బిగ్‌బాస్‌ : అలా అంటావా.. మోనాల్‌పై అభి ఫైర్‌ | Bigg Boss 4 Telugu: Abhijeet Fires On Monal | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : నాగ్‌ సర్‌ ముందు అలా అంటావా.. అభి ఫైర్‌

Oct 12 2020 5:58 PM | Updated on Oct 12 2020 6:42 PM

Bigg Boss 4 Telugu: Abhijeet Fires On Monal - Sakshi

నిజంగా ప్రేమ ఉంటే..అఖిల్‌ అలా ఎందుకు చేశాడు.. మోనాల్‌కి అభిజిత్‌ క్లాస్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో అభిజిత్‌, అఖిల్‌ మధ్య వైరం ఓ రేంజ్‌కి చేరుకుంది. ప్రతి వారం ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ తమ కోపాన్ని రోజు రోజుకి పెంచుకుంటున్నారు. అయితే ఈ కోపం, ద్వేషానికి కారణం  ఒకరిపై ఉన్న ప్రేమ మాత్రమే. ఆ ఒక్కరే మోనాల్‌.  వీరిద్దరు ప్రతిసారి మోనాల్‌ విషయంలోనే గొడవ పడుతున్నారు. అయితే ఈ గొడవంతా ఎందుకని భావించిన అభిజిత్‌.. ఇటీవల మోనాల్‌కు కాస్త దూరంగా ఉంటూ హారికతో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నారు. అలా అని మోనాల్‌తో మాట్లాడటం మాత్రం ఆపలేదు. ఇక అఖిల్‌ ఏమో మోనాల్‌పై ప్రేమ చూపిస్తూనే.. అప్పుడప్పుడూ తన సూటిపోటి మాటలతో ఆమెను ఏడిపిస్తున్నాడు. ఇక మోనాల్‌ ఏమో ఇప్పటికీ తన మనసులో ఎవరున్నారో చెప్పకుండా ఇద్దరితో స్నేహాన్ని కొనసాగిస్తోంది. దివి సలహా సైతం పక్కన పెట్టి ఎప్పటిమాదిరిగానే రెండు పడవలపై ప్రయాణం కొనసాగిస్తోంది. అభి దగ్గర ఒకలా, అఖిల్‌ దగ్గర మరోలా మాట్లాడుతుంది. ఇదంతా గమనిస్తూ వస్తున్న అభిజిత్‌.. మోనాల్‌ వైఖరి ఏంటో డైరెక్ట్‌గా ఆమెతోనే చర్చించాడు.
(చదవండి : ‘బిగ్‌ బాస్‌​’లో మిర్చి మంట.. మెహబూబ్‌ టార్గెట్‌)

గత వారం నామినేషన్‌ ప్రక్రియలో అభిజిత్‌, అఖిల్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి గొడవ మధ్యలో మోనాల్‌ విషయాన్ని ప్రస్తావించడంతో అభి, అఖిల్‌లపై నాగార్జున సీరియస్‌ అయ్యారు. ఇద్దరికి క్లాస్‌ పీకి.. ఎవరిది తప్పు ఉందో చెప్పమని మోనాల్‌ అడగ్గా.. ఇద్దరి మిస్టేక్‌ ఉందని ఆమె చెప్పింది. దీంతో షాకైన అభిజిత్‌.. నాతో అఖిల్‌ తప్పే ఉందని చెప్పి ఇప్పుడు ఇద్దరి తప్పని ఎలా అంటావ్‌ అని మోనాల్‌ని నిలదీశాడు. అయితే మధ్యలో నాగార్జున కలగజేసుకొని ఈ విషయాన్ని అక్కడితో ముగించేశాడు.

 కాగా, తాజాగా మరోసారి అభిజిత్‌ ఈ విషయాన్ని మోనాల్‌తో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. నాగ్‌ సర్‌ ముందు ఇద్దరి తప్పు ఎలా అంటావని మోనాల్‌ని నిలదీసినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ‘నీ బెడ్‌ రూమ్‌లో కూర్చొని అఖిల్‌ తప్పని అన్నావు. నాగ్‌ సర్‌ ముందు ఏమో ఇద్దరి తప్పు అని అంటావా? మా ఇద్దరితో బ్యాలెన్స్‌గా మూవ్‌ అవుదామని అనుకుంటున్నావా’ అని మోనాల్‌ని డైరెక్ట్‌గా నిలదీశాడు. ఒక అమ్మాయి కోణం నుంచి ఆలోచించు అని మోనాల్‌ చెప్పబోతుండగా.. ‘ఇది ఒక వుమెన్‌ ఇష్యూలాగా నిలబెట్టకు.. అఖిల్‌కి నిజంగా నీ మీద అంత ప్రేమ ఉంటే నామినేషన్‌ ప్రక్రియలో నీ పేరు ఎందుకు తీశాడు? నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒక తీరు ఉంటావు.. అది నీకు సూట్‌ కానప్పుడు ఇంకోతీరు ఉంటావు’ అంటూ మోనాల్‌పై సీరియస్‌ అయ్యాడు. దీంతో మోనాల్‌ కంటతడి పెట్టింది. మరి ఆ ఇష్యూ ఎందాక పోయిందో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement