Abhijeeth
-
అభిజీత్‌ను వెనక్కినెట్టిన అఖిల్..
గతేడాది ప్రసారమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 టైటిల్‌ని అభిజీత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు (ముగ్గురు వైల్డ్‌కార్డ్ సహా) ఈ సీజన్లో పాల్గొనగా.. అందరూ ఊహించినట్లుగానే అభిజీత్ టైటిల్‌ని గెలుచుకోగా అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ షో ముగిసి రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఏదో ఒక విషయంలో రోజూ వార్తల్లో నానుతూనే ఉంది. ఓవైపు ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొంటున్న వారికి మంచి ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు సీజన్లలో కంటే బిగ్‌బాస్4లో పాల్గొన్న వారు మాత్రం ఈ షో ద్వారా లభించిన ఫేమ్‌ను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా అవకాశాలతోపాటు పలు బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ సొంతం చేసుకున్నారు. వీరిలో వ్యక్తిక్తంతో అందరికంటే ఎక్కువ పాపులారీటిని సొంతం చేసుకున్న సోహైల్ ఓ సినిమాను కమిట్ అయిన విషయం తెలిసిందే. సోహైల్ మెయిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక మోనాల్ గజ్జర్ ఇప్పటికే అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక పాటలో మెరిసింది. మరో చిత్రంతో కూడా చర్చలు జరుపుతోంది. ఇక దేత్తడి హారిక రెండు సినిమాలను ఓకే చేసింది. దివి సినిమాల్లో నటిస్తోంది. కమెడీయన్ అవినాష్ ఓ టీవీ ఛానల్లో కామెడీ షో చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ సార్థక్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. బిగ్‌బాస్‌లో తన లవ్ పెయిర్ మోనాల్ గజ్జర్‌తో కలిసి వెబ్ సిరీస్లోనటిస్తున్నారు. చిత్రానికి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇంత మంది బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అనేక ఛాన్స్‌లు కొట్టేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంటే బిగ్‌బాస్ విన్నర్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. విన్నర్‌గా అబిజీత్ పేరు ప్రకటించడంంతో వెంటనే ఆయన ఇంటికి వరుసపెట్టి చిత్రనిర్మాతలు క్యూ కట్టారు. దీంతో అభిజీత్ ఇక మీద సినిమాల్లో దూసుకుపోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ అభి మాత్రం ఇప్పటికీ ఇంకా ఏ సినిమానూ ఒప్పుకోలేదు. అయితే స్టోరీల పరంగా మంచి వాటి కోసం ఎదురు చూస్తున్నాని.. సింహం లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తుందని అభిజీత్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చదవండి: జంటగా మారబోతున్న మోనాల్-అఖిల్ బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్! ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా? -
బిగ్‌బాస్ : అలా అంటావా.. మోనాల్‌పై అభి ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో అభిజిత్, అఖిల్ మధ్య వైరం ఓ రేంజ్‌కి చేరుకుంది. ప్రతి వారం ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ తమ కోపాన్ని రోజు రోజుకి పెంచుకుంటున్నారు. అయితే ఈ కోపం, ద్వేషానికి కారణం ఒకరిపై ఉన్న ప్రేమ మాత్రమే. ఆ ఒక్కరే మోనాల్. వీరిద్దరు ప్రతిసారి మోనాల్ విషయంలోనే గొడవ పడుతున్నారు. అయితే ఈ గొడవంతా ఎందుకని భావించిన అభిజిత్.. ఇటీవల మోనాల్‌కు కాస్త దూరంగా ఉంటూ హారికతో క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. అలా అని మోనాల్‌తో మాట్లాడటం మాత్రం ఆపలేదు. ఇక అఖిల్ ఏమో మోనాల్‌పై ప్రేమ చూపిస్తూనే.. అప్పుడప్పుడూ తన సూటిపోటి మాటలతో ఆమెను ఏడిపిస్తున్నాడు. ఇక మోనాల్ ఏమో ఇప్పటికీ తన మనసులో ఎవరున్నారో చెప్పకుండా ఇద్దరితో స్నేహాన్ని కొనసాగిస్తోంది. దివి సలహా సైతం పక్కన పెట్టి ఎప్పటిమాదిరిగానే రెండు పడవలపై ప్రయాణం కొనసాగిస్తోంది. అభి దగ్గర ఒకలా, అఖిల్ దగ్గర మరోలా మాట్లాడుతుంది. ఇదంతా గమనిస్తూ వస్తున్న అభిజిత్.. మోనాల్ వైఖరి ఏంటో డైరెక్ట్‌గా ఆమెతోనే చర్చించాడు. (చదవండి : ‘బిగ్ బాస్’లో మిర్చి మంట.. మెహబూబ్ టార్గెట్) గత వారం నామినేషన్ ప్రక్రియలో అభిజిత్, అఖిల్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి గొడవ మధ్యలో మోనాల్ విషయాన్ని ప్రస్తావించడంతో అభి, అఖిల్‌లపై నాగార్జున సీరియస్ అయ్యారు. ఇద్దరికి క్లాస్ పీకి.. ఎవరిది తప్పు ఉందో చెప్పమని మోనాల్ అడగ్గా.. ఇద్దరి మిస్టేక్ ఉందని ఆమె చెప్పింది. దీంతో షాకైన అభిజిత్.. నాతో అఖిల్ తప్పే ఉందని చెప్పి ఇప్పుడు ఇద్దరి తప్పని ఎలా అంటావ్ అని మోనాల్‌ని నిలదీశాడు. అయితే మధ్యలో నాగార్జున కలగజేసుకొని ఈ విషయాన్ని అక్కడితో ముగించేశాడు. కాగా, తాజాగా మరోసారి అభిజిత్ ఈ విషయాన్ని మోనాల్‌తో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. నాగ్ సర్ ముందు ఇద్దరి తప్పు ఎలా అంటావని మోనాల్‌ని నిలదీసినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ‘నీ బెడ్ రూమ్‌లో కూర్చొని అఖిల్ తప్పని అన్నావు. నాగ్ సర్ ముందు ఏమో ఇద్దరి తప్పు అని అంటావా? మా ఇద్దరితో బ్యాలెన్స్‌గా మూవ్ అవుదామని అనుకుంటున్నావా’ అని మోనాల్‌ని డైరెక్ట్‌గా నిలదీశాడు. ఒక అమ్మాయి కోణం నుంచి ఆలోచించు అని మోనాల్ చెప్పబోతుండగా.. ‘ఇది ఒక వుమెన్ ఇష్యూలాగా నిలబెట్టకు.. అఖిల్‌కి నిజంగా నీ మీద అంత ప్రేమ ఉంటే నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు తీశాడు? నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒక తీరు ఉంటావు.. అది నీకు సూట్ కానప్పుడు ఇంకోతీరు ఉంటావు’ అంటూ మోనాల్‌పై సీరియస్ అయ్యాడు. దీంతో మోనాల్ కంటతడి పెట్టింది. మరి ఆ ఇష్యూ ఎందాక పోయిందో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. #Abijeet about #Monal..Right ot Wrong??#BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/yMqY6CHdZH — starmaa (@StarMaa) October 12, 2020 -
పెళ్లికి ముందు.. ఆ తర్వాత
అభిజిత్, రీతూవర్మ జంటగా విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆళ్ల నౌరోజీరెడ్డి, ఎ.శోభారాణి కలిసి నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో డి.రామానాయుడు చేతుల మీదుగా మొదలైంది. పెళ్లి తర్వాత ఓ ప్రేమజంట ప్రేమలో వచ్చే మార్పే ప్రధానాంశంగా ఈ చిత్రం ఉంటుందని, కొమ్మనాపల్లి గణపతిరావు సంభాషణలు, కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలని నిర్మాతల్లో ఒకరైన నౌరోజిరెడ్డి చెప్పారు. ఇరవైఏళ్లుగా దర్శకత్వశాఖలో పనిచేస్తున్నానని, ఓ మంచి కథ ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందని విజయ్ శ్రీనివాస్ అన్నారు. అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్రలను ఇందులో చేస్తున్నామని హీరోహీరోయిన్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శ్రీచరణ్ కార్తీకేయ మూవీస్, కెమెరా: కె.చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వై.శ్రీనివాస్.