
పిల్లల పెంపకం అంత ఈజీ కాదు, ఎన్నో సమస్యలు ఉంటాయంటున్నారు నటి, నిర్మాత లక్ష్మీ మంచు. నిజమే.. పిల్లల పెంపకం అంత సులువు కాదు. అందుకే పిల్లల పెంపకంలో ఉండే ఒక్కో సమస్యను ప్రస్తావిస్తూ, వీడియోలు తయారు చేస్తున్నారామె. వీటిని ‘చిట్టి చిలకమ్మ’ యుట్యూబ్ చానల్ ద్వారా ప్రసారం చేస్తారు. విశేషం ఏంటంటే.. తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి లక్ష్మీ మంచు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం గురించి డా. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా నా కుమార్తె, నా ముద్దుల మనవరాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. పిల్లల మంచి కోసం ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నానని నా బిడ్డ లక్ష్మీప్రసన్న చెప్పినప్పుడు ఒక తండ్రిగా నాకు ఆనందంగా, గర్వంగా అనిపించింది. ఈ మంచి ప్రయత్నం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. ప్రతి వారం ప్రసారమయ్యే ఈ షార్ట్ వీడియోస్‌లో ఓ ప్రముఖ మానసిక వైద్యురాలు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment