problams
-
బంగ్లాదేశ్ ఎన్నికలతో భారత్, పాక్, చైనాలకు లింకేమిటి?
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. బంగ్లాదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాజీ హబీబుల్ అవల్ 2024 జనవరి 7న కొత్త పార్లమెంటును ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ ప్రజలను ఉద్దేశించి అవల్ మాట్లాడుతూ ఎన్నికలకు ఇదే సరైన సమయమని అన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉంటామన్నారు. బంగ్లాదేశ్‌లో గత సార్వత్రిక ఎన్నికలు 2018లో జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈసారి కూడా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్- ఖలీదా జియా పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఈ ఎన్నికలు భారత్, చైనా, పాకిస్తాన్లకు కూడా అత్యంత కీలకంగా పరిణమించనున్నాయి. బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2018 ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా షేక్ హసీనా గెలిచారని ఖలీదా జియా పార్టీ ఆరోపిస్తోంది. షేక్ హసీనా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సామాన్య ప్రజలను అణచివేశారని, ఈసందర్భంగా ఇప్పటివరకు మూడు వేల మంది చనిపోగా, వేలాది మంది అమాయకులు కటకటాల వెనుక ఉన్నారంటూ జియా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 4000 కిలోమీటర్లకు పైగా భారతదేశ సరిహద్దులు బంగ్లాదేశ్‌తో ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత హసీనా ప్రభుత్వానికి భారత్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారితే భారతదేశానికి అనేక రంగాల్లో ఎదురుదెబ్బ తగలవచ్చు. ఎందుకంటే ఖలీదా జియా చేస్తున్న రాజకీయాలను పాకిస్తాన్ సమర్థిస్తూ వస్తోంది. ఖలీదా జియా పార్టీపై పాకిస్తాన్ అనేక ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రెండు దేశాలు మళ్లీ అనేక రంగాల్లో భాగస్వాములు అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పెద్ద సంఖ్యలో చైనా వలసదారులు నివసిస్తున్నారు. చైనా తన నూతన ప్రాజెక్ట్ ద్వారా బంగ్లాదేశ్‌లో తన ఉనికిని పెంచుకుంటోంది. 2016లో బంగ్లాదేశ్‌తో చైనా 26 ఒప్పందాలపై సంతకాలు చేసింది. బంగ్లాదేశ్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఆ ఇరుదేశాల పరస్పర వాణిజ్యం విలువ 10 బిలియన్ డాలర్లు(ఒక బిలియన్ అంటే రూ.100 కోట్లు) అటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారితే చైనాకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: 19 అగ్నిపర్వతాలు ఒకేసారి పేలాయా? -
చిట్టి చిలకమ్మ
పిల్లల పెంపకం అంత ఈజీ కాదు, ఎన్నో సమస్యలు ఉంటాయంటున్నారు నటి, నిర్మాత లక్ష్మీ మంచు. నిజమే.. పిల్లల పెంపకం అంత సులువు కాదు. అందుకే పిల్లల పెంపకంలో ఉండే ఒక్కో సమస్యను ప్రస్తావిస్తూ, వీడియోలు తయారు చేస్తున్నారామె. వీటిని ‘చిట్టి చిలకమ్మ’ యుట్యూబ్ చానల్ ద్వారా ప్రసారం చేస్తారు. విశేషం ఏంటంటే.. తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి లక్ష్మీ మంచు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం గురించి డా. మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా నా కుమార్తె, నా ముద్దుల మనవరాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. పిల్లల మంచి కోసం ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నానని నా బిడ్డ లక్ష్మీప్రసన్న చెప్పినప్పుడు ఒక తండ్రిగా నాకు ఆనందంగా, గర్వంగా అనిపించింది. ఈ మంచి ప్రయత్నం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను’’ అన్నారు. ప్రతి వారం ప్రసారమయ్యే ఈ షార్ట్ వీడియోస్‌లో ఓ ప్రముఖ మానసిక వైద్యురాలు పాల్గొంటారు. -
బీమా పాలసీ కొనసాగించలేకపోతున్నారా?
కారణాలేవైనా కానీ మీరు తీసుకున్న బీమా పాలసీని కొనసాగించలేకపోతున్నారా..? ప్రీమియం చెల్లింపును భారంగా భావిస్తున్నారా..? దీంతో పాలసీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీ ముందు ఓ చక్కని మార్గం ఉంది. పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. దీనికంటే పెయిడప్ పాలసీగా మార్చుకుంటే సరి. ఈ అవకాశం ఎండోమెంట్ పాలసీల్లో ఉంటుంది. ఎండోమెంట్ పాలసీలు బీమా రక్షణతోపాటు, పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. ఈ ఎండో మెంట్ పాలసీ కాల వ్యవధి ముగియక ముందే దాన్ని నిలిపివేయాలని భావిస్తే రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని పెయిడప్ పాలసీగా మార్చుకోవడం ఒకటి. ఇలా చేస్తే బీమా కవరేజీ కొనసాగుతుంది. లేదా పాలసీని బీమా సంస్థకు స్వాధీనం చేసి సరెండర్ వ్యాల్యూని పొందడం. ఈ రెండు మార్గాల్లో ఉన్న మంచి చెడులను తెలియజేసే కథనమే ఇది. పెయిడప్ పాలసీ పెయిడప్ పాలసీ ఆప్షన్లో జీవిత బీమా నిర్ణీత కాలం వరకు కొనసాగడం అనుకూలతగా చెప్పుకోవాలి. అంటే ప్రీమియం చెల్లించకపోయినా కానీ, ఈ కవరేజీ కొనసాగుతుంది. అలాగే, పాలసీ కాల వ్యవధి సమయంలో పాలసీదారు మరణిస్తే సమ్ అష్యూరెన్స్ (బీమా మొత్తం)ను నామినీకి చెల్లించడం జరుగుతుంది. పాలసీదారు జీవించి ఉంటే మెచ్యూరిటీ లభిస్తుంది. కాకపోతే పాలసీని పెయిడప్‌గా మార్చుకుంటే చివర్లో వచ్చే ప్రయోజనాలు కొంత తగ్గిపోతాయి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక. దాంతో కాల వ్యవధి తీరిన తర్వాత పాలసీదారుకు లభించే మొత్తం తగ్గుతుంది. పెయిడప్‌గా మార్చిన నాటి నుంచి ప్రీమియం చెల్లించరు కనుక వార్షికంగా తాజా బోనస్‌లు కూడా నిలిచిపోతాయి. అప్పటి వరకు సమకూరిన బోనస్‌లను కాల వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తారు. ‘‘ఇటీవలి ఐఆర్డీఏఐ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నిబంధనలు 2019 ప్రకారం పెయిడప్కు అర్హమైన పాలసీల్లో చెల్లించాల్సిన కనీస ప్రీమియం రెండు సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది. అంటే ఇంకా మిగిలి ఉన్న కాలంతో సంబంధం లేకుండా అన్ని పాలసీలకు పెయిడప్ విషయంలో రెండేళ్ల ప్రీమియం చెల్లిస్తే చాలు’’ అని హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీ తెలిపింది. యూనిట్ లింక్డ్ ప్లాన్ (యులిప్)లను కూడా పెయిడప్ పాలసీలుగా మార్చుకోవచ్చు. అయితే, లాకిన్ పీరియడ్ వరకు (ఐదేళ్ల పాటు) అందులో కొనసాగాల్సి ఉంటుంది. పాలసీదారుపై చార్జీల భారం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే యులిప్‌లలో జీవిత బీమా కవరేజీ రిస్క్ చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఫండ్ నిర్వహణ చార్జీలు కొనసాగుతాయి. నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీల్లో పెయిడప్‌గా మారిన తర్వాత ఎటువంటి చార్జీలను విధించడం జరగదు. స్వాధీనం చేస్తే..? ఒకవేళ పాలసీలో కొనసాగకూడదని భావిస్తే దాన్ని స్వాధీనం చేసి స్వాధీన విలువను (సరెండర్ వ్యాల్యూ) పొందొచ్చు. సరెండర్ చేసినట్టయితే ఆ తర్వాత బీమా కవరేజీ కూడా ముగిసినట్టే. ఈ ఆప్షన్లోనూ కనీసం కొంత కాలం పాటు ప్రీమియం చెల్లింపు తర్వాతే సరెండర్ చేయడానికి వీలుంటుందని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ అక్షయ వైద్య తెలిపారు. యులిప్‌లలో కనీసం ఐదేళ్లు కొనసాగిన తర్వాతే సరెండర్‌కు వీలుంటుంది. యులిప్‌లలో ఐదేళ్లు ప్రీమియం చెల్లింపు తర్వాత ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసే నాటికి ఉన్న ఫండ్ విలువ ను చెల్లించడం జరుగుతుంది. ముందుగా వైదొలిగినందుకు ఎటువంటి చార్జీల విధింపు ఉండదు. అదే నాన్ లింక్డ్ ప్లాన్లలో అయితే రెండేళ్ల తర్వాత స్వాధీనం చేయవచ్చు. సరెండర్ చార్జీలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలసీ స్వాధీనం విషయంలో చెల్లించాల్సిన కనీస మొత్తాలను ఐఆర్డీఏఐ నిర్దేశించింది. అయితే, పాలసీ తొలి నాళ్లలో స్వాధీనం చేసినట్టయితే, చెల్లించిన ప్రీమియంలో 50%వరకు నష్టపోవాల్సి రావచ్చు. నాన్లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్‌ను రెండో ఏడాది స్వాధీనం చేస్తే చెల్లించిన మొత్తం ప్రీమియంలో 30 శాతమే వెనక్కి వస్తుంది. మూడో ఏడాది స్వాధీనం చేస్తే 35% లభిస్తుంది. పాలసీ తొలినాళ్లలో స్వాధీనం చేయడం ద్వారా ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. పాలసీ తొలి ఏడేళ్ల కాలంలో స్వాధీనం చేస్తే ఎంత చెల్లించాలన్న దానిని ఐఆర్డీఏఐ పేర్కొంది. పెయిడప్, సరెండర్... ఏది నయం? ఒక్కసారి ఎండోమెంట్ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత కనీసం రెండేళ్లు అయినా ప్రీమియం చెల్లిచాలి. అప్పుడే దాన్నుంచి పెద్దగా నష్టం రాదు. బీమాతోపాటు పొదుపు కలసిన పాలసీల్లో రెండేళ్లలోపే బయటపడితే వచ్చేదేమీ పెద్దగా ఉండదు. కనీసం రెండేళ్లు చెల్లించిన తర్వాత పెయిడప్, సరెండర్ ఆప్షన్లను పరిశీలించొచ్చు. అయినా కానీ తొలినాళ్లలో ఇలా చేయడం వల్ల అంత ప్రయోజం ఉండదు. పెయిడప్, సరెండర్ ఈ రెండింటిలో ఏది నయం? అన్న ప్రశ్నే ఎదురైతే పెయిడప్‌గా మార్చుకోవడమే మంచిది. ఎందుకంటే, ఇందులో జీవిత బీమా కొనసాగుతుంది. కాల వ్యవధి తీరాక కొంత వెనక్కి వస్తుంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే నామినీకి పరిహారం దక్కుతుంది. మరో జీవిత బీమా పాలసీ తీసుకున్నా తర్వాతే ఒక పాలసీ నుంచి వెదొలగడాన్ని పరిశీలించాలి. -
ప్రసవ వేదన
సాక్షి, సాలూరు: గిరిశిఖర గ్రామాల గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. కాన్పుకు ముందే ఆస్పత్రుల్లో చేరాలన్న వైద్యుల సూచనను పట్టించుకోకపోవడం కష్టాలకు గురిచేస్తోంది. అత్యవసర వేళ నరకయాతన పడుతున్నారు. దీనికి పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ ఈతమానువలస గ్రామానికి చెందిన లావుడుజన్ని కస్తూరీ ప్రసవ వేదనే నిలువెత్తు సాక్ష్యం. కస్తూరీకి బుధవారం అర్ధరాత్రి పురుటినొప్పులు వచ్చాయి. రోడ్డు సదుపాయం ఉండడంతో 108కు ఫోన్ చేశారు. అయితే, గ్రామానికి వెళ్లే మార్గంలో మసాలాగెడ్డపై వంతెన లేకపోవడం, వర్షాలకు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. డోలీ సహాయంతో గెడ్డ సమీపం వరకు గర్భిణిని తీసుకొచ్చారు. గెడ్డ దాటే అవకాశం లేక అక్కడ గురువారం ఉద యం వరకు నిరీక్షించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు పాచిపెంట వీరంనాయుడు గర్భిణీని తరలించే ఏర్పాట్లు చేశారు. మంచానికి తాళ్లు కట్టి డోలీగా మార్చారు. అందులో కస్తూరిని పడుకోబెట్టి అతికష్టం మీద వాగును దాటించారు. ప్రైవేటు వాహనంలో ఆమెను పాచిపెంట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి సాలూరు సీహెచ్‌సీకు, తరువాత విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. గురువారం సాయంత్రం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గర్భిణి ప్రసవ కష్టాలను పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారి లక్ష్మివద్ద ప్రస్తావించగా కేసు పార్వతీపురానికి చెందినదిగా పేర్కొన్నారు. ఆమెను జీఎల్ పురం వైటీసీలోని గిరిశిఖర గర్భిణుల వసతి గహంలో చేర్పించాల్సి ఉందన్నారు. ఆమె ఈతమానువలస గ్రామానికి 10 రోజులు క్రితమే వచ్చిందని, హైరిస్క్ కేసుగా గుర్తించి రిఫర్ చేసినా వినిపిం చుకోలేదన్నారు. -
‘డబుల్’ ట్రబుల్
కోల్‌బెల్ట్(భూపాలపల్లి జిల్లా): సింగరేణి సంస్థలో కొంత కాలంగా విధులు నిర్వహించి పలు కారణాలతో దిగి పోయిన విశ్రాంత కార్మికుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది. సింగరేణిలో ఉద్యోగం చేయాలంటే నాడు భయపడే రోజుల్లో కొంత మందిని బలవంతంగా అధికారులు విధుల్లోకి తీసుకున్నారు. మరికొంత మంది తప్పని పరిస్థితుల్లో ఏ ఆధారం లేని వారు సింగరేణిలో బినామీ పేరుతో పనులు చేశారు. వివిధ హోదాల్లో సుమారు 30 ఏళ్లపాటు పనులు చేసి ఉద్యోగ విరమణ అనంతరం వారి పరిస్థితి అయోమయంగా మారింది. అసలు పేరు ఒకటి ఉండటం, సింగరేణిలో మరో పేరు ఉండటం మూలంగా ఉద్యోగ విరమణ అనంతరం సంస్థ నుంచి వచ్చే బెనిఫిట్స్ పొందక రెంటికి చెడ్డ రేవడిగా మారింది విశ్రాంత కార్మికుల పరిస్థితి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 500 పైగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సంస్థ నుంచి లభించని సహకారం.. రెండు పేర్లతో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సంస్థ నుంచి ఎటువంటి సహకారం లభించక పోవటం ఆయా కుటుంబాల పరిస్థితి అరణ్య రోదనగా మారింది. సింగరేణిలో డబుల్ నేమ్ కలిగిన వారు సమస్యను ఎదుర్కొంటున్నారు. సంస్థలో ఓ పేరు, బయట అసలు పేరు ఉండటం వారు ఇప్పటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచక మదన పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారు సంస్థలో ఉన్న పేరుతో మాత్రమే పెన్షన్ పొందుతుండగా వారి డిపెండెంట్లు అసలు పేరుతో ఉండటం మూలంగా వారసత్వఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో సైతం వీరు అనర్హులుగా మిగలటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు సింగరేణి సంస్థ ఇంటిపేరు, పేరులో తప్పులు ఉంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించింది. అదే మాదిరిగా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు వన్‌టైం సెటిల్మెంట్ కింద పేర్లు తదితర వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించాలని సింగరేణి వ్యాప్తంగా కోరుతున్నారు. ఇందుకు సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సైతం చొరవ చూపాలని ప్రాధేయ పడుతున్నారు. భూపాలపల్లి ఏరియాలో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో 2017లో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సైతం వన్‌టైం సెటిల్మెం ట్ కింద డబుల్ నేమ్ కలిగిన వారికి అవకాశం కల్పించాలని కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌ను కోరారు. సమస్యను సత్వరం పరిష్క రించాలని విశ్రాంత కార్మికులు కోరుతున్నారు. చిన్న తప్పిదంగా భావించాలి వాస్తవానికి సింగరేణిలో ఉద్యోగం చేసేందుకు భయపడిన రోజుల్లో జరిగిన చిన్న తప్పిదానికి జీవితాంతం విశ్రాంత కార్మికులు నష్ట పోతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఈ విషయంలో యాజమాన్యాన్ని ఒప్పించి సవరించాలి. – పసునూటి రాజేందర్, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు సవరణకు అవకాశం ఇవ్వాలి అనుకోని పరిస్థితుల్లో ఇతర పేర్ల మీద పని చేస్తున్న కార్మికులు, విశ్రాంత కార్మికులకు తమ పేర్లను సవరించుకొనేందుకు అవకాశం కల్పించాలి. ఇప్పటికే డబుల్ నేమ్ మూలంగా వందలాది మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సంస్థ నుంచి వచ్చే ప్రయోజనాలు సైతం కోల్పోతున్నందున మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. – ఎం.రమేష్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి -
సమస్యలు రాజ్యమేలుతున్నాయి..
సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కర్షకులు... మత్స్యకారులు... దినసరి కూలీలు... లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనుల పేరుతోమితిమీరిన అవినీతి చోటుచేసుకుంది. మరుగుదొడ్లలో అక్రమాల గుట్టు బట్టబయలవుతోంది. హౌస్‌ఫర్ ఆల్ బండారం బటయపడింది. కరువుతో రైతాంగం అల్లాడుతోంది. ఉన్న ఊళ్లో బతుకు లేక వలసవెళ్లిన మత్స్యకారులకు ఎంత కష్టం ఎంత కష్టం... పాక్‌చెరలో బందీగా మారి బిక్కుబిక్కుమంటున్న వారిని పట్టించుకునేవారెవరు? ఇవన్నీ చర్చించడానికి మళ్లీ ఓ వేదిక దొరికింది అదే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. మంగళవారం జరగనున్న ఈ సమావేశంలో ఈ సమస్యలు చర్చకు వస్తాయో రావో... విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అన్ని వర్గాలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి పరిష్కారంపై పాలకులు దృష్టిసారించడం లేదు. కనీసం మంగళవారం జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలోనైనా దీనిపై చర్చిస్తారో లేదోనని జిల్లా ప్రజా నీకం ఎదురు చూస్తోంది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది రైతులు అప్పుల ఊబితో కూరుకుపోయారు. ఖరీప్ లో వరి పంట 1,19,735 హెక్టార్లలో సాగవ్వగా 50 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లింది. జిల్లాలో 26 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు మండలాలనే మాత్రమే కరువు జాబితాలో చేర్చింది. కరువు కారణంగా రైతాంగం ఎకరానికి రూ. 20 వేల వరకు నష్టపోయారు. కరువు మండలంగా ప్రకటిస్తే కనీసం కొంతలో కొంతైనా ఊరట లభిస్తుందని రైతులు వేడుకుంటున్నారు. సర్కారు దీనిపై పునరాలోచించాలి. మరి జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు జిల్లాలో బాలికలపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. గత ఏడాది సీతానగరం వద్ద పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడి చేసి హతమార్చగా... తాజాగా ఎస్.కోట మండలం ఐతినపాలెం వద్ద తొమ్మిదేళ్ల బాలికపై మరో కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. వీటిని నియంత్రించడానికి చేపడుతున్న చర్యలేమిటో తేల్చాలి. బిక్కుబిక్కుమంటూ మత్స్యకారులు జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లి అక్కడినుంచి పొరపాటున పాక్‌జలాల్లోకి వెళ్లి అక్కడి కోస్టుగార్డులకు చిక్కి ప్రస్తుతం అక్కడ బందీలుగా మారారు. వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ఇక్కడ వారి కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ తమవారికోసం ఎదురు చూస్తున్నారు. కనీసం వారికి సాంత్వన చేకూర్చే ప్రయత్నమూ చేయడం లేదు. విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి మొన్నటి వరకు డెంగీ వ్యాధి కోరలు చాపింది. తాజాగా స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. జిల్లాలో నెల రోజుల్లో 13 మంది స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. వారిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందులో 9 నెలలు పాప కూడా ఉంది జిల్లాలో వైద్యం దైవాధీనంగా మారింది. ముఖ్యంగా జిల్లా కేంద్రాస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పూసపాటి రేగ మండలం పోరాం గ్రామానికి చెందిన జి.స్వాతి అనే గర్భిణి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేంద్రాస్పత్రి వస్తే చికిత్స అందించడంలో జాప్యం చేయడం వల్ల ఆమెకు అబార్షన్ అయింది. దీంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. అదేవిధంగా ఘోషాస్పత్రిలో కొద్ది రోజుల క్రితం గుమ్మలక్ష్మిపురానికి చెందిన ఓ గర్భిణి మరుగుదొడ్డిలో ప్రసవించింది. ఈ రెండు ఆస్పత్రిల్లో రోగులకు సకాలంలో వైద్యం అందచరనే ఆరోపణలు ఉన్నాయి. -
నాతో నేను!
రోజూ మనల్ని ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు. ఇష్టం ఉంటే మనం కూడా మాటలు కలుపుతాం. కానీ మాట్లాడిన అందరూ మనకు మిత్రులైపోరు. ఒకవేళ మిత్రులైనా అందరితో అన్నీ పంచుకోలేం. అందుకే రోజులో ఒకసారైనా మనల్ని మనం పలకరించుకుని, ఆత్మపరిశీలన చేసుకుంటూ లైఫ్‌లో ముందుకు వెళ్లాలి. ఇదే విషయాన్ని చెబుతున్నారు కథానాయిక త్రిష. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆమె ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటారట. ‘‘నాతో నేను ఎక్కవ టైమ్ గడపడమే నా స్ట్రైస్ బస్టర్. అవసరమైతే సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటాను. నాకు గ్రేట్ ఫ్యామిలీ ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు. వారితో కూడా టైమ్ స్పెండ్ చేస్తా. కానీ నాకు నేను తోడుగా ఉండటం మాత్రం మరిచిపోను’’ అంటున్నారు త్రిష. ఇక సినిమాల విషయానికొస్తే... ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు కంప్లీట్ అవుతున్నప్పటికీ ఆమె జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రజెంట్ అరడజను తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు త్రిష. ఆమె నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. మరో మూడు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. -
కరువు అంచనా...అంతా వంచన
కరువు పరిశీలనకు కేంద్ర అధికారుల బృందం వస్తుందని రైతులు, కూలీలు సంతోషించారు. తమ కష్టాలు విని ఉపశమనం కలిగిస్తారని భావించారు. తీరా వచ్చాక కనీసం ఒకచోట పది నిమిషాలు కూడా గడపలేదు. రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు, కష్టాలు వారికి తెలుపుకుందామని వారి వద్దకు వెళ్లగా చివరకు నిరాశే మిగిలింది. తూతూమంత్రంగా వారితో మాట్లాడారు. కనీసం వివరాలు కూడా నమోదు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో కరువు బృందం పరిశీలన తమకు ఎంతమేర ఉపశమనం కలిగిస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బద్వేలు : రబీ సీజనుకు సంబంధించి కేంద్ర కరువు పరిశీలన బృందం బుధవారం కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు, ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. పంటనష్టం, తాగునీటి సరఫరా, ఉపాధి పనుల తీరు తదితరాలను పరిశీలించారు. ఈ బృందంలో హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ బీకే శ్రీవాత్సవ, ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డిప్యూటీ డైరెక్టరు ముఖేష్‌కుమార్, అగ్రి ఇన్పుట్స్ పరిశోధనాధికారి అనురాధ బటానా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం విజయకుమార్ ఉన్నారు. ఒకరోజు పరిధిలో రెండు మండలాల్లో ఆరు ప్రాంతాల్లో కరువు బృందం పర్యటన ఏర్పాటు చేయడంలోనే అధికారుల చిత్తశుద్ధిలోపం కనిపిస్తోంది. గుంతలతో కూడిన మట్టి రోడ్లపై దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించడం, నాలుగు ప్రాంతాల్లో రైతులు, కూలీలతో ముఖాముఖి, మూడు ప్రాంతాల్లో చెరువుల పరిశీలన ఎలా సాధ్యమనే విషయాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఒక రోజు వ్యవధిలో వీటన్నింటిని పూర్తి చేసుకుని తూతూమంత్రంగా తమ పర్యటనను ముగించారు. ఉపాధి కష్టాలకు గంతలు కరువు పరిశీలన బృందం మొదట సావిశెట్టిపల్లె సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అక్కడ కొండవాలున తవ్విన కందకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా అధికారులు కూలీలతో పనులు బాగున్నాయని, కూలీ నగదు అందుతున్న రీతిలో చెప్పించారు. దీంతో పాటు పని వద్ద నీడ ఏర్పాట్లు, మజ్జిగ అందజేత, మెడికల్ కిట్లు అందించామని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందరోజులు పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ దాదాపు వందమంది కూలీలు ఉండగా వారిలో కేవలం నలుగురో ఐదుగురో వంద రోజులు పనిచేశారు. కేవలం వీరిని మాత్రమే అధికారులతో మాట్లాడించారు. మెడికల్ కిట్లు అందజేసి నాలుగేళ్లు అవుతోంది. ఈ ఏడాది నీడ కోసం టెంట్లు అందించలేదు. అలాగే ఎండలకు నీటి వసతి, మజ్జిగ సౌకర్యం కల్పించలేదు. కానీ ఇవన్ని కూలీలు చెప్పకుండా కేవలం పనులు బాగున్నట్లు మాత్రమే చెప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది నెలల తరబడి ఉపాధి వేతనం రాకున్నా ఆ సమస్యను మాత్రం కేంద్రం బృందం దృష్టికి మాత్రం తీసుకురాలేదు. చెరువుల పరిశీలన అంతకుమునుపు ఇటుకలపాడు చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు, నీటి ఒరవ, పంటల సాగు వంటి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాలాయపల్లెలో కూడా చెరువును పరిశీలించారు. చెరువు 45ఎకరాల విస్తీర్ణంలో ఉండగా చాలావరకు ఆక్రమణకు గురైంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించలేదు. చెరువుకు ఒరవ తక్కువగా ఉందని. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెప్పారు. ఇటుకలపాడు, బాలాయపల్లె చెరువులకు తెలుగుగంగ ఎడమ కాలువ నుంచి ఎత్తిపొతల పథకం ఏర్పాటు చేసి నీటిని అందించాలని విన్నవించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం, జేడీఏ ఠాకూర్‌నాయక్, ఏడీ క్రిష్ణమూర్తి, డ్వామా పీడీ హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావు, డీడీ మురళి, వెటర్నరీ ఏడీ డాక్టరు రెడ్డమ్మ, కాశినాయన తహసీల్దార్ మల్లికార్జున, పోరుమామిళ్ల తహసీల్దార్ సీసీఎస్ వర్మ, ఎంపీడీఓలు ఆయూబ్, రామక్రిష్ణయ్య, ఆర్ఐలు మోహనరాజు, దక్షిణమూర్తి, ఎఓలు రామాంజనేయరెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు. రైతులకు గోడు వినకుండానే.. అనంతరం కాశినాయన మండలంలోని చిన్నాయపల్లెలో శెనగ రైతులతో కరువు బృందం సమావేశమైంది. కానీ ఇక్కడ కూడా ఇద్దరు రైతుల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నారు. కేవలం పది నిమిషాల సమయం కూడా కేటాయించలేదు. వ్యవసాయాధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వలేదు. మండలంలోని అధికశాతం మంది రైతులు నష్టపోయినా రైతుల సంఖ్య తక్కువ చేసి చూపారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులు చెప్పిన విషయాన్ని నమోదు చేసే సమయం కూడా అధికారులకు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు తాము వేసిన పంట విస్తీర్ణం, వచ్చిన దిగుబడి, కలిగిన నష్టం వివరాలను తెలుపుదామని ఎదురుచూసినా వారికి అవకాశం లభించలేదు. సాయంత్రం మూడు గంటలకు బాలాయపల్లెలో జొన్న రైతులతో సమావేశమయ్యారు. ఇద్దరు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగతా రైతులు తమ కష్టాలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అలాగే గ్రామంలోని పలువురు తాగునీటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఇక్కడ పది నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయించారు. -
పింఛన్ కేంద్రాలు పెంచండి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: సకాలంలో పింఛన్ అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై మానవతా దృక్పథంతో స్పందించి పింఛన్ కేంద్రాలను పెంచాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పింఛన్ కేంద్రాలు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అక్కడకు వెళ్లాక సిబ్బంది వివిధ కారణాలతో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. పింఛన్ సెంటర్లలో మంచినీటి సౌకర్యం కల్పించటంతో పాటు సకాలంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
తెలుగు వర్సిటీది ఓ విషాద గాథ: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయంలో సమస్యలు తిష్ట వేశాయని, ఆ వర్సిటీది ఓ విషాద గాథ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బాచుపల్లిలో ఉన్న వర్సిటీ హాస్టల్ 2005లో 50 గదులతో ప్రారంభమైందని, ఇందులో మొదట్లో 100 మంది విద్యార్థులుండగా ఇప్పుడు ఆ సంఖ్య 50కే పరిమితమైందని అన్నారు. హాస్టల్లో మంచినీటి వసతి లేదని, స్థానిక గ్రామ పంచాయతీనే దయతలచి రోజూ ట్యాంకర్ ద్వారా నీరు ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు రోజూ పబ్లిక్ గార్డెన్స్‌లోని కళాశాలకు వెళ్లాల్సి ఉంటుందని, కానీ వారికి బస్సు సౌకర్యం లేదని అన్నారు. అసలు బాచుపల్లిలో తెలుగు విశ్వవిద్యాలయం ఉన్న సంగతి ప్రభుత్వానికి తెలుసా..? అని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు, తెలుగు భాషా వికాసం కోసం కనీసం రూ.100 కోట్లు కేటాయించి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్మణ్ కోరారు. మోదీ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు: బీజేపీ సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీని విమర్శించడం, దూషించడం ద్వారా కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పెద్ద నాయకుడు కావాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్.. కులం, మతం గురించి ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూసిందని ఆరోపించారు. -
ఐదులక్షల మందితో పార్లమెంటు ముట్టడిస్తాం
తిరువొత్తియూరు: రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయని పక్షంలో నవంబర్ 20న ఐదు లక్షల మంది రైతులతో కలిసి పార్లమెంటు ముట్టడి చేయనున్నట్టు రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను తెలిపారు. నదులను అనుసంధానించాలని, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల సంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన అయ్యాకన్ను పత్రికల వారితో మాట్లాడుతూ 41 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నామని రెండవ ఘట్టంగా రోజూ ఒక్కో విధానంలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామని ఈ ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెవిన పడలేదని ఈ చర్య వలన దేశానికి వెన్నముకగా పిలవబడే రైతులు మోసపోయినట్టు తెలిపారు. ఈ కారణంగా తమిళనాడు రైతులు, ఉత్తర రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిపి ఐదు లక్షల మందితో నవంబర్ 20వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభం రోజున ముట్టడి చేయనున్నట్టు తెలిపారు. -
సమస్యల కుప్పం!
డెవలప్మెంట్లో జిల్లాలోనే చివరిస్థానం రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో వెల్లడైన వాస్తవం ఏళ్లుగడిచినా అమలుకాని బాబు హామీలు పెదవి విరుస్తున్న స్థానికులు నేడు మరోమారు కుప్పం రానున్న సీఎం అభివృద్ధిలో నాకు సాటి లేదు.. కమిట్మెంట్లో నా అంతటోడు లేరు.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పేమాట. అయితే ఆయన కమిట్మెంట్, డెవలప్మెంట్ మాటల్లో తప్పా... చేతల్లో కనిపించవని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నియోజకవర్గాల అభివృద్ధి పట్టికలో కుప్పానికి చివరి స్థానం దక్కడమే ఇందుకు నిదర్శనం. కుప్పంః ముఖ్యవుంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు రెండేళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. కోట్లాది రూపాయలు అభివృద్ధి చేపడుతున్నట్లు పాలకులు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసుకుంటున్నారు. కానీ ప్రజల జీవన ప్రమాణం మాత్రం మెరుగుపడలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో కుప్పం నియోజకవర్గానికి రాష్ట్రంలో 79వ స్థానం, జిల్లాలో చివరిస్థానం దక్కింది. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికో..? పట్టణ నడిబొడ్డున రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్మించాలని 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. రైల్వేశాఖ అభివృద్ధిలో భాగంగా పట్టణ నడిబొడ్డున ఉన్న రైల్వేగేటును మూసివేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికిగాను రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా అండర్ బ్రిడ్జిని నిర్మించేందుకు తీర్మానాలు చేశాయి. రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. 15 ఏళ్లుగా నాలుగుసార్లు అధికారులు పంపిన ప్రతిపాదనలు పరిమితయ్యాయి. రెండవ సారి వుుఖ్యమంత్రి అయిన చంద్రబాబు రైల్వే బిడ్జ్రి నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. పాలారు పరిస్థితి ఏమిటి? కుప్పం నియోజకవర్గంలో 32 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న పాలారు నదిపై ప్రాజెక్టు నిర్మించాలన్న హామీ హుళక్కయ్యింది. 2006లో రూ. 55 కోట్ల వ్యయంతో పాలారును నిర్మించేందుకు అప్పటి వుుఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగింది. అనంతరం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే పాలారు ప్రాజెక్టును నిర్మించి తీరుతావుని కుప్పం బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టులో నడుస్తోంది. కాగా ఫారెస్టు శాఖ క్లియరెన్స్ కోసం ఆంధ్రా ప్రభుత్వం వేచి ఉందని, గత ఏడాది క్రితం అధికారులు పాలారు ప్రాజెక్టును సర్వేలు జరిపించారు. ఏళ్లు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పంటల ఎగువుతి ఎప్పుడు? కుప్పం ప్రాంతంలో ఉద్యానవన శాఖ పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉందని, ఇక్కడ పండించిన పంటలు ఎగువుతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బెంగళూరు పట్టణం నుంచి సఫల్ కంపెనీ ద్వారా కుప్పం ప్రాంతంలో పండించే పంటలను ఎగుమతి చేసుకుని విదేశాలు పంపించేందుకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రైతుల పంటలు ఎగుమతులు జరిగిన దాఖలాలు లేవు. అన్ని రకాల ఉద్యాన పంటలు ఎగుమతులు జరిగితే లాభాలు బాగా వస్తాయని ఎంతో ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. త్రీకేఆర్ రుణాల మాఫీ ఏది? 2001లో త్రీకేఆర్ సేద్యం కోసం బ్యాంకర్లు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తామని ప్రతి పర్యటనలోనూ బాబు హామీ ఇస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలోని 1354 మంది రైతులకుగాను రూ.13 కోట్లు త్రీకేఆర్ రుణాలు అప్పులున్నాయి. ఈ రుణాల ద్వారా తీసుకున్న డ్రిప్ పైపులు నాణ్యత లేకపోవడం వల్ల పూర్తిగా నాశనవుయ్యాయి. కానీ తీసుకున్న రుణాలు మాత్రం బ్యాంకుల్లో పేరుకుపోయాయి. ఈ రుణాలను వూఫీ చేయాలని రైతులు చంద్రబాబును కోరుతూ వస్తున్నారు. 2014లో వుుఖ్యవుంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు మాఫీ చేసినట్లు ప్రకటనలు చేసుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 1354 వుంది రైతులు ఒక్క రూపాయి రుణం మాఫీ కాలేదు. 15 ఏళ్ళ నిరీక్షణ ఫలించేదెప్పుడు...? కుప్పం ప్రాంతంలో క్రీడాభివృద్ధి కోసం 2001లో చంద్రబాబు ముుఖ్యవుంత్రి హోదాలో స్పోర్ట్స్ స్టేడియం కోసం శంకుస్థాప చేపట్టారు. పట్టణ సమీంలోని వడ్డిపల్లె గ్రామం వద్ద 14 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియంను నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టారు. అనంతరం 2014లో స్పోర్ట్స్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియాన్ని నిర్మించేందుకు వురోసారి ముఖ్యవుంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ తతంగం గడిచి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు స్టేడియం పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పారిశ్రామిక కారిడార్ జరిగేనా..? మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పంలో పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతావుని బాబు హామీ ఇచ్చారు. కుప్పం మీదుగా తిరుపతి, చెన్నై, బెంగళూరు, మహానగరాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌ను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అవులుకు నోచుకోలేదు. పంచాయతీ కేంద్రాల కంప్యూటీకరణ ఎక్కడ..? నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీ కేంద్రాన్ని కంప్యూటరైజేషన్ చేపట్టి ఉచితంగా వైఫై నెట్వర్క్ అందజేస్తావుని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. అప్పట్లో పంచాయతీ కేంద్రాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేబుళ్లను తవ్వి పూడ్చిపెట్టారు. వీటిని గుర్తుపట్టే విధంగా అక్కడక్కడా భారత్ సంచార్ నిగమ్ పేరిట రాళ్లు నాటారు. రెండేళ్లు గడిచినా కంప్యూటరీకరణ జాడ కనపడలేదు. పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రమెక్కడ..? కుప్పం ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వుుఖ్యమంత్రి హామీ నెరవేరలేదు. గుడుపల్లె మండలం మల్లప్పకొండపై పవర్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు గాలిమరలను ఏర్పాటు చేశారు. విండోర్వెల్ కంపెనీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనికిగాను వుల్లప్పకొండపై ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని, కర్నూలులోని ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు ఒప్పందం కుదిరాయి. అప్పట్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటం చేశారే తప్పా.. ఇప్పటి వరకు అమలు కాలేదు. వాణియంబాడి రోడ్డుకు మోక్షమెప్పుడు? తమిళనాడు సరిహద్దులోఉన్న రామకుప్పం నుంచి తమిళనాడు రాష్ట్రం వాణియంబాడికి జాతీయ రహదారి ఏర్పాటు చేస్తావుని 20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వాణియంబాడి నుండి రామకుప్పం మీదుగా కర్ణాటక రాష్ట్రం రాజుపేట, కేజీఎఫ్ వరకు జాతీయ రహదారిని చేపట్టాలని హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో పాటు మహిళా జూనియర్ కళాశాల, బాలికల వసతిగృహాలు, పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ, రామకుప్పంలో డిగ్రీ కళాశాలను స్థాపిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు. -
సమస్యల కుప్పం!
డెవలప్మెంట్లో జిల్లాలోనే చివరిస్థానం రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో వెల్లడైన వాస్తవం ఏళ్లుగడిచినా అమలుకాని బాబు హామీలు పెదవి విరుస్తున్న స్థానికులు నేడు మరోమారు కుప్పం రానున్న సీఎం అభివృద్ధిలో నాకు సాటి లేదు.. కమిట్మెంట్లో నా అంతటోడు లేరు.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పేమాట. అయితే ఆయన కమిట్మెంట్, డెవలప్మెంట్ మాటల్లో తప్పా... చేతల్లో కనిపించవని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నియోజకవర్గాల అభివృద్ధి పట్టికలో కుప్పానికి చివరి స్థానం దక్కడమే ఇందుకు నిదర్శనం. కుప్పంః ముఖ్యవుంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు రెండేళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. కోట్లాది రూపాయలు అభివృద్ధి చేపడుతున్నట్లు పాలకులు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసుకుంటున్నారు. కానీ ప్రజల జీవన ప్రమాణం మాత్రం మెరుగుపడలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో కుప్పం నియోజకవర్గానికి రాష్ట్రంలో 79వ స్థానం, జిల్లాలో చివరిస్థానం దక్కింది. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికో..? పట్టణ నడిబొడ్డున రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్మించాలని 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. రైల్వేశాఖ అభివృద్ధిలో భాగంగా పట్టణ నడిబొడ్డున ఉన్న రైల్వేగేటును మూసివేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికిగాను రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా అండర్ బ్రిడ్జిని నిర్మించేందుకు తీర్మానాలు చేశాయి. రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. 15 ఏళ్లుగా నాలుగుసార్లు అధికారులు పంపిన ప్రతిపాదనలు పరిమితయ్యాయి. రెండవ సారి వుుఖ్యమంత్రి అయిన చంద్రబాబు రైల్వే బిడ్జ్రి నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. పాలారు పరిస్థితి ఏమిటి? కుప్పం నియోజకవర్గంలో 32 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న పాలారు నదిపై ప్రాజెక్టు నిర్మించాలన్న హామీ హుళక్కయ్యింది. 2006లో రూ. 55 కోట్ల వ్యయంతో పాలారును నిర్మించేందుకు అప్పటి వుుఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగింది. అనంతరం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే పాలారు ప్రాజెక్టును నిర్మించి తీరుతావుని కుప్పం బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టులో నడుస్తోంది. కాగా ఫారెస్టు శాఖ క్లియరెన్స్ కోసం ఆంధ్రా ప్రభుత్వం వేచి ఉందని, గత ఏడాది క్రితం అధికారులు పాలారు ప్రాజెక్టును సర్వేలు జరిపించారు. ఏళ్లు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పంటల ఎగువుతి ఎప్పుడు? కుప్పం ప్రాంతంలో ఉద్యానవన శాఖ పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉందని, ఇక్కడ పండించిన పంటలు ఎగువుతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బెంగళూరు పట్టణం నుంచి సఫల్ కంపెనీ ద్వారా కుప్పం ప్రాంతంలో పండించే పంటలను ఎగుమతి చేసుకుని విదేశాలు పంపించేందుకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రైతుల పంటలు ఎగుమతులు జరిగిన దాఖలాలు లేవు. అన్ని రకాల ఉద్యాన పంటలు ఎగుమతులు జరిగితే లాభాలు బాగా వస్తాయని ఎంతో ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. త్రీకేఆర్ రుణాల మాఫీ ఏది? 2001లో త్రీకేఆర్ సేద్యం కోసం బ్యాంకర్లు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తామని ప్రతి పర్యటనలోనూ బాబు హామీ ఇస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలోని 1354 మంది రైతులకుగాను రూ.13 కోట్లు త్రీకేఆర్ రుణాలు అప్పులున్నాయి. ఈ రుణాల ద్వారా తీసుకున్న డ్రిప్ పైపులు నాణ్యత లేకపోవడం వల్ల పూర్తిగా నాశనవుయ్యాయి. కానీ తీసుకున్న రుణాలు మాత్రం బ్యాంకుల్లో పేరుకుపోయాయి. ఈ రుణాలను వూఫీ చేయాలని రైతులు చంద్రబాబును కోరుతూ వస్తున్నారు. 2014లో వుుఖ్యవుంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు మాఫీ చేసినట్లు ప్రకటనలు చేసుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 1354 వుంది రైతులు ఒక్క రూపాయి రుణం మాఫీ కాలేదు. 15 ఏళ్ళ నిరీక్షణ ఫలించేదెప్పుడు...? కుప్పం ప్రాంతంలో క్రీడాభివృద్ధి కోసం 2001లో చంద్రబాబు ముుఖ్యవుంత్రి హోదాలో స్పోర్ట్స్ స్టేడియం కోసం శంకుస్థాప చేపట్టారు. పట్టణ సమీంలోని వడ్డిపల్లె గ్రామం వద్ద 14 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియంను నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టారు. అనంతరం 2014లో స్పోర్ట్స్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియాన్ని నిర్మించేందుకు వురోసారి ముఖ్యవుంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ తతంగం గడిచి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు స్టేడియం పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పారిశ్రామిక కారిడార్ జరిగేనా..? మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పంలో పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతావుని బాబు హామీ ఇచ్చారు. కుప్పం మీదుగా తిరుపతి, చెన్నై, బెంగళూరు, మహానగరాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌ను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అవులుకు నోచుకోలేదు. పంచాయతీ కేంద్రాల కంప్యూటీకరణ ఎక్కడ..? నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీ కేంద్రాన్ని కంప్యూటరైజేషన్ చేపట్టి ఉచితంగా వైఫై నెట్వర్క్ అందజేస్తావుని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. అప్పట్లో పంచాయతీ కేంద్రాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేబుళ్లను తవ్వి పూడ్చిపెట్టారు. వీటిని గుర్తుపట్టే విధంగా అక్కడక్కడా భారత్ సంచార్ నిగమ్ పేరిట రాళ్లు నాటారు. రెండేళ్లు గడిచినా కంప్యూటరీకరణ జాడ కనపడలేదు. పవర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రమెక్కడ..? కుప్పం ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వుుఖ్యమంత్రి హామీ నెరవేరలేదు. గుడుపల్లె మండలం మల్లప్పకొండపై పవర్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు గాలిమరలను ఏర్పాటు చేశారు. విండోర్వెల్ కంపెనీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనికిగాను వుల్లప్పకొండపై ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని, కర్నూలులోని ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు ఒప్పందం కుదిరాయి. అప్పట్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటం చేశారే తప్పా.. ఇప్పటి వరకు అమలు కాలేదు. వాణియంబాడి రోడ్డుకు మోక్షమెప్పుడు? తమిళనాడు సరిహద్దులోఉన్న రామకుప్పం నుంచి తమిళనాడు రాష్ట్రం వాణియంబాడికి జాతీయ రహదారి ఏర్పాటు చేస్తావుని 20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వాణియంబాడి నుండి రామకుప్పం మీదుగా కర్ణాటక రాష్ట్రం రాజుపేట, కేజీఎఫ్ వరకు జాతీయ రహదారిని చేపట్టాలని హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో పాటు మహిళా జూనియర్ కళాశాల, బాలికల వసతిగృహాలు, పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ, రామకుప్పంలో డిగ్రీ కళాశాలను స్థాపిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు.