సమస్యల కుప్పం! | kuppam, problams, cm | Sakshi
Sakshi News home page

సమస్యల కుప్పం!

Published Sun, Aug 7 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

అండర్‌బ్రిడ్జికి నోచుకోని కుప్పం రైల్వే స్టేషన్‌

అండర్‌బ్రిడ్జికి నోచుకోని కుప్పం రైల్వే స్టేషన్‌

 

  •  డెవలప్‌మెంట్‌లో జిల్లాలోనే చివరిస్థానం
  •  రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో వెల్లడైన వాస్తవం
  • ఏళ్లుగడిచినా అమలుకాని బాబు హామీలు
  •  పెదవి విరుస్తున్న స్థానికులు
  • నేడు మరోమారు కుప్పం రానున్న సీఎం

అభివృద్ధిలో నాకు సాటి లేదు.. కమిట్‌మెంట్‌లో నా అంతటోడు లేరు.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెప్పేమాట. అయితే ఆయన కమిట్‌మెంట్, డెవలప్‌మెంట్‌ మాటల్లో తప్పా... చేతల్లో కనిపించవని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నియోజకవర్గాల అభివృద్ధి పట్టికలో కుప్పానికి చివరి స్థానం దక్కడమే ఇందుకు నిదర్శనం.



కుప్పంః ముఖ్యవుంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు రెండేళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. కోట్లాది రూపాయలు అభివృద్ధి చేపడుతున్నట్లు పాలకులు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసుకుంటున్నారు. కానీ ప్రజల జీవన ప్రమాణం మాత్రం మెరుగుపడలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన గ్రేడింగ్‌లో కుప్పం నియోజకవర్గానికి రాష్ట్రంలో 79వ స్థానం, జిల్లాలో చివరిస్థానం దక్కింది.

రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికో..?
పట్టణ నడిబొడ్డున రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్మించాలని 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. రైల్వేశాఖ అభివృద్ధిలో భాగంగా పట్టణ నడిబొడ్డున ఉన్న రైల్వేగేటును మూసివేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికిగాను రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంయుక్తంగా అండర్‌ బ్రిడ్జిని నిర్మించేందుకు తీర్మానాలు చేశాయి. రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు. 15 ఏళ్లుగా నాలుగుసార్లు అధికారులు పంపిన ప్రతిపాదనలు పరిమితయ్యాయి. రెండవ సారి వుుఖ్యమంత్రి అయిన చంద్రబాబు రైల్వే బిడ్జ్రి నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు.

పాలారు పరిస్థితి ఏమిటి?
కుప్పం నియోజకవర్గంలో 32 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న పాలారు నదిపై ప్రాజెక్టు నిర్మించాలన్న హామీ హుళక్కయ్యింది. 2006లో రూ. 55 కోట్ల వ్యయంతో పాలారును నిర్మించేందుకు అప్పటి వుుఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగింది. అనంతరం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే పాలారు ప్రాజెక్టును నిర్మించి తీరుతావుని కుప్పం బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టులో నడుస్తోంది. కాగా ఫారెస్టు శాఖ క్లియరెన్స్‌ కోసం ఆంధ్రా ప్రభుత్వం వేచి ఉందని, గత ఏడాది క్రితం అధికారులు పాలారు ప్రాజెక్టును సర్వేలు జరిపించారు. ఏళ్లు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

పంటల ఎగువుతి ఎప్పుడు?
కుప్పం ప్రాంతంలో ఉద్యానవన శాఖ పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉందని, ఇక్కడ పండించిన పంటలు ఎగువుతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బెంగళూరు పట్టణం నుంచి సఫల్‌ కంపెనీ ద్వారా కుప్పం ప్రాంతంలో పండించే పంటలను ఎగుమతి చేసుకుని విదేశాలు పంపించేందుకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రైతుల పంటలు ఎగుమతులు జరిగిన దాఖలాలు లేవు. అన్ని రకాల ఉద్యాన పంటలు ఎగుమతులు జరిగితే లాభాలు బాగా వస్తాయని ఎంతో ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది.

త్రీకేఆర్‌ రుణాల మాఫీ ఏది?
2001లో త్రీకేఆర్‌ సేద్యం కోసం బ్యాంకర్లు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తామని ప్రతి పర్యటనలోనూ బాబు హామీ ఇస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలోని 1354 మంది రైతులకుగాను రూ.13 కోట్లు త్రీకేఆర్‌ రుణాలు అప్పులున్నాయి. ఈ రుణాల ద్వారా తీసుకున్న డ్రిప్‌ పైపులు నాణ్యత లేకపోవడం వల్ల పూర్తిగా నాశనవుయ్యాయి. కానీ తీసుకున్న రుణాలు మాత్రం బ్యాంకుల్లో పేరుకుపోయాయి.  ఈ రుణాలను వూఫీ చేయాలని రైతులు చంద్రబాబును కోరుతూ వస్తున్నారు. 2014లో వుుఖ్యవుంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు మాఫీ చేసినట్లు ప్రకటనలు చేసుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 1354 వుంది రైతులు ఒక్క రూపాయి రుణం మాఫీ కాలేదు.

15 ఏళ్ళ నిరీక్షణ ఫలించేదెప్పుడు...?
కుప్పం ప్రాంతంలో క్రీడాభివృద్ధి కోసం 2001లో చంద్రబాబు ముుఖ్యవుంత్రి హోదాలో స్పోర్ట్స్‌ స్టేడియం కోసం శంకుస్థాప చేపట్టారు. పట్టణ సమీంలోని వడ్డిపల్లె గ్రామం వద్ద 14 ఎకరాల విస్తీర్ణంలో స్టేడియంను నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టారు. అనంతరం 2014లో స్పోర్ట్స్‌ స్టేడియంతో పాటు ఇండోర్‌ స్టేడియాన్ని నిర్మించేందుకు వురోసారి ముఖ్యవుంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ తతంగం గడిచి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు స్టేడియం పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

పారిశ్రామిక కారిడార్‌ జరిగేనా..?
మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పంలో పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతావుని బాబు హామీ ఇచ్చారు. కుప్పం మీదుగా తిరుపతి, చెన్నై, బెంగళూరు, మహానగరాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌ను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అవులుకు నోచుకోలేదు.

పంచాయతీ కేంద్రాల కంప్యూటీకరణ ఎక్కడ..?
నియోజకవర్గ పరిధిలోని ప్రతి పంచాయతీ కేంద్రాన్ని కంప్యూటరైజేషన్‌ చేపట్టి ఉచితంగా వైఫై నెట్‌వర్క్‌ అందజేస్తావుని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. అప్పట్లో  పంచాయతీ కేంద్రాలకు ఇంటర్‌నెట్‌  సౌకర్యం కల్పించేందుకు కేబుళ్లను తవ్వి పూడ్చిపెట్టారు. వీటిని గుర్తుపట్టే విధంగా అక్కడక్కడా భారత్‌ సంచార్‌ నిగమ్‌ పేరిట రాళ్లు నాటారు. రెండేళ్లు గడిచినా కంప్యూటరీకరణ జాడ కనపడలేదు.

పవర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రమెక్కడ..?
కుప్పం ప్రాంతంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వుుఖ్యమంత్రి హామీ నెరవేరలేదు. గుడుపల్లె మండలం మల్లప్పకొండపై పవర్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు గాలిమరలను ఏర్పాటు చేశారు. విండోర్‌వెల్‌ కంపెనీ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనికిగాను వుల్లప్పకొండపై ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుని, కర్నూలులోని ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు ఒప్పందం కుదిరాయి. అప్పట్లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటం చేశారే తప్పా.. ఇప్పటి వరకు అమలు కాలేదు.

వాణియంబాడి రోడ్డుకు మోక్షమెప్పుడు?
తమిళనాడు సరిహద్దులోఉన్న రామకుప్పం నుంచి తమిళనాడు రాష్ట్రం వాణియంబాడికి జాతీయ రహదారి ఏర్పాటు చేస్తావుని 20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. వాణియంబాడి నుండి రామకుప్పం మీదుగా కర్ణాటక రాష్ట్రం రాజుపేట, కేజీఎఫ్‌ వరకు జాతీయ రహదారిని చేపట్టాలని హామీ అమలుకు నోచుకోలేదు.
    దీంతో పాటు మహిళా జూనియర్‌ కళాశాల, బాలికల వసతిగృహాలు, పట్టణంలో అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ, రామకుప్పంలో డిగ్రీ కళాశాలను స్థాపిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement