షకు ఇదే అసలైన నిదర్శనం. ఇలాంటి మైండ్ సెట్ మారాలి. మనం ఎదగాలి.. మన సమాజం కూడా లింగవివక్షకు తావులేకుండా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక ‘నేను పోషించిన ప్రతి పాత్ర పట్ల చాలా గర్వంగా ఫీలవుతాను. కేవలం బోల్డ్ పాత్రలనే కాకుండా అన్ని రకాల పాత్రలు నేను చేయగలను. భవిష్యత్తులో కూడా నాలోని నటిని వెలికితీసే మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను’ అన్నారు. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో హర్రర్ కామెడీగా తెరకెక్కిన స్త్రీ చిత్రంలో ఫ్లోరా నటించారు. -
ఫ్లోరాశైని చేసిన ప్రత్యేక పాట ‘పిల్లా ఓ పిల్లా..’
‘‘ఈరోజు ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని ఈ చిత్రం వీడియో సాంగ్స్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లోరా శైని చేసిన ప్రత్యేక పాట ‘పిల్లా ఓ పిల్లా..’ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆడియో హిట్ అవ్వడం ఓ ఎస్సెట్. ఈ నెలాఖరున సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు డా. పీఎల్ఎన్ రాజు. శ్రీ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీవిశాల్ కందుకూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన చిత్రం ‘సహస్ర’. శ్రీ ఐర, కృష్ణుడు, షఫి, రాజీవ్ కనకాల, రేవా తదితరుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. గీతాపూనిక్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటలు విజయం సాధించిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఇలాంటి ఎనర్జిటిక్ సాంగ్‌కి డాన్స్ చేసే అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలు ఫ్లోరాకి కృతజ్ఞతలు తెలిపారు. తన నుంచి దర్శకుడు మంచి పాటలు రాబట్టుకున్నారని గీతాపూనిక్ అన్నారు.