భూలోకంలో దేవతల సినిమా! | Film of the gods on earth! | Sakshi
Sakshi News home page

భూలోకంలో దేవతల సినిమా!

Published Wed, Mar 26 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

భూలోకంలో దేవతల సినిమా!

భూలోకంలో దేవతల సినిమా!

దేవతలు భూలోకానికి వస్తే?... అది కూడా సినిమా తీస్తే?... ఊహించడానికి చాలా బాగుంది కదూ. ఆ ఊహకు తెరరూపం ఇస్తూ... అసలు దేవతలు సినిమా తీయాలనుకుంటే ఏ జానర్‌లో తీస్తారు? అనే కథాంశంతో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తోంది.

జాకీ దర్శకత్వంలో యం. సుబ్బారెడ్డి, సిరాజ్ నిర్మిస్తున్నారు. సీనియర్ తారలు నాగబాబు, నరేష్, ఆమనితో పాటు కృష్ణ, చరణ్, అఖిల్, జనని, ప్రజ్ఞ వంటి నూతన తారలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడతూ - ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఎంటర్‌టైనర్ ఇది. 30 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వచ్చే నెల రెండో వారంలో పాటలను, మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement