తిరువొత్తియూరు: రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయని పక్షంలో నవంబర్ 20న ఐదు లక్షల మంది రైతులతో కలిసి పార్లమెంటు ముట్టడి చేయనున్నట్టు రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను తెలిపారు. నదులను అనుసంధానించాలని, రైతుల డిమాండ్లను నెరవేర్చాలని జాతీయ దక్షిణ భారత నదుల సంధానం రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలో తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి శుక్రవారం హాజరైన అయ్యాకన్ను పత్రికల వారితో మాట్లాడుతూ 41 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నామని రెండవ ఘట్టంగా రోజూ ఒక్కో విధానంలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామని ఈ ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెవిన పడలేదని ఈ చర్య వలన దేశానికి వెన్నముకగా పిలవబడే రైతులు మోసపోయినట్టు తెలిపారు. ఈ కారణంగా తమిళనాడు రైతులు, ఉత్తర రాష్ట్రాలకు చెందిన రైతులతో కలిపి ఐదు లక్షల మందితో నవంబర్ 20వ తేదీన పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభం రోజున ముట్టడి చేయనున్నట్టు తెలిపారు.
ఐదులక్షల మందితో పార్లమెంటు ముట్టడిస్తాం
Published Sun, Sep 24 2017 4:49 AM | Last Updated on Sun, Sep 24 2017 4:49 AM
Advertisement