బిగ్‌బాస్ ఇంటిని వీడనున్న మోనాల్‌! | Bigg Boss 4 Telugu: Monal Might Be In Danger Zone This Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: మోనాల్‌ మెడపై ఎలిమినేషన్‌ కత్తి

Published Thu, Oct 22 2020 1:04 PM | Last Updated on Thu, Oct 22 2020 1:36 PM

Bigg Boss 4 Telugu: Monal Might Be In Danger Zone This Week - Sakshi

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఏడవ వారం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంట్లో 12 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఈ వారం ఎలిమినేషన్‌కు ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. దివి, అరియానా, మోనాల్‌, అవినాష్‌, అభిజిత్‌, నోయల్‌.. వీరిలో అభి, నోయల్‌, ముక్కు అవినాష్‌కు జనాల్లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ ఉండటంతో ఎలిమినేషన్‌లో నుంచి గట్టెక్కే అవకాశాలు ఎక్కవగానే ఉన్నాయి. మిగిలిన ముగ్గురిలో అరియానాను మొదట్లో కంటే ఇప్పుడు ఆమెను అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ఆమె ఆడుతున్న ఆట విధానామే కారణం. ముక్కుసూటిగా మాట్లాడటం, టాస్కల్లోనూ తన శాయశక్తులా పోరాడటం అరియానాకు ప్లస్‌ పాయింట్‌గా మారుతోంది. ఇక మిగిలిన దివి, మోనాల్‌ ఇద్దరిలో ఎవరో ఒకరు వారం చివర్లో ఇంటికి పయనం కానున్నారు. చదవండి: న‌ర‌కం చూపించిన ఆ ఇద్ద‌రే బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్లు

కాగా దివితో పోలిస్తే మోనాల్‌కు ఎలిమినేషన్‌ ఛాన్స్‌లు అధికంగా కన్పిస్తున్నాయి. దివికి ఇంట్లో ఎవరితోనూ వివాదాలు లేకపోవడం, అందరితో కలివిడిగా ఉండటం తనకు అచ్చొచ్చేలా ఉంది. టాస్క్‌ల్లోనూ మోనాల్‌తో పోలిస్తే దివికి మంచి మార్కులే ఉన్నాయి. అంతేగాక గత వారం ఎలిమినేట్‌ అంచుల్లోకి వెళ్లిన మోనాల్‌ అదృష్టం కొద్ది తృటిలో తప్పించుకొని సేఫ్‌ అయిపోయింది. మొదటి నుంచి అభి, అఖిల్‌ ఇద్దరితోనూ సైడ్‌ ట్రాక్‌ నడింపిచడం జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరితోనే కాకుండా కొత్తగా అవినాష్‌తో స్నేహం మొదటు పెట్టింది. చదవండి: అఖిల్‌, మెహ‌బూబ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం

అలాగే రెండు వారాలుగా అభిజిత్‌తో ఆమెకు పడకపోవడం, తనతో అభి మాట్లాడకపోవడం మోనాల్‌కు సమస్యగా మారతుంది. అంతేగాక అఖిల్‌కు‌ కూడా మోనాల్‌పై నమ్మకం కాస్తా సన్నగిల్లింది. వారం నుంచి ఆమెతో ఎక్కువ ఉండటం లేదు.  వీటన్నింటిని కారణాలుగా చూస్తే  మోనాల్ డేంజర​ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆమె‌ ఇంట్లో ఉండి ప్రయోజనం ఏం లేదని, హౌజ్‌ మేట్స్‌తో అన్ని గొడవలే అని జనాలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వారం ఇంటి నుంచి ఎలాగైనా గెంటేయాలని ఆలోచిస్తునట్లు కనిపిస్తంది. ఇక సోషల్‌ మీడియాలో పలు వెబ్‌సైట్‌లు నిర్వహించిన ఓటింగ్‌లో కూడా మోనాల్‌ మెడపై ఎలిమినేషన్‌ కత్తి బిగించుకోనున్నట్లు బయటపడింది. మరి అసలు ఎవరు ఈ వారం బ్యాగ్‌ సర్ధుకొని బిగ్‌బాస్‌ ఇంటికి బైబై చెప్పనున్నారో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement