laxmi manchu
-
మనోజ్ కూతురి అన్నప్రాసన.. సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? సడన్ సర్ప్రైజ్అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్‌ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.మనోజ్ షర్ట్‌పై పులి బొమ్మఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.అన్నప్రాసన వేడుక'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సంతోషం వెలకట్టలేనిదినిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్ వస్తుందని మనోజ్‌కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాను. యాపిల్‌ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.భగవంతుడికి థ్యాంక్స్ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చిట్టి చిలకమ్మ
పిల్లల పెంపకం అంత ఈజీ కాదు, ఎన్నో సమస్యలు ఉంటాయంటున్నారు నటి, నిర్మాత లక్ష్మీ మంచు. నిజమే.. పిల్లల పెంపకం అంత సులువు కాదు. అందుకే పిల్లల పెంపకంలో ఉండే ఒక్కో సమస్యను ప్రస్తావిస్తూ, వీడియోలు తయారు చేస్తున్నారామె. వీటిని ‘చిట్టి చిలకమ్మ’ యుట్యూబ్ చానల్ ద్వారా ప్రసారం చేస్తారు. విశేషం ఏంటంటే.. తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి లక్ష్మీ మంచు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం గురించి డా. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా నా కుమార్తె, నా ముద్దుల మనవరాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. పిల్లల మంచి కోసం ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నానని నా బిడ్డ లక్ష్మీప్రసన్న చెప్పినప్పుడు ఒక తండ్రిగా నాకు ఆనందంగా, గర్వంగా అనిపించింది. ఈ మంచి ప్రయత్నం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. ప్రతి వారం ప్రసారమయ్యే ఈ షార్ట్ వీడియోస్‌లో ఓ ప్రముఖ మానసిక వైద్యురాలు పాల్గొంటారు. -
స్టార్స్ సీక్రెట్స్ బయటపెడతాను
‘‘నేను చేసిన ఏ షో అయినా నేను కాకుండా వేరే ఎవరూ చేయలేరు. నేను చేసిన షోలకు వచ్చిన సెలబ్రిటీలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో వారికి తెలుసు కాబట్టి నేను మాత్రమే చేయగలను అని గట్టిగా చెబుతున్నాను’’ అంటున్నారు ప్రముఖ నటి, నిర్మాత, హోస్ట్ లక్ష్మీ మంచు. ‘ఊట్’ అనే యాప్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లో ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్ తెలుగు’ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారామె. ఈ నెల 23వ తేదీ నుండి ‘కలర్స్ తెలుగు’ అనే బ్రాండ్ పేరుతో ఈ షో విడుదల అవుతుంది. ‘‘బాలీవుడ్‌కి చెందిన ప్రసిద్ద ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కంపెనీ వయాకామ్ 18తో అసోసియేట్ అయి, ఇంత మంచి షో నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు లక్ష్మీ. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పలు విషయాలు చెప్పారామె. ► బాలీవుడ్లో ఇలాంటి షోలు చేయటం చాలా ఈజీ. ఎందుకంటే అక్కడి స్టార్స్ వారి స్టార్డమ్తో పాటు పర్సనల్ లైఫ్‌ను షేర్ చేసుకోవటానికి ఇష్టపడతారు. కానీ, ఇక్కడి పరిస్థితి వేరు. రీల్ లైఫ్‌లో హీరో అంటే రియల్ లైఫ్‌లో కూడా హీరోలా ఉండాలని కోరుకుంటారు. వృత్తిపరంగా వాళ్లు హీరోలు, హీరోయిన్లే. వ్యక్తిగతంగా చాలా మంచి హ్యూమన్ బీయింగ్స్. ఆ కోణాన్ని బయటకు తీసే ప్రయత్నమే నా షో. మొదటిసారి ఇలాంటి ఒక షోను నేను తెలుగులో ప్రముఖ తారలతో చేస్తున్నాను. అది నా క్రెడిట్. ► ఒక బెడ్ మీద సెలబ్రిటీస్‌తో ఇంటర్వూ అంటే ఎలా ఉంటుందో అని మొదట నేనే కొంచెం జంకాను. కానీ షోకి వచ్చిన స్టార్స్ అంతా కంఫర్టబుల్‌గా ఫీలయ్యారు. ఈ షూటింగ్ బెడ్ సెట్ మా ఇంట్లోనే వేశాం. కారణం భారతదేశంలోని ప్రముఖ నటీనటులంతా ఎన్నోసార్లు ఈ ఇంట్లో భోజనం చేశారు. వాళ్లంతా తిరిగిన ఈ ఇల్లు నాకు దేవాలయంతో సమానం. అంతేకాకుండా ఫ్రీ కూడా. సమంత ఈ షోకు వచ్చినప్పుడు, ‘‘పాపా.. నీ పని బాగుంది. పై నుంచి క్రిందకు దిగితే లొకేషన్. మేం రోజూ నిద్ర లేవగానే షూటింగ్ లొకేషన్ అంటూ ఎక్కడెక్కడికో వెళ్లాలి’ అంది. ► నేను చేసే ప్రతి షో ద్వారా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. లక్ష్మీ టాక్ షోలో అడిగిన ప్రశ్నలను ఈ షోలో అడగను. సెలబ్రిటీస్ కొన్ని వందల ఇంటర్యూలు ఇచ్చి ఉంటారు. ఆ ఇంటర్వూల్లో చెప్పినవి నా షోలో ఉండవు. అంతకుమించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. కానీ, నా షోకి వాళ్లను నైట్ డ్రెస్‌లో రమ్మన్నాను. అది వాళ్లకి, నాకు మధ్యలో ఉన్న సాన్నిహిత్యం అని చెప్పొచ్చు. ► ఏ సెలబ్రెటీ లైఫ్ అయినా ప్రతి ఆరు నెలలకోసారి మారుతుంది అనుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి సమంతానే తీసుకుందాం. చైతూతో పెళ్లికి ముందు ఓలాగా, పెళ్లి తర్వాత లైఫ్ ఓలాగా ఉంటుంది. ప్రభాస్‌ని తీసుకుంటే ‘బాహుబలి’ ముందు, తర్వాత అని చెప్పాలి. అవే నా షోలో అందంగా అడుగుతాను. ఈ ఇంటర్వూ వల్ల ఎవరి ఇమేజ్ మారదు. ఇట్స్ ఏ సింపుల్, ఫన్, హార్ట్ వార్మింగ్ షో మాత్రమే. ► ఇదే షోను పొలిటికల్ వాళ్లతో చేయలేం. వాళ్లంటే నాకు భయం. బెడ్ మీద కూర్చుని ఇంటర్వూ అంటే చాలా కష్టం. కానీ వాళ్లతో కావాలంటే కార్ డ్రైవ్ చేస్తూ ఇంటర్వూ చేస్తాను. నేను గతంలో వెబ్ సిరీస్ చేశాను. అది చాలా కష్టం. నాలుగు సినిమాలు చేసినంత కష్టంగా ఉంటుంది. ► ఇప్పటివరకు చేసిన అందరిలో వరుణ్ తేజ్ ఎపిసోడ్ చాలా బోల్డ్‌గా వచ్చింది. నానీతో త్వరలో షూట్ చేస్తాను. నాకున్న బలం ఏంటంటే.. చాలామంది ఆడవాళ్లు నా దగ్గరకొచ్చి ‘థ్యాంక్స్ లక్ష్మీ.. నీ వల్ల నేను నాకు ఇష్టం వచ్చినట్లు హ్యాపీగా ఉంటున్నాను’ అంటారు. అప్పుడు నేను గెలిచాను అనిపిస్తుంది. ► ప్రస్తుతం ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఒకప్పుడు మా నాన్న ఊటీలో షూటింగ్లో ఉంటే మేము ఫోన్ పక్కన కూర్చుని ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు హాలీవుడ్ తార కిమ్ కర్దషియాన్ తన బెడ్ రూమ్‌లో ఏం చేస్తుందో నేను నా బెడ్ రూమ్‌లో కూర్చుని చూస్తున్నానంటే ప్రపంచం ఎంత చిన్నదైందో చూడండి. మన ట్రెడిషన్ వదులుకోకుండా మారుతున్న పరిస్థితులను బట్టి మనమూ మారుతుండాలి. ► నా కూతుర్ని నీవు అమ్మాయా, అబ్బాయా అని అడిగితే నేను మనిషిని అని చెబుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ప్రపంచం మారుతుంది. ఫీట్ అప్ అంటేనే ఇంకొంచెం దగ్గరిగా కంఫర్ట్‌గా ఉండటం అని. నా షోలో చాలా సీక్రెట్స్ ఉంటాయి. అవి బయటకు వస్తాయి. -
రెట్రో బర్త్‌డే పార్టీ
ప్రతి బర్త్‌డేకి మనం కొంచెం ముందుకెళ్తుంటాం. అంటే వయస్సులో. కానీ ఈ బర్త్‌డేకి రాశీఖన్నా వెనక్కి వెళ్లారు. ఒక సంవత్సరం తగ్గిపోయిందా? అంటే కాదు.. ఏకంగా 20, 30 ఏళ్లు వెనక్కి. ప్రతి బర్త్‌డేని ఒక థీమ్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు రాశీ. ఈ ఏడాది పార్టీ థీమ్ రెట్రో. అంటే పాత కాలంలో ఎలా ఉండేదో అలా అన్నట్టు. పాత క్యాసెట్లు, టెలిఫోన్, టీవీలు డెకరేట్ చేసి పార్టీ చేసుకున్నారామె. గురువారం రాశీ ఖన్నా బర్త్‌డే. ప్రతి సంవత్సరం స్కూల్ ఫ్రెండ్స్ నుంచి, ప్రస్తుతం ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో సహా అందర్నీ ఆహ్వానించి సెలబ్రేట్ చేసుకుంటారు. మొన్న జరిగిన రాశీ బర్త్‌డే పార్టీలో కొన్ని ఫోటోలు. ఈ పార్టీలో రకుల్, మంచు లక్ష్మీ, రామ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, విద్యుల్లేఖా రామన్ తదితరులు పాల్గొన్నారు. -
కలర్ఫుల్గా లాక్మీ ఫ్యాషన్ వీక్
-
కళ్లజోడు కొట్టేసిన హీరోయిన్!
ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. అద్భుతమైన పొజిషన్ కాకపోయినా, పర్వాలేదనిపించేలాగే ఉంది. చాలా సినిమాల్లో తళుక్కుమంటుంది. మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాకపోయినా.. చక్కటి తెలుగు మాట్లాడుతుంది. ఇప్పటికే ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదూ.. ఆమే ఛార్మీ కౌర్. అలాంటి ఛార్మి.. ఉన్నట్టుండి ఓ దొంగతనం చేసింది. అది కూడా అక్కడ, ఇక్కడ కాదు.. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి దగ్గర. అవును.. మంచులక్ష్మి దగ్గరున్న ఓ కళ్లజోడును ఛార్మీ కొట్టేసింది. కళ్లజోడు పెట్టుకుని ఫొటో తీయించుకుని, ఆ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసింది. దాంతో ఎంతో ముచ్చట పడిపోయిన మంచు వారి ఆడపడుచు కూడా.. ఆ కళ్లజోడు నీకు చాలా బాగుందంటూ కితాబిచ్చింది. ఇదంతా ఎక్కడ అని మీకు డౌటొచ్చి ఉంటుంది కదూ.. సైమా అవార్డులకు వెళ్లినప్పుడు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి కమెడియన్ బ్రహ్మానందంతో కూడా ఓ ఫొటో తీయించుకున్నారు. ఆయన కూడా గాగుల్స్ పెట్టుకునే ఫొటో దిగడం విశేషం. I stole @LakshmiManchu sexxyyy glasses -
4 గంటల్లో.. పాట పాడేసింది!
లక్ష్మీ మంచు కొత్త అవతారంలోకి ప్రవేశించింది. కొన్నాళ్లు టీవీ హోస్ట్‌గా, తర్వాత నటిగా.. ఆపై నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు గాయనిగా మారింది. వంశీకృష్ణ దర్శకత్వంలో వస్తున్న 'దొంగాట' సినిమా కోసం ఆమె ఓ పాట పాడింది. తన మొట్టమొదటి పాటను ఆమె కేవలం నాలుగు గంటల్లోనే రికార్డు చేసేసిందట. వరికుప్పల యాదగిరి రాసిన ఈ పాటను తానే పాడాలని టీంలో అందరూ గట్టిగా పట్టుబట్టడంతో పాడానని, లిరిక్స్ చాలా సులభంగా ఉన్నాయని లక్ష్మి చెప్పింది. తాను ఈ లిరిక్స్‌ను సంగీతదర్శకుడు రఘు కుంచెకు పంపగా.. ఆయన కూడా తనను ప్రోత్సహించారని, తాను పాడగలనని ఆయనా నమ్మేశారని తెలిపింది. వాస్తవానికి లక్ష్మి తండ్రి మోహన్ బాబు ఆమెను గాయనిగా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆయన కల నెరవేర్చేందుకు ఇప్పుడు గొంతు సవరించుకున్నట్లు తెలుస్తోంది. తాను శాస్త్రీయ సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా ఎప్పుడూ హెచ్చుస్థాయి స్వరాలు పాడలేకపోయేదాన్నని, దాంతో అసలు గాయని కాలేనని అనుకున్నానని చెప్పింది. అమెరికా వెళ్లాక గొంతు మార్చుకున్నట్లు తెలిపింది. పాట పాడి, రికార్డు చేసిన విషయాన్ని తన తండ్రికి చెప్పడానికి చాలా సిగ్గు పడ్డానని, ఏదో వినిపించినట్లుగా వినిపిస్తే ఆయనకు చాలా నచ్చిందని సంతోషంగా వివరించింది. వెంటనే రఘు కుంచెకు, విష్ణు, మనోజ్‌లకు కూడా ఆయన ఫోన్లు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారట. వాస్తవానికి 2012లో విడుదలైన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని 'డిస్ట్రబ్ చేస్తున్నాడే' పాటను కూడా లక్ష్మితోనే పాడించాలని రఘుకుంచె అప్పట్లో ప్రయత్నించి.. విఫలమయ్యారు. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఆమెతో పాడించానని, ఈ పాటలో ఆమెతో మరీ హెచ్చుస్థాయి స్వరాలు కూడా పలికించలేదని రఘు చెప్పారు. How my Donga team really feels abt my signing. #Dongaata #funtimes #artistlife pic.twitter.com/ZNGoQ5iAEc — Lakshmi Manchu (@LakshmiManchu) April 2, 2015 -
'చందమామ కథలు'కు జాతీయ అవార్డు
-
'చందమామ కథలు'కు జాతీయ అవార్డు
ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపిక జాతీయ ఉత్తమచిత్రం.. క్వీన్ ఉత్తమ నటి.. కంగనా రనౌత్ ప్రజాదరణ పొందిన చిత్రం.. మేరీకోమ్ న్యూఢిల్లీ 'చందమామ కథలు' సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా జాతీయ అవార్డు అందుకుంది. దీంతో ఆ సినిమాలో నటించిన మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ''ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. నా సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పుడే తెలిసింది. యాయాయాయా...'' అంటూ ఆనందం ప్రకటించారు. బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న క్వీన్ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అందులో అద్భుతమైన నటనను ప్రదర్శించిన కంగనా రనౌత్ జాతీయ ఉత్తమనటిగా కూడా ఎంపికయ్యారు. 62వ జాతీయ సినిమా అవార్డులను మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రియాంకా చోప్రా నటించిన 'మేరీకోమ్' నిలిచింది. చైతన్య తమ్హానే తీసిన కోర్ట్ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిలింగా ఎంపికైంది. కన్నడ చిత్రం నాను అవనల్ల అవలు అనే సినిమాలో నటించిన హీరో విజయ్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. Omg omg omg #chandamamaKathalu just won the national award for the best regional film. Yayayayayayayyayayayayay. ???????????? — Lakshmi Manchu (@LakshmiManchu) March 24, 2015 -
సూర్య క్రియ - ఒక శక్తిమంతమైన ప్రాచీన యోగా ప్రక్రియ!
యోగా మేము సూర్యుడికి సంబంధించిన ఒక సాధనను నేర్పడం మొదలుపెట్టాము. ఇది సూర్య నమస్కారం లాగానే ఉంటుంది కానీ, ‘సూర్య క్రియ’ అని పిలుస్తాం. ఎందుకంటే ఇందులో ఒక నిర్దిష్ట స్థాయిలో శ్వాసను గమనించడం, శక్తిని బలంగా ఉత్తేజపరచడం ఉంటాయి. మీతో సహా ఈ గ్రహం మీద ఉన్న ప్రతీ జీవి సౌరశక్తి మీదే ఆధారపడి ఉంది. ఈ భూమి మీద మీరు అనుభవిస్తున్న వేడి అంతా ప్రాథమికంగా సూర్యుడి నుండి వచ్చినదే. కాకపోతే అదే వివిధ రూపాలలో నిల్వచేయబడి, వ్యక్తమౌతున్నది. మీరు ఒక చెక్క ముక్కను తీసుకుని కాలిస్తే అది సౌర శక్తినే విడుదల చేస్తుంది. సౌర శక్తిని మనం తీసేస్తే, ఈ గ్రహమంతా మంచుగా గడ్డ కట్టుకుపోతుంది. ‘సూర్య నమస్కారం’ అనే పేరు కేవలం నామమాత్రమైనది కాదు. ఈ సాధన ముఖ్యంగా మీ నాభీచక్రాన్ని (సోలార్ ప్లెక్సస్) ఉత్తేజపరిచి, మీ సమత్ ప్రాణాన్ని, అంటే మీ శరీర వ్యవస్థలోని సౌర తాపాన్ని ప్రేరేపిస్తుంది. సూర్య క్రియ సాధన పైకి భౌతికమైనదిగానే కనిపిస్తుంది కానీ, అందులో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. నిజానికి సూర్య క్రియే అసలైన సాధన. ఇది సూర్యుడితో మిమ్మల్ని మీరు అనుసంధానం చేసుకునేమార్గం. ఇది చాలా మెరుగైన ప్రక్రియ. దీంట్లో శరీరపు అమరికపై (జామెట్రీపై) చాలా ధ్యాస పెట్టవలసి ఉంటుంది. నిజానికి సూర్య నమస్కారం దీనికి దూరపు చుట్టం. మీరు కండలను పెంచుకోవాలనుకుంటే, మీకు శారీరక దారుఢ్యంతో పాటు ఆధ్యాత్మికత కూడా కావాలనుకుంటే సూర్య నమస్కారం చేయండి. మీరు చేసే భౌతిక ప్రక్రియలో ఒక శక్తిమంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఉండాలనుకుంటే, మీరు సూర్యక్రియ చేయండి. మానవ శరీర నిర్మాణంలో సూర్యుడు, భూమి, చంద్రులకు ముఖ్యమైన పాత్ర ఉంది. సౌర వ్యవస్థలో జరిగే మార్పులు 12 1/4 నుండి 12 1/2 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతాయి. మీరు వీటితో అనుసంధానమై జీవిస్తే, అది మీకు శ్రేయస్సు కలిగిస్తుంది. మీ భౌతిక శరీరంలో పునరావృతమయ్యే వాటిని కూడా 12 1/4 నుండి 12 1/2 సంవత్సరాలకు ఒకసారి సంభవించేటట్లు చేసేందుకు సూర్యక్రియ ఒక మార్గం. మీ లోపలా, బయటా ఒక రకమైన స్థితిని ఏర్పరచుకోవడానికి సూర్యక్రియ దోహదపడుతుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ జీవన ప్రక్రియకు ఎటువంటి అవరోధాన్ని గానీ, ఇబ్బందిని గానీ కలిగించవు. ప్రేమాశీస్సులతో, సద్గురు ఫొటోలు : శివ మల్లాల మంచు లక్ష్మీప్రసన్న -
స్వచ్ఛభారత్‌లో మంచు మనోజ్, లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లింగంపల్లి రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం వల్ల దేశం బాగుపడుతుందంటే అందుకు తమ మద్దతు తప్పనిసరిగా ఉంటుందని మనోజ్ తెలిపాడు. అయితే ప్రచార ఆర్భాటాల కోసం మాత్రం స్వచ్ఛభారత్‌ను ఉపయోగించుకోవద్దని రాజకీయ, సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమా హీరోలు అంతా కలిసి ప్రతిచోటా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపాడు. ఇక మరోవైపు మనోజ్ సోదరి, నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా ఫిల్మ్‌నగర్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఫిల్మ్‌నగర్ బస్తీ రోడ్లతో పాటు, అక్కడి ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. Supporting #SwachhBharat campaign today at Lingampally Railway Station.Welcoming all to Join Me. Be there darlings :) pic.twitter.com/ryRwa1sj7e — Manchu Manoj (@HeroManoj1) November 21, 2014 -
వాక్ ఫర్ చారిటీ