పెళ్లికి ముందు.. ఆ తర్వాత | Abhijeeth and Ritu Varma team up for a rom-com | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు.. ఆ తర్వాత

Published Tue, Jun 24 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

పెళ్లికి ముందు.. ఆ తర్వాత

పెళ్లికి ముందు.. ఆ తర్వాత

అభిజిత్, రీతూవర్మ జంటగా విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆళ్ల నౌరోజీరెడ్డి, ఎ.శోభారాణి కలిసి నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో డి.రామానాయుడు చేతుల మీదుగా మొదలైంది. పెళ్లి తర్వాత ఓ ప్రేమజంట ప్రేమలో వచ్చే మార్పే ప్రధానాంశంగా ఈ చిత్రం ఉంటుందని, కొమ్మనాపల్లి గణపతిరావు సంభాషణలు, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలని నిర్మాతల్లో ఒకరైన నౌరోజిరెడ్డి చెప్పారు. ఇరవైఏళ్లుగా దర్శకత్వశాఖలో పనిచేస్తున్నానని, ఓ మంచి కథ ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని విజయ్ శ్రీనివాస్ అన్నారు. అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్రలను ఇందులో చేస్తున్నామని హీరోహీరోయిన్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శ్రీచరణ్ కార్తీకేయ మూవీస్, కెమెరా: కె.చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.శ్రీనివాస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement