ఆమె ఓ టాలీవుడ్ హీరోయిన్. అద్భుతమైన పొజిషన్ కాకపోయినా, పర్వాలేదనిపించేలాగే ఉంది. చాలా సినిమాల్లో తళుక్కుమంటుంది. మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాకపోయినా.. చక్కటి తెలుగు మాట్లాడుతుంది. ఇప్పటికే ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదూ.. ఆమే ఛార్మీ కౌర్. అలాంటి ఛార్మి.. ఉన్నట్టుండి ఓ దొంగతనం చేసింది. అది కూడా అక్కడ, ఇక్కడ కాదు.. ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి దగ్గర.
అవును.. మంచులక్ష్మి దగ్గరున్న ఓ కళ్లజోడును ఛార్మీ కొట్టేసింది. కళ్లజోడు పెట్టుకుని ఫొటో తీయించుకుని, ఆ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసింది. దాంతో ఎంతో ముచ్చట పడిపోయిన మంచు వారి ఆడపడుచు కూడా.. ఆ కళ్లజోడు నీకు చాలా బాగుందంటూ కితాబిచ్చింది. ఇదంతా ఎక్కడ అని మీకు డౌటొచ్చి ఉంటుంది కదూ.. సైమా అవార్డులకు వెళ్లినప్పుడు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి కమెడియన్ బ్రహ్మానందంతో కూడా ఓ ఫొటో తీయించుకున్నారు. ఆయన కూడా గాగుల్స్ పెట్టుకునే ఫొటో దిగడం విశేషం.
I stole @LakshmiManchu sexxyyy glasses