బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. బంగ్లాదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాజీ హబీబుల్ అవల్ 2024 జనవరి 7న కొత్త పార్లమెంటును ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ ప్రజలను ఉద్దేశించి అవల్ మాట్లాడుతూ ఎన్నికలకు ఇదే సరైన సమయమని అన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉంటామన్నారు.
బంగ్లాదేశ్‌లో గత సార్వత్రిక ఎన్నికలు 2018లో జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈసారి కూడా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్- ఖలీదా జియా పార్టీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఈ ఎన్నికలు భారత్, చైనా, పాకిస్తాన్‌లకు కూడా అత్యంత కీలకంగా పరిణమించనున్నాయి. బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2018 ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా షేక్ హసీనా గెలిచారని ఖలీదా జియా పార్టీ ఆరోపిస్తోంది. షేక్ హసీనా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సామాన్య ప్రజలను అణచివేశారని, ఈసందర్భంగా ఇప్పటివరకు మూడు వేల మంది చనిపోగా, వేలాది మంది అమాయకులు కటకటాల వెనుక ఉన్నారంటూ జియా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 4000 కిలోమీటర్లకు పైగా భారతదేశ సరిహద్దులు బంగ్లాదేశ్‌తో ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత హసీనా ప్రభుత్వానికి భారత్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారితే భారతదేశానికి అనేక రంగాల్లో ఎదురుదెబ్బ తగలవచ్చు. ఎందుకంటే ఖలీదా జియా చేస్తున్న రాజకీయాలను పాకిస్తాన్ సమర్థిస్తూ వస్తోంది.
ఖలీదా జియా పార్టీపై పాకిస్తాన్ అనేక ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రెండు దేశాలు మళ్లీ అనేక రంగాల్లో భాగస్వాములు అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పెద్ద సంఖ్యలో చైనా వలసదారులు నివసిస్తున్నారు. చైనా తన నూతన ప్రాజెక్ట్ ద్వారా బంగ్లాదేశ్‌లో తన ఉనికిని పెంచుకుంటోంది. 2016లో బంగ్లాదేశ్‌తో చైనా 26 ఒప్పందాలపై సంతకాలు చేసింది. బంగ్లాదేశ్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఆ ఇరుదేశాల పరస్పర వాణిజ్యం విలువ 10 బిలియన్ డాలర్లు(ఒక బిలియన్ అంటే రూ.100 కోట్లు) అటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారితే చైనాకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 19 అగ్నిపర్వతాలు ఒకేసారి పేలాయా?
Comments
Please login to add a commentAdd a comment