Actress Flora Saini recalls being abused by her ex-boyfriend - Sakshi
Sakshi News home page

Flora Saini: ఒంటిపై బట్టలు కూడా సరిగా లేవు, ప్రాణభయంతో పరుగెత్తా: నటి

Published Thu, Dec 8 2022 12:25 PM | Last Updated on Thu, Dec 8 2022 1:26 PM

Flora Saini Recalls Being Brutally Abused by Her Ex Boyfriend - Sakshi

ఢిల్లీలో జరిగిన శ్రద్హ వాకర్ ఘటన ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ప్రియుడే ఆమె ముక్కలు ముక్కలు నరికి చంపిన ఈ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేల చేసింది. శ్రద్ధా వాకర్‌లాగే తాను కూడా తన ప్రియుడి చేతిలో బలైపోయేదాన్ని అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది నువ్వు నాకు నచ్చావ్‌ ఫేం ఆశ(అలియాస్‌ ఫ్లోరా సైనీ). ఫ్లోరా తెలుగులో పలు చిత్రాలు చేసి ఇక్కడ గుర్తింపు పొందింది. ‘నరసింహ నాయిడు, నువ్వు నాకు నచ్చావు, ప్రేమతో రా, సొంతం’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 

ఆ తర్వాత అవకాశాలు లేక టాలీవుడ్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన విషయాలు బయటకపెట్టింది. ‘శ్రద్ధా వాకర్‌కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో నాకు కూడా అలాంటిదే జరిగింది. నా బాయ్ ఫ్రెండ్, నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి నేను బయటకొచ్చిన కొద్దిరోజుల్లోనే అతడిలో చాలా మార్పు కనిపించింది. తనకోసం అందరినీ వదిలేసి వస్తే.. నన్ను తీవ్రంగా హింసించేవాడు.

పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. ఎందుకు కొడుతున్నాడో అర్థమయ్యేది కాదు. అతడు కొట్టిన దెబ్బలకు నా దవడ విరిగింది. ఓ రోజు నన్ను దారుణంగా కొట్టడమే కాదు చంపేస్తానంటూ బెదించాడు. దాంతో నేను ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదా అని కూడా చూడకుండా ప్రాణభయంతో పరుగెత్తాను. అప్పుడే మా అమ్మ వచ్చింది. దాంతో తన వెంట ఇంటికి వెళ్లిపోయాను. అలా నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఆ తర్వాత రోజు అతడిపై కేసు పెట్టాను. మొదట పోలీసులు నేను చెప్పింది నమ్మలేదు. ప్రతి రోజు పోలీస్‌ స్టేషన్‌ చూట్టూ తిరిగాను. చివరకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు’ అంటూ ఫ్లోరా సైనీ ఆవేదన వ్యక్తం చేసింది.  

చదవండి: 
స్వాతి నా ఆల్‌ టైం క్రష్‌, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌
వెంకటేశ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement