prosperity
-
ప్రజాస్వామ్యం మానవత్వం
జార్జిటౌన్: ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సరికొత్త పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రం అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చిచెప్పారు. గురువారం గయానా దేశ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వార్థం, విస్తరణవాదం అనే సంకుచిత ధోరణిని భారత్ ఏనాడూ నమ్ముకోలేదని అన్నారు. విస్తరణవాదంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. వనరుల దోపిడీ అనే ఆలోచనకు భారత్ దూరంగా ఉంటుందని వివరించారు. మూడు దేశాల పర్యటన భాగంగా ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. గయానా పార్లమెంట్లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సూత్రాన్ని అనుసరించాలి. అదే మనకు తారకమంత్రం. మనతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లాలని, అందరి అభివృద్ధిలో మనం సైతం భాగస్వాములం కావాలని ప్రజాస్వామ్యం ప్రథమం స్ఫూర్తి బోధిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వం ప్రథమం అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలతో మొత్తం మానవాళికి మేలు జరుగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు మేల్కోవాల్సిన సమయం వచి్చంది. మనమంతా క్రియాశీలకంగా పనిచేయాలి. మనం ఒక్కతాటిపైకి రావాలి. మనం కలిసికట్టుగా పని చేస్తూ నూతన ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) సృష్టించాలి. ప్రపంచం విషయానికొస్తే యుద్ధాలు, ఘర్షణలకు ఇది సమయం కాదు. యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటిని రూపుమాపాల్సిన సమయం ఇది. భారత్–గయానా మధ్య గత 150 ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్ దృష్టిలో ప్రతి దేశమూ కీలకమైనదే. ఏ ఒక్కటీ తక్కువ కాదు. ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించడం లేదు. వాటిని అతిపెద్ద సముద్ర దేశాలుగా భావిస్తున్నాం. ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే స్ఫూర్తితో భారత్ ‘విశ్వబంధు’గా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తితే అందరికంటే మొదట భారత్ స్పందిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు. -
ప్రపంచ శ్రేయస్సుకు యోగా శక్తివంతమైన సాధనం: మోదీ
శ్రీనగర్: యోగాను ప్రపంచ శ్రేయస్సుకు పనిచేసే శక్తివంతమైన ఉపకరణంగా నేడు అందరూ భావిస్తున్నా రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మార్చే సామర్థ్యం యోగాకు ఉందన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యోగాను 50 వేల నుంచి 60 వేల మంది వరకు సాధన చేస్తుండటం సాధారణ విషయం కాదని తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘దేవుడు, ఈశ్వరుడు లేదా అల్లాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంగా యోగా గురించి సాధారణంగా చెబుతుంటారు. ఆధ్యాత్మిక కోణాన్ని వదిలేసి ప్రస్తుతానికి, మనం వ్యక్తిగత అభివృద్ధి కోసం యోగాపై దృష్టి పెట్టి, దానిని జీవితంలో ఒక భాగంగా ఆచరించవచ్చు. అలా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి సమాజ శ్రేయస్సుకు..అంతిమంగా అది మానవాళి శ్రేయస్సుకు దారితీస్తుంది’’ అని చెప్పారు.సియాచిన్‌లోనూ యోగా డేరాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారులు యోగా చేశారు. పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు దేశవ్యాప్తంగా పలుచోట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. సియాచిన్‌లో, రాజస్తాన్‌లోని థార్ ఏడారిలో, సముద్రంలో విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై సైనికులు యోగా చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో సాయుధ సిబ్బంది జల యోగ చేశారు. ఈ ఏడాది యోగా డే ఇతివృత్తం ‘యోగా ఫర్ సెల్ప్ అండ్ సొసైటీ’. -
G20 Summit: వృద్ధి విధానాలకు మద్దతు
న్యూఢిల్లీ: అందరికీ వృద్ధి, శ్రేయస్సు కారకాలుగా పనిచేయడానికి వాణిజ్యం, పెట్టుబడిని అనుమతించే విధానాలకు మద్దతు ఇవ్వాలని జీ–20 సభ్య దేశాలు అంగీకరించాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రంగా ఉన్న నిబంధనల ఆధారంగా వివక్షత లేని, న్యాయ, బహిరంగ, కలుపుకొని, సమాన, స్థిర, పారదర్శక బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ అనివార్యం’ అని జీ–20 వేదికగా నాయకులు ప్రకటించారు. రక్షణవాదం, మార్కెట్‌ను వక్రీకరించే పద్ధతులను నిరుత్సాహపరచడం ద్వారా అందరికీ అనుకూల వాణిజ్యం, పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి న్యాయమైన పోటీ వాతావరణాన్ని సృష్టించాలన్న నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. 2024 నాటికి సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా పూర్తి, మెరుగ్గా పనిచేసే వివాద పరిష్కార వ్యవస్థను కలిగి ఉండాలనే ఉద్దేశంతో చర్చలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. వాణిజ్యం, పర్యావరణ విధానాలు ప్రపంచ వాణిజ్య సంస్థ, పర్యావరణ ఒప్పందాలకు అనుగుణంగా పరస్పరం మద్దతునిచ్చేవిగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
శాంతి, సౌభాగ్యం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20 కూటమికి ఈ ఏడాది సారథ్యం వహిస్తున్న భారత్‌కు ప్రశంసనీయమైన విజయం దక్కింది. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో, ప్రపంచ శాంతి, సౌభాగ్యమే ధ్యేయంగా వివిధ కీలక అంశాలతో కూడిన ‘న్యూఢిల్లీ జీ20 సమ్మిట్ లీడర్స్ డిక్లరేషన్’కు కూటమి సభ్యదేశాల ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. డిక్లరేషన్‌పై కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని, వెంటనే ఆమోదం పొందిందని వెల్లడించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో దేశాల మధ్యనున్న భేదాభిప్రాయాలను అధిగమించి మరీ డిక్లరేషన్‌పై ఆమోద ముద్ర పడడం గమనార్హం. డిక్లరేషన్ ఆమోదం పొందడానికి కృషి చేసిన జీ20 దేశాల మంత్రులు, అధికార ప్రతినిధులు(òÙర్పాలు), అధికారులకు నరేంద్ర మోదీ కృతజ్ఞ తలు తెలిపారు. వారంతా ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో శనివారం ఢిల్లీలో అట్టహాసంగా ఆరంభమైంది. భారత ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తదితరులు పాల్గొన్నారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కాలేదు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ, ఉగ్రవాదం, అవినీతి, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక ప్రగతి, విద్య, నైపుణ్యాల వృద్ధి, పునరుత్పాదక ఇంధనాల వినియోగం తదితర కీలక అంశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతికి పాటుపడాలి ఉక్రెయిన్‌లో నెలకొన్న సంఘర్షణపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నేటి యుగం యుద్ధాల యుగం కాదని తేలి్చచెప్పింది. ప్రాదేశిక సమగ్రత, సార్వ¿ౌమత్వంతో కూడిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని పేర్కొంది. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని వెల్లడించింది. శాంతియుత చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. శాంతి తీర్మానం ముఖ్యమని తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, సాధారణ సభలో చేసి న తీర్మానాలకు కట్టుబడి ఉండాలని, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను అన్ని దేశాలు పాటించాలని వెల్లడించింది. ఇతర దేశాల భూభాగా లను ఆక్రమించుకోవడం, అందుకోసం బెదిరింపులకు దిగడం లేదా బలప్రయోగానికి పాల్పడ డం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం లేదా ప్రయోగించడం ఆక్షేపణీయమని పేర్కొంది. ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతి కోసం అన్ని దేశాలూ చొరవ తీసుకోవాలని పిలుపునిచి్చంది. ‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే ఖండించాల్సిందే. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా మారింది. మతం, జాతి పేరిట ప్రజల మధ్య చిచ్చు రేపడం క్షమార్షం కాదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి. ఆయుధాల అక్రమ రవాణా కూడా ఆందోళనకరంగా మారింది. ఈ అవాంఛనీయ ధోరణిని అరికట్టాల్సిందే. ఆయుధాల ఎగుమతులు, దిగుమతులపై అన్ని దేశాలు గట్టి నిఘా పెట్టాలి’’అని డిక్లరేషన్ సూచించింది. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ప్రపంచంలో అందరికీ సమాన స్థాయిలో, నాణ్య మైన విద్య, నైపుణ్య శిక్షణను అందించాల్సిన ఆవశ్యకతను న్యూఢిల్లీ డిక్లరేషన్ నొక్కిచెప్పింది. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వాలని సూచించింది. ప్రజల మధ్య డిజి టల్ అంతరాలను తొలగించడానికి డిజిటిల్ సాంకేతికలను సమర్థంగా ఉపయోగించుకోవా లని జీ20 దేశాలు తమ డిక్లరేషన్‌లో తీర్మానించు కున్నాయి. కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొనేలా విద్యాసంస్థలకు, టీచర్లకు సహకరించాలని నిర్ణయించుకున్నాయి. విద్యార్థులు, నిపుణులు, పరిశోధకులు, సైంటిస్టులు పరిశో« దనా సంస్థలతో, ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉన్నత విద్య, ఉద్యోగాల సాధనకు ఫౌండేషనల్ లెరి్నంగ్ ప్రాముఖ్యతను తాము గుర్తించామని పేర్కొన్నారు. హై–క్వాలిటీ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(టీవీఈటీ)ని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక వాణిజ్యం ప్రపంచమంతటా నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయం, ఆహారం, ఎరువుల రంగంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, నిబంధనల ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొ న్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులపై నిషేధం విధించరాదని ఉద్ఘాటించారు. ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలకు, వాటి సామర్థ్యాలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం చౌకగా అందేలా కలిసి పని చేయాలని నిర్ణయించారు. చాలినంత ఆహారం అనేది అందరి హక్కు అని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతను మరింత పెంచడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ(ఏఎంఐఎస్)లోకి ఎరువులు, వెజిటబుల్ ఆయిల్స్‌ను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఆహార ధరల్లో హెచ్చుతగ్గులను అరికట్టడానికి గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ గ్లోబల్ అగ్రికల్చరల్ మానిటరింగ్(జియోగ్లామ్) వ్యవస్థను తీసుకురానున్నారు. ఏఎంఐఎస్ పరిధిలో ప్రస్తుతం బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా ఉన్నాయి. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహిళా ఆహార భద్రత, పౌష్టికాహారం ప్రాధాన్యతను డిక్లరేషన్ వివరించింది. నైపుణ్యాల అంతరాలను తొలగించాలి ప్రపంచవ్యాప్తంగా జనంలో నైపణ్యాల అంతరాలను తొలగించి, నిపుణులను తయారు చేయడానికి కార్యాచరణ చేపట్టాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కూటమి నేతలు ప్రతిన బూనారు. సమీకృత సామాజిక రక్షణ విధానాలను అందరికీ వర్తింపజేయాలని తీర్మానించారు. సామాజిక భద్రత ప్రయోజనాలను ద్వైపాక్షిక, బహుముఖీన ఒప్పందాల ద్వారా అర్హులకు అందించేందుకు అంగీకరించారు. బాల కారి్మక వ్యవస్థను, వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. సమగ్ర ఆర్థిక ప్రగతి కోసం గ్లోబల్ స్కిల్స్ పెంచడం చాలా ముఖ్యమంత్రి డిక్లరేషన్ తేలి్చచెప్పింది. డిజిటల్ అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సూచించింది. గిగ్, ప్లాట్‌ఫామ్ కారి్మకులకు సామాజిక పరిరక్షణ పథకాలు, మెరుగైన పని వసతులు కల్పించాలన్న ప్రతిపాదనను కూటమి నేతలు ఆమోదించారు. అవినీతిపై యుద్ధమే అవినీతి సహించడానికి ఎంతమాత్రం వీల్లేదని జీ20 నేతలు తీర్మానించారు. అవినీతికి యుద్ధం సాగించాలని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవాలని నిర్ణయానికొచ్చారు. అవినీతిని ఎదుర్కొనే దిశగా ఆస్తులను స్వా«దీనం చేసుకొనే యంత్రాంగాలను బలోపేతం చేయాలన్నారు. అవినీతిపై పోరాడే బాధ్యతలను నిర్వర్తించే ప్రభుత్వ సంస్థలు, అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకుందాం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని దశల వారీగా తగ్గించుకొనే ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలంటూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. అలాగే 2009లో పిట్స్‌బర్గ్‌లో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం శిలాజ ఇంధనాలపై సబ్సిడీలను హేతుబద్దీకరించాలని నిర్ణయించారు. అతితక్కువ ఉద్గారాలతో కూడిన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలని పేర్కొన్నారు. కాలుష్య రహిత, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లేలా పేద దేశాలకు సహకరించాలని తీర్మానించారు. వాతావరణ మార్పుల నియంత్రణ లక్ష్యాల సాధనకు శుద్ధ ఇంధనాల వాడకాన్ని పెంచుకోవాలని, ఇందుకోసం ఉమ్మడి ప్రయత్నాలు కొనసాగించాలని జీ20 నాయకులు డిక్లరేషన్‌ను ఆమోదించారు. నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా, టెక్నాలజీ ప్రయోజనాలను పరస్పరం పంచుకొనేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని తీర్మానించారు. ఇంధన భద్రతను, మార్కెట్ స్థిరత్వాన్ని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ప్రజలకు సేవలు అందించడానికి, నూతన ఆవిష్కరణలకు భద్రమైన, నమ్మకమైన, పారదర్శకతతో కూడిన సమగ్ర డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల(డీపీఐ) అవసరాన్ని జీ20 నేతలు గుర్తించారు. ‘ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఫర్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అంతర్జాతీయ స్థాయిలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం జీ20 ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న సూచనను డిక్లరేషన్ స్వాగతించింది. గౌరవప్రదమైన మానవ హక్కులు, వ్యక్తిగత డేటా, గోప్యత, మేధో సంపత్తి హక్కుల గురించి కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, భద్రతను పెంపొందించాలని తెలిపారు. ‘మంచి కోసం, అందరి కోసం’అనే నినాదంతో కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుకోవాలన్నారు. ఏఐతో లాభాలు అందరికీ సమానంగా దక్కాలని, రిస్‌్కను సైతం సమానంగా పంచుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్పిరేటరీ(జీడీపీఐఆర్) ఏర్పాటు చేస్తామన్న భారత్ ప్రకటన పట్ల డిక్లరేషన్ సానుకూలంగా స్పందించింది. మలీ్టలేటరల్ డెవలప్మెట్ బ్యాంకులు అవసరమని తెలియజేసింది. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ కావాలి ప్రపంచ ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లు, నెలకొన్న సంక్షోభాలపై జీ20 డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక వృద్ధిలో దేశాల మధ్య అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఆర్థిక సహకార విధానాలు, నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలని పేర్కొంది. ధరల్లో స్థిరత్వం కోసం సెంట్రల్ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలంటే సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, నిర్మాణాత్మక ప్రభుత్వ విధానాలు అవసరమని ఉద్ఘాటించింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు(ఎఫ్ఎస్బీ) తీసుకున్న చర్యలను డిక్లరేషన్ ప్రశంసించింది. పాలసీ క్రెడిబిలిటీని కొనసాగించాలంటే సెంట్రల్ బ్యాంకులకు స్వతంత్ర ప్రతిపత్తి చాలా అవసరమని అభిప్రాయపడింది. దేశాల అభివృద్ధిలో స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేసింది. -
Guru Purnima 2023: కదిలించే కాంతి గురువు
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించేది గురు. కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. గురువులు కాంతిని ఇస్తారు. జీవనం అనే చీకటిని ఛేదించడానికి ప్రతి మనిషికి కాంతిని ఇచ్చే గురువు ఎంతో అవసరం. వ్యాసుడు కీలకమైన గురువుకాగా ఆది శంకరాచార్య భారతీయతకు మహోన్నతమైన గురువు అయ్యారు. శంకరాచార్యే ఉండి ఉండకపోతే ఒక దశలో భారతీయత చిందరవందరైపోయేది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, అరవిందుడు వంటి పలువురు మేలైన గురువులు మన మట్టికి, మనకు మేలు చేశారు. శంకరుల తరువాత స్వామి వివేకానందవల్ల ఒకదశలో భారతీయతకు రావాల్సిన చలనం, జ్వలనం వచ్చాయి. భారతీయ తత్త్వానికి, సత్వానికి విశ్వవ్యాప్తిని కలిగించారు వివేకానందులు. మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికి వివేకానందులు పరోక్ష కారణం. వారు వెలిగించిన భారతీయస్ఫూర్తి పలువురిని జాతీయ ఉద్యమంవైపు నడిపించింది. వైదికత్వం కోసం, జాతి కోసం తన ఆత్మానుభూతిని సైతం త్యాగం చేసిన అత్యున్నతమైన యోగి–గురువు వారు. ఒక దశలో శంకరులు, ఒక దశలో వివేకానందులు అందివచ్చిన గురువులై మనల్ని కదిలించే కాంతులు అయ్యారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. కృష్ణుడు చెప్పిన పాఠం భగవద్గీత ప్రపంచం అంతా విలసిల్లుతోంది. ‘తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే’ అంటూ కృష్ణుడు మనల్ని ఉన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాడు. ‘భగవద్గీత సందేశం అంతా ఈ మాటల్లో ఇమిడి ఉంది’ అని చెప్పారు వివేకానందులు. ఈ మాటల స్ఫూర్తితో వారు ‘లే, జాగృతి పొందు, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు’ అని అన్నారు. ‘పనిలో నేర్పరితనమే యోగం’ అనీ, ‘హీనమైన పనిని దూరంగా వదిలెయ్యి’ అనీ, ‘నిర్ణయించబడిన పనిని చెయ్యి’ ఆనీ, ‘శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది’ అనీ, ‘అనుమానస్తుడికి సుఖం లేదు’ అనీ కృష్ణుడు చెప్పినవి మన జీవితాలకు కాంతిని ఇచ్చేవి. ‘మానవ విజ్ఞానంలో సాటిలేనివాడు, అద్వితీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కృష్ణుడు’ అని వివేకానందులు చెప్పిందాన్ని అర్థం చేసుకుందాం. ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైంది? అన్న సంశయానికి ‘ధర్మం’ అని చెప్పి శంకరాచార్య సంశయ నివృత్తి చేశారు. ఏది వాంఛింపదగింది? అన్న సంశయానికి ‘స్వ, పర హితం’ అనీ, శత్రువు ఎవరు? అన్న సంశయానికి ‘సోమరితనం’ అనీ, ఏది దుఃఖం? అన్న సంశయానికి ‘ఉత్సాహం లేకపోవడం’ అనీ, ఏది జాడ్యం? అన్న సంశయానికి ‘నేర్చుకున్నది ఆచరించకపోవడం’ అనీ, ఎవరు స్నేహితులు? అన్న సంశయానికి ‘పాపాన్ని నివారించే వాళ్లు’ అనీ, ఏది పాతకం? అన్న సంశయానికి ‘హింస’ అనీ, ఎవరు ఎదుగుతారు? అన్న సంశయానికి ‘వినయం ఉన్నవాళ్లు’ అనీ, ఎవరు ప్రత్యక్ష దేవత? అన్న సంశయానికి ‘అమ్మ’ అనీ, వేటిని మనుషులు సంపాదించాలి? అన్న సంశయానికి ‘విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం’ అనీ, ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? అన్న సంశయానికి ‘సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత’ అనీ తెలియజెప్పి మనకు దిశానిర్దేశం చేశారు శంకరాచార్య. ‘మీరు అపారమైన ఓర్పు కలిగి ఉన్నారా, అయితే విజయం మీదే’ అని శంకరుల స్ఫూర్తితో వివేకానందులు ఉవాచించారు. ‘సత్యం, నిగ్రహం, తపస్సు, శుచి, సంతోషం, సిగ్గు, ఓర్పు, నిజాయితీ, జ్ఞానం, శాంతి, దయ, ధ్యానం కలిగి ఉండాలి; ఇదే సనాతన ధర్మం’ అన్న వ్యాసుడి ఉపదేశాన్ని వ్యక్తిత్వంలో నింపుకుని ప్రతి వ్యక్తీ ఉదాత్తంగా బతకాలి. మనకు అత్యవసరమైన గురువులుగా ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను మనం ఇకపై సంభావించి స్వీకరించాలి. ఈ ఇరు గురువుల ఉపదేశాల్ని అందుకుని భారతీయులమైన మనం దేశ సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం పనిచెయ్యాలి; మనమూ పరిఢవిల్లాలి. – రోచిష్మాన్ -
భగవంతుని అనుగ్రహంతోనే శ్రేయస్సు
-
శ్రేయోభిలాషి... మంచిచెడుల్లో తోడు
ఆత్మీయం ఎవరు ఎంత సంపాదించినా, పోయేటప్పుడు ఏదీ వెంటరాదు. కనీసం పూచికపుల్లను కూడా తాను పోయేటప్పుడు తనతో వెంట తీసుకుపోలేరు. వెంటవుండేదల్లా మన శ్రేయోభిలాషులే. అంటే మన శ్రేయస్సును కోరుకునేవారే. వీరు మన మంచిలోనూ, చెడులోనూ, కష్టంలోనూ, సుఖంలోనూ ప్రతిదానిలోనూ తోడుగా ఉంటారు. మనం నవ్వితే నవ్వుతారు, మనం బాధపడితే వారు కన్నీళ్లు తుడుచుకుంటారు. మనం సంతోషంగా ఉంటే వారు తీపి పంచుకుంటారు. తప్పుడు ఆలోచనలు చేస్తుంటే వారిస్తారు. మంచి చేస్తే ప్రోత్సహిస్తారు. మనవల్ల ఇతరులకు చెడు జరగకుండా నివారిస్తారు. మన ఇళ్లలో జరిగే విందులు, వినోదాలు, శుభాలు, అశుభాలు వీరు లేకుండా జరగవు. అయితే మనకు శ్రేయోభిలాషులు ఉండాలంటే... పదిమందీ మన వెంట నడవాలంటే మనం కూడా ఒకరి శ్రేయస్సును కోరుకోవాలి. వారి మంచి చెడులలో పాలు పంచుకోవాలి. తోడుగా నిలవాలి. అన్నింటా అండగా ఉండాలి. అవతలి వారి శ్రేయస్సును, అభివృద్ధిని మనస్పూర్తిగా కోరుకోవాలి. వెన్నుదన్ను కావాలి. సమాజమంతా ఇలా ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా ఉంటే ఎంత బావుంటుంది! -
సూర్య క్రియ - ఒక శక్తిమంతమైన ప్రాచీన యోగా ప్రక్రియ!
యోగా మేము సూర్యుడికి సంబంధించిన ఒక సాధనను నేర్పడం మొదలుపెట్టాము. ఇది సూర్య నమస్కారం లాగానే ఉంటుంది కానీ, ‘సూర్య క్రియ’ అని పిలుస్తాం. ఎందుకంటే ఇందులో ఒక నిర్దిష్ట స్థాయిలో శ్వాసను గమనించడం, శక్తిని బలంగా ఉత్తేజపరచడం ఉంటాయి. మీతో సహా ఈ గ్రహం మీద ఉన్న ప్రతీ జీవి సౌరశక్తి మీదే ఆధారపడి ఉంది. ఈ భూమి మీద మీరు అనుభవిస్తున్న వేడి అంతా ప్రాథమికంగా సూర్యుడి నుండి వచ్చినదే. కాకపోతే అదే వివిధ రూపాలలో నిల్వచేయబడి, వ్యక్తమౌతున్నది. మీరు ఒక చెక్క ముక్కను తీసుకుని కాలిస్తే అది సౌర శక్తినే విడుదల చేస్తుంది. సౌర శక్తిని మనం తీసేస్తే, ఈ గ్రహమంతా మంచుగా గడ్డ కట్టుకుపోతుంది. ‘సూర్య నమస్కారం’ అనే పేరు కేవలం నామమాత్రమైనది కాదు. ఈ సాధన ముఖ్యంగా మీ నాభీచక్రాన్ని (సోలార్ ప్లెక్సస్) ఉత్తేజపరిచి, మీ సమత్ ప్రాణాన్ని, అంటే మీ శరీర వ్యవస్థలోని సౌర తాపాన్ని ప్రేరేపిస్తుంది. సూర్య క్రియ సాధన పైకి భౌతికమైనదిగానే కనిపిస్తుంది కానీ, అందులో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. నిజానికి సూర్య క్రియే అసలైన సాధన. ఇది సూర్యుడితో మిమ్మల్ని మీరు అనుసంధానం చేసుకునేమార్గం. ఇది చాలా మెరుగైన ప్రక్రియ. దీంట్లో శరీరపు అమరికపై (జామెట్రీపై) చాలా ధ్యాస పెట్టవలసి ఉంటుంది. నిజానికి సూర్య నమస్కారం దీనికి దూరపు చుట్టం. మీరు కండలను పెంచుకోవాలనుకుంటే, మీకు శారీరక దారుఢ్యంతో పాటు ఆధ్యాత్మికత కూడా కావాలనుకుంటే సూర్య నమస్కారం చేయండి. మీరు చేసే భౌతిక ప్రక్రియలో ఒక శక్తిమంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఉండాలనుకుంటే, మీరు సూర్యక్రియ చేయండి. మానవ శరీర నిర్మాణంలో సూర్యుడు, భూమి, చంద్రులకు ముఖ్యమైన పాత్ర ఉంది. సౌర వ్యవస్థలో జరిగే మార్పులు 12 1/4 నుండి 12 1/2 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతాయి. మీరు వీటితో అనుసంధానమై జీవిస్తే, అది మీకు శ్రేయస్సు కలిగిస్తుంది. మీ భౌతిక శరీరంలో పునరావృతమయ్యే వాటిని కూడా 12 1/4 నుండి 12 1/2 సంవత్సరాలకు ఒకసారి సంభవించేటట్లు చేసేందుకు సూర్యక్రియ ఒక మార్గం. మీ లోపలా, బయటా ఒక రకమైన స్థితిని ఏర్పరచుకోవడానికి సూర్యక్రియ దోహదపడుతుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ జీవన ప్రక్రియకు ఎటువంటి అవరోధాన్ని గానీ, ఇబ్బందిని గానీ కలిగించవు. ప్రేమాశీస్సులతో, సద్గురు ఫొటోలు : శివ మల్లాల మంచు లక్ష్మీప్రసన్న