
'చందమామ కథలు'కు జాతీయ అవార్డు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపిక
జాతీయ ఉత్తమచిత్రం.. క్వీన్
ఉత్తమ నటి.. కంగనా రనౌత్
ప్రజాదరణ పొందిన చిత్రం.. మేరీకోమ్
న్యూఢిల్లీ
'చందమామ కథలు' సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ అవార్డు అందుకుంది. దీంతో ఆ సినిమాలో నటించిన మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ''ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. నా సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పుడే తెలిసింది. యాయాయాయా...'' అంటూ ఆనందం ప్రకటించారు.
బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న క్వీన్ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అందులో అద్భుతమైన నటనను ప్రదర్శించిన కంగనా రనౌత్ జాతీయ ఉత్తమనటిగా కూడా ఎంపికయ్యారు. 62వ జాతీయ సినిమా అవార్డులను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రియాంకా చోప్రా నటించిన 'మేరీకోమ్' నిలిచింది. చైతన్య తమ్హానే తీసిన కోర్ట్ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిలింగా ఎంపికైంది. కన్నడ చిత్రం నాను అవనల్ల అవలు అనే సినిమాలో నటించిన హీరో విజయ్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
Omg omg omg #chandamamaKathalu just won the national award for the best regional film. Yayayayayayayyayayayayay. ????????????
— Lakshmi Manchu (@LakshmiManchu) March 24, 2015