
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్‌బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్‌బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్‌తో ముందుకు రాబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్‌తో కలిసి సందడి చేయబోతున్నారట!
మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్‌బాస్‌లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్‌ఫుల్‌గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్‌బాస్ లవర్స్,
Comments
Please login to add a commentAdd a comment