జూలకంటి రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సకాలంలో పింఛన్ అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై మానవతా దృక్పథంతో స్పందించి పింఛన్ కేంద్రాలను పెంచాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పింఛన్ కేంద్రాలు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అక్కడకు వెళ్లాక సిబ్బంది వివిధ కారణాలతో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. పింఛన్ సెంటర్లలో మంచినీటి సౌకర్యం కల్పించటంతో పాటు సకాలంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment