సూర్య క్రియ - ఒక శక్తిమంతమైన ప్రాచీన యోగా ప్రక్రియ! | Sun Action - a powerful ancient yoga process! | Sakshi
Sakshi News home page

సూర్య క్రియ - ఒక శక్తిమంతమైన ప్రాచీన యోగా ప్రక్రియ!

Published Sun, Feb 8 2015 12:16 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

Sun Action - a powerful ancient yoga process!

యోగా
 
మేము సూర్యుడికి సంబంధించిన ఒక సాధనను నేర్పడం మొదలుపెట్టాము. ఇది సూర్య నమస్కారం లాగానే ఉంటుంది కానీ, ‘సూర్య క్రియ’ అని పిలుస్తాం. ఎందుకంటే ఇందులో ఒక నిర్దిష్ట స్థాయిలో శ్వాసను గమనించడం, శక్తిని బలంగా ఉత్తేజపరచడం ఉంటాయి. మీతో సహా ఈ గ్రహం మీద ఉన్న ప్రతీ జీవి సౌరశక్తి మీదే ఆధారపడి ఉంది.

ఈ భూమి మీద మీరు అనుభవిస్తున్న వేడి అంతా ప్రాథమికంగా సూర్యుడి నుండి వచ్చినదే. కాకపోతే అదే వివిధ రూపాలలో నిల్వచేయబడి, వ్యక్తమౌతున్నది. మీరు ఒక చెక్క ముక్కను తీసుకుని కాలిస్తే అది సౌర శక్తినే విడుదల చేస్తుంది. సౌర శక్తిని మనం తీసేస్తే, ఈ గ్రహమంతా మంచుగా గడ్డ కట్టుకుపోతుంది. ‘సూర్య నమస్కారం’ అనే పేరు కేవలం నామమాత్రమైనది కాదు. ఈ సాధన ముఖ్యంగా మీ నాభీచక్రాన్ని (సోలార్ ప్లెక్సస్) ఉత్తేజపరిచి, మీ సమత్ ప్రాణాన్ని, అంటే మీ శరీర వ్యవస్థలోని సౌర తాపాన్ని ప్రేరేపిస్తుంది.
 
సూర్య క్రియ సాధన పైకి భౌతికమైనదిగానే కనిపిస్తుంది కానీ, అందులో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. నిజానికి సూర్య క్రియే అసలైన సాధన. ఇది సూర్యుడితో మిమ్మల్ని మీరు అనుసంధానం చేసుకునేమార్గం. ఇది చాలా మెరుగైన ప్రక్రియ. దీంట్లో శరీరపు అమరికపై (జామెట్రీపై) చాలా ధ్యాస పెట్టవలసి ఉంటుంది. నిజానికి సూర్య నమస్కారం దీనికి దూరపు చుట్టం. మీరు కండలను పెంచుకోవాలనుకుంటే, మీకు శారీరక దారుఢ్యంతో పాటు ఆధ్యాత్మికత కూడా కావాలనుకుంటే సూర్య నమస్కారం చేయండి. మీరు చేసే భౌతిక ప్రక్రియలో ఒక శక్తిమంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఉండాలనుకుంటే, మీరు సూర్యక్రియ చేయండి.
 
మానవ శరీర నిర్మాణంలో సూర్యుడు, భూమి, చంద్రులకు ముఖ్యమైన పాత్ర ఉంది. సౌర వ్యవస్థలో జరిగే మార్పులు 12 1/4 నుండి 12 1/2 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతాయి. మీరు వీటితో అనుసంధానమై జీవిస్తే, అది మీకు శ్రేయస్సు కలిగిస్తుంది. మీ భౌతిక శరీరంలో పునరావృతమయ్యే వాటిని కూడా 12 1/4 నుండి 12 1/2 సంవత్సరాలకు ఒకసారి సంభవించేటట్లు చేసేందుకు సూర్యక్రియ ఒక మార్గం. మీ లోపలా, బయటా ఒక రకమైన స్థితిని ఏర్పరచుకోవడానికి సూర్యక్రియ దోహదపడుతుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ జీవన ప్రక్రియకు ఎటువంటి అవరోధాన్ని గానీ, ఇబ్బందిని గానీ కలిగించవు.
 ప్రేమాశీస్సులతో,  సద్గురు
 
ఫొటోలు : శివ మల్లాల
మంచు లక్ష్మీప్రసన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement