
బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రముఖ నిర్మాత తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. గత 14 నెలలుగా నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. ప్రముఖ నిర్మాత తనను అత్యంత దారుణంగా హింసిచాడని వాపోయింది. అంతే కాకుండా ప్రైవేట్ పార్ట్స్‌ను గాయపరిచాడని వెల్లడించింది ఫ్లోరా సయానీ. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అతని నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొంది.
సయానీ తనకు జరిగిన దారుణాన్ని గుర్తుచేసుకుంటూ..'నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించా. అంతలోనే కానీ నా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతను నన్ను దుర్భాషలాడాడు. అతను నా ముఖం,ప్రైవేట్ భాగాలపై విచక్షణారహితంగా కొట్టాడు. అతను నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు.నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేశాడు. చివరికి అతని వద్ద నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చా.'అంటూ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నానని తెలిపింది. ఆ నరకం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని చెప్పింది. నన్ను ఇష్టపడే వారి వద్దకు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నానని ఫ్లోరా పేర్కొన్నారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉన్నానని వీడియోలో వెల్లడించింది. అయితే ఆ ప్రముఖ నిర్మాత పేరు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు సయానీ.
ఫ్లోరా సయానీ సినీ కెరీర్
1999లో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ పెద్దగా సినిమాల్లో నటించలేదు సయానీ. 2016 నుంచి మైడ్ ఇన్ ఇండియా, గాండీ బాత్, మాయనగరి: సిటీ ఆఫ్ డ్రీమ్స్, ఆర్య వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది. ఆ తర్వాత ఫ్లోరా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించింది. ఇటీవల భేడియా, దో లఫ్జోన్ కి కహానీ, గుడ్డు కి గన్ బాలీవుడ్ చిత్రాలలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment