ఒంట‌రిన‌య్యాను: అరియానా క‌న్నీళ్లు | Bigg Boss 4 Telugu: Bigg Boss Shows 55 Days Journey Video | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: క‌లిసిపోయిన మోనాల్‌, అభి, అఖిల్‌

Published Fri, Oct 30 2020 11:29 PM | Last Updated on Sat, Oct 31 2020 3:53 PM

Bigg Boss 4 Telugu: Bigg Boss Shows 55 Days Journey Video - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల ప్ర‌యాణం 55 రోజుల‌కు చేరుకుంది. ప‌రిచ‌యాలు, స్నేహాలు, అల్ల‌ర్లు, అల‌క‌లు, కోపాలు, క‌న్నీళ్లు, గెలుపులు, గాయాలు, ఓట‌ములు, ఒంట‌రిత‌నాలు ఇలా అన్నింటితో ప్ర‌యాణం జ‌రుపుతున్న కంటెస్టెంట్ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు సాగిన జ‌ర్నీని చూపించారు. అయితే వారు చేసినవన్నీ చూసుకుని కొంద‌రు మురిసిపోగా మ‌రికొంద‌రు త‌ప్పొప్పుల‌ను తెలుసుకున్నారు. ఇంకొందరు మ‌రింత‌గా బాధ‌ప‌డ్డారు. అప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి గాఢంగా నిట్టూర్పు వ‌దిలారు. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి.

కోరిన బొమ్మ ద‌క్కినా క‌న్నీళ్లు ఆగ‌లేవు
అరియానా కోరిక మేర‌కు బిగ్‌బాస్ త‌ను ఆడుకున్న‌ బొమ్మ‌ను తిరిగిచ్చేశాడు. దీంతో ఆమెకు ఇల్లు గుర్తొచ్చి ఎమోష‌న‌ల్ అయి క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంతో అవినాష్‌ ఊర‌డించాడు. ఛాన్స్ దొరికితే కెమెరా ముందు బ్యాడ్ చేయాల‌ని చూస్తున్నార‌ని సోహైల్‌ మెహ‌బూబ్‌తో చెప్పుకొచ్చాడు. ఇప్ప‌టినుంచి గేమ్‌లో ముందుకుపోతా అని డిసైడ్ అయిన‌ట్లు తెలిపాడు. మ‌రోవైపు మోనాల్‌, అభిజిత్, అఖిల్ కూర్చుని మాట్లాడుకున్నారు. కానీ వారి చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రాలేదు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: రేపు హోస్ట్ ఎవ‌రు?)

మాస్ట‌ర్‌, లాస్య గ‌జిబిజి జోడీ
ఇంట్లో ఉన్న‌ అభిజిత్-హారిక‌, అఖిల్‌-మోనాల్‌, మెహ‌బూబ్‌-సోహైల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌-లాస్య‌, అరియానా- అవినాష్‌ జంట‌లుగా విడిపోయారు. వీరి కోసం అబ‌ద్ధాల కోరు, బ‌ద్ద‌క‌స్తులు, జీరో టాలెంట్‌, గ‌జిబిజి, అహంకారుల జంట అనే బోర్డులు సిద్ధం చేసి ఉన్నాయి. ఇక ఒక్కో జంట‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ మిగ‌తా జంట‌ల గురించి ఏమ‌నుకుంటున్నారో చెప్పడంతోపాటు, వారికి ఏ బోర్డు స‌రిగ్గా సూట‌వుతుందో పేర్కొనాల‌ని ఆదేశించాడు. మొద‌ట క‌న్ఫెష‌న్ రూమ్‌లో అడుగు పెట్టిన‌ అభిక‌(అభి-హారిక జంట‌) మాస్ట‌ర్-లాస్య‌ జోడీని గ‌జిబిజి జంట‌గా పేర్కొంది. (చ‌ద‌వండి: విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టిన‌ట్లు ఉంది: మాస్ట‌ర్‌)

ఆ జంట కోప్ప‌డకూడ‌దు
మెహ‌బూబ్‌-సోహైల్ "బ‌ద్ధ‌క‌స్తుల జంట"‌గా అవినాష్- అరియానాల‌ను, అఖిల్, మోనాల్ "అబ‌ద్ధాల కోరుల జంట‌"గా సోహైల్‌- మెహ‌బూబ్‌ను, అవినాష్‌, అరియానా "అహంకారుల జోడీ"గా అఖిల్‌- మోనాల్‌ను, మాస్ట‌ర్‌, లాస్య "జీరో టాలెంట్ జంట"‌గా అభిజిత్‌, హారిక పేర్ల‌ను చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన మెడ‌ల్స్‌ను వారి మెడ‌లో వేశారు. అనంత‌రం బిగ్‌బాస్ ఆ మెడ‌ల్స్‌లో ఉన్న‌ది నిజం కాద‌ని నిరూపించుకునేందుకు వివిధ టాస్క్‌లు ఇచ్చాడు. జీరో టాలెంట్ జోడీని పిల్చిన‌ప్పుడ‌ల్లా వారు ప‌ర్ఫామెన్స్‌లు చేయాల్సి ఉండ‌గా, గ‌జిబిజి జంట‌ను పిలిచిన‌ప్పుడు వారు స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుంది. అబ‌ద్ధాల కోరుల జంట‌ను పిలిచిన‌ప్పుడ‌ల్లా వారు ఇంటిస‌భ్యుల గురించి నిజాలను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు చెప్పాల్సి ఉంటుంది. ఇక‌ ఇంటిస‌భ్యులు కోపం తెప్పించిన‌ప్పుడ‌ల్లా అహంకారుల జంట ప్ర‌శాంతంగా ఉండాల్సి ఉంటుంది. బ‌ద్ధ‌క‌స్తుల జంట‌ను పిలిచిన‌ప్పుడు ఇత‌ర కంటెస్టెంట్లు ఏ ప‌ని చెప్పినా చేయాల‌ని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు.

సోహైల్ మీద అరిచి ఏడ్చేసిన అఖిల్‌
త‌ర్వాత సోహైల్ తానేం అబ‌ద్ధం ఆడానంటూ అఖిల్‌ను నిల‌దీశాడు. లేనిది సృష్టిస్తే అబ‌ద్ధ‌మ‌ని వివ‌రించాడు. దీంతో అఖిల్‌ "నాకు అనిపించిది చెప్పాను, నా గేమ్ నేను ఆడినా" అని తేల్చి చెప్పాడు. స‌రే ఇప్ప‌టి నుంచి నేను కూడా గేమ్ ఆడుతా అని సోహైల్ స‌వాలు విసిరాడు. ఇంత‌కుముందు మాట్లాడుతుంటే కోపంగా మ‌ధ్య‌లో నుంచి ఎందుకు వెళ్లిపోయావ్ అన్న సోహైల్ ప్ర‌శ్న‌కు నా ఇష్ట‌మ‌ని అఖిల్‌ దురుసుగా స‌మాధాన‌మిచ్చాడు. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ తారాస్థాయికి చేరుకోగా నానా మాట‌లు అనేసిన‌ అఖిలే ఏడ్చేశాడు. దీంతో అప్ప‌టివ‌ర‌కు ఫ్ర‌స్టేట్ అయిన సోహైల్ ఒక్క‌సారిగా అత‌డి క‌న్నీళ్లు తుడిచి ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఓదార్చాడు. (చ‌ద‌వండి: ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన అరియానా)

ప్యాంటులో ఐస్‌గ‌డ్డ‌లు వేసి అరాచ‌కం
టాస్క్‌లో భాగంగా మెహ‌బూబ్ మాస్ట‌ర్ గురించి చెప్తూ, ఆయ‌న‌కు కోప‌మెక్కువ అని, వ్య‌క్తిత్వాన్ని నిందిస్తార‌ని, దాన్ని కంట్రోల్ చేసుకోవాల‌ని సూచించాడు.‌ ఇంటిస‌భ్యులు దొరికిందే ఛాన్స‌ని అరియానా, అవినాష్‌లతో బోళ్లు తోమించారు. ఇక మోనాల్ మీద నీళ్లు గుమ్మ‌రించ‌గా, అఖిల్ ప్యాంటులో ఐస్ గ‌డ్డ‌లు వేసి ఇద్ద‌రినీ స్విమ్మింగ్ పూల్‌లోకి తోశారు. గుడ్లు ప‌గ‌ల‌గొట్టి వారి మీద వేశాడు. ఇంత‌లా టార్చ‌ర్ పెట్టినా వారు ఆగ్ర‌హానికి లోన‌క‌పోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. (చ‌ద‌వండి: అలాంటి అమ్మాయి కావాలి: అఖిల్‌)

55 రోజులు: క‌ంటెస్టెంట్లు ఎమోష‌న‌ల్‌
మెహ‌బూబ్‌ మోనాల్ బెడ్డును చింద‌ర‌వంద‌ర చేయ‌గా సోహైల్ వెళ్లి స‌ర్దేశాడు. దీంతో సంతోషప‌డ్డ‌ అఖిల్ సోహైల్‌కు తిన‌పిస్తాన‌న్నాడు.  అనంత‌రం బిగ్‌బాస్‌ ఇంటిస‌భ్యుల‌కు 55 రోజుల ప్ర‌యాణాన్ని వీడియో వేసి చూపించాడు. ప్రేమ‌లు, అల‌క‌లు, గొడ‌వ‌లు, చిలిపి ప‌నులు, బాధ‌లు అన్నింటి స‌మ్మేళ‌న‌మైన‌ మ‌ధుర జ్క్షాప‌కాలను గుర్తు చేసుకుందామ‌న్నాడు. వారి జ‌ర్నీని చూసుకుని కంటెస్టెంట్లు మ‌రోసారి ఎమోష‌న‌ల్ అయ్యారు. పాత జ్ఞాప‌కాలు గుర్తు రావ‌డంతో అభిజిత్, మోనాల్, అఖిల్‌ క‌లిసిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది. అటు అరియానా మాత్రం ఒంట‌రిన‌య్యాన‌నిపిస్తోంద‌ని ఏడుస్తుంటే మేమంతా ఉన్నామంటూ అవినాష్ ఓదార్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement