Bigg Boss Akhil Video Call With Monal, Comment Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

మోనాల్‌తో వీడియో కాల్‌, వైరల్‌గా మారిన అఖిల్‌ కామెంట్

Published Sat, Mar 27 2021 12:22 PM | Last Updated on Sat, Mar 27 2021 5:22 PM

Bigg Boss Akhil Sarthak Share Video Chat With Monal Gajjar - Sakshi

బిగ్‌బాస్‌ 4 సీజన్‌ కపుల్‌గా మోనాల్‌, అఖిల్‌కు సోషల్‌ మీడియాలో వీపరీతమైన క్రేజ్‌ ఉంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరిగా గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అపార్థాలతో ఈ షో అంతా మోనాల్‌, అఖిల్, అభిజిత్‌ల చూట్టే తిరిగింది. ఇక మోనాల్‌-అఖిల్‌ల మధ్య జరిగే రొమాంటిక్‌ మచ్చట్ల కోసమే చాలా మంది ఈ షోని వీక్షించారనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడో ఎలిమినేట్‌ కావాల్సిన మోనాల్‌ను బిగ్‌బాస్‌ చివరి వరకు పట్టుకొచ్చాడు. దీంతో మోనాల్‌ను నెటిజన్లు బిగ్‌బాస్‌ దత్త పుత్రికను చేసేశారు.

అయినప్పటికి ఎప్పుడు వీరిద్దరి మంచి స్నేహితులమే అని చెబుతుంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఏముందో ఇప్పటికి ఎవరికి అంతు చిక్కడం లేదు. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ కపుల్‌ తరచూ పార్టీలకు అటెండ్‌ అవ్వడం, పలు టీవీ షోలో జంటగా పాల్గొంటూ అదే బ్రాండ్‌ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమో అర్థంకాక ప్రేక్షకులు, అభిమానులు జుట్టు పిక్కుంటున్నారు. అయితే వీరిద్దరూ తరచూ వీడియో కాల్స్‌, చాట్స్‌ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్‌, మోనాల్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన స్క్రీన్‌ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు.  

బిగ్‌హౌజ్‌లో, బయటయ పలు టీవీ కార్యక్రమాల్లో మెనాల్‌పై ఉన్న ప్రేమను పాట రూపంలో వ్యక్త పరిచే అఖిల్‌.. ఈ సారి కవితాత్మకంగా చెప్పి కవిగా మారాడు. మోనాల్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన అనంతరం అఖీల్‌.. మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. ఆ తరువాత ‘ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది’ తన కవి హృదయాన్ని బయటపెట్టాడు. దీంతో అఖిల్ కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. కాగా వీరిద్దరూ జంటగా ప్రేమ కథా నేపథ్యంలో ఓ వెబ్‌ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. 

చదవండి: 
రామ్‌ చరణ్‌ బర్త్‌డే: మెగాస్టార్‌ ఎమోషనల్‌ వీడియో‌
ఆచార్యతో కలిసి నడిచిన సిద్ధ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement