Bigg Boss Telugu 4 Contestants Dreams After Winning Prize Money, Ariyana, Monal, Abhijeeth, Sohel, Akhil, Harika - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: నెర‌వేర‌ని మోనాల్ క‌ల‌!

Published Sun, Dec 13 2020 11:21 PM | Last Updated on Mon, Dec 14 2020 7:47 PM

Bigg Boss 4 Telugu: Monal Out, Meet Top 5 Finalists - Sakshi

ఊహించ‌న‌ట్లే న‌ర్మ‌ద వెళ్లిపోయేందుకు బిగ్‌బాస్ గేట్లు ఎత్తారు. అయితే ఎప్పుడూ ఏడ్చే ఆమె వెళ్లిపోయేట‌ప్పుడు మాత్రం పెద్ద‌గా ఏడ‌వ‌కుండా న‌వ్వుతూనే అంద‌రికీ వీడ్కోలు ప‌లక‌డం కాస్త ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. త‌న‌కు మొద‌ట్లో పువ్విచ్చిన అఖిల్‌కు బ‌రువెక్కిన హృద‌యంతో వీడ్కోలు చెప్తూ అత‌డి చేతికి పువ్వందించింది. ఇంకా ఎన్నెన్నో జ‌రిగిన బిగ్‌బాస్ హౌస్‌లో ఏమేం జ‌రిగాయో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ క‌న్నేయండి..

రైతుల కోసం డ‌బ్బు ప‌క్క‌న పెడ‌తా
బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీ రూ.50 ల‌క్ష‌ల‌ని నాగ్ పేర్కొన్నారు. ట్రోఫీ గెలిచి ఈ డబ్బు మీ సొంత‌మ‌వుతే ఏం చేస్తార‌ని నాగ్ ప్ర‌శ్నించారు. నాకు ఒక్క రూపాయి వ‌ద్దు, అన్నీ అమ్మ‌కే ఇస్తాన‌ని హారిక చెప్పుకొచ్చింది. ఈ డ‌బ్బుల‌తో ఒక ఇల్లు క‌ట్టుకుంటాను. మా ఊరిలో పొలం కోసం రూ.50,000 అప్పు చేసిన‌ ఐదారుగురి రుణాన్ని తీర్చేస్తాన‌ని అరియానా త‌న మంచి మ‌న‌సును చాటుకుంది. తాను డ‌బ్బు గెలిస్తే దాన్ని నాన్న‌కే ఇచ్చేస్తాన‌ని అభిజిత్ అన్నాడు. నా కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ‌ అమ్మ కోసం ఇన్వెస్ట్ చేస్తాను అని మోనాల్‌, ఓల్డేజ్ హోమ్ వాళ్ల‌కు కొంత డ‌బ్బు ఇస్తాను. వీలైతే ఓ ఇల్లు కొనుక్కుంటా అలాగే ఒక కెఫె పెడ‌తాను అని అఖిల్ చెప్పాడు. త‌ను కెఫె పెడితే త‌ప్ప‌కుండా రావాల‌ని నాగార్జున‌ను ఆహ్వానించాడు. అనంత‌రం సోహైల్ మాట్లాడుతూ... నా అకౌంట్‌లో ఎప్పుడూ ల‌క్ష‌కు మించి లేవు. అవ‌స‌రంలో ఉన్న‌వారి కోసం రూ.10 ల‌క్ష‌లు ప‌క్క‌న పెడ‌తాను. ఓ ఫ్లాట్ కొంటాను అని త‌న ప్లానింగ్స్‌ వివ‌రించాడు. [చ‌ద‌వండి: ఆ హౌజ్‌మెట్‌కే నా మద్దతు: విజయ్‌ దేవరకొండ ]

అబ్బాయిల‌ను చిత్తుచిత్తుగా ఓడించిన అమ్మాయిలు
అనంత‌రం కంటెస్టెంట్లు విన్నింగ్ స్పీచ్ ఇచ్చారు. కాక‌పోతే వారి విజ‌యం గురించి కాకుండా తోటి ఇంటి స‌భ్యుడు గెలిస్తే ఎలా స్పీచ్ ఇస్తారో చెప్పాల‌ని నాగ్ మెలిక పెట్టారు. ఇందులో హారిక‌.. మోనాల్‌, అరియానా.. అభిజిత్‌, అభిజిత్‌.. అఖిల్‌, మోనాల్‌.. సోహైల్‌, అఖిల్‌.. అరియానా, సోహైల్‌.. హారికను ఇమిటేట్ చేస్తూ వారి విన్నింగ్ స్పీచ్ ఇచ్చి న‌వ్వించారు. అనంత‌రం అభి ఫినాలే‌కు చేరుకున్న‌ట్లు నాగ్ వెల్ల‌డించారు. త‌ర్వాత ఇంటిస‌భ్యులతో సినిమా పేరు క‌నుక్కోమ‌ని పోస్ట‌ర్ గేమ్ ఆడించారు. రెండో లెవ‌ల్‌లో డంబ్ షేరాడ్స్ ఆడించారు. అయినా స‌రే అబ్బాయిలు చిత్తు చిత్తుగా ఓడిపోగా అమ్మాయిలు గెలుపు సాధించారు. త‌ర్వాత హారిక ఫినాలేలో అడుగు పెట్టిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించారు. ఆమె మోనాల్ సేఫ్ అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. కానీ ఆమె అంచ‌నా త‌ప్పింది. అరియానా ఫైన‌లిస్టుగా ఎంపికై మోనాల్ ఎలిమినేట్ అయింది.

టైటిల్ గెల‌వాలా? ఇది మార్చుకోండి
మోనాల్ ఎలిమినేష‌న్‌తో అఖిల్‌కు షాక్ త‌గిలింది. అత‌డి గొంతు మూగ‌బోయింది. అత‌డి మౌన వేద‌న‌ను అర్థం చేసుకున్న మోనాల్‌.. క‌న్నీళ్ల‌తో అత‌డికి పువ్విచ్చి వీడ్కోలు తీసుకుంది. స్టేజీ మీద‌కు వ‌చ్చిన మోనాల్ టైటిల్ గెల‌వాలంటే ఏం మార్చుకోవాలో ఇంటిస‌భ్యుల‌కు స‌ల‌హాలిచ్చింది. అంద‌రితో మాట్లాడమ‌ని, ముఖ్యంగా అఖిల్‌కు స‌మ‌యం కేటాయించ‌మ‌ని అభిజిత్‌కు సూచించింది. నేను హౌస్‌లో ఉంటే మీ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయ్యేవారు అన్నావు క‌దా, ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వ‌చ్చింద‌ని అభికి చెప్ప‌చెప్పింది. దీంతో అభి స్పందిస్తూ.. తాన‌లా అన‌లేదని, బాధ‌పెట్టి ఉంటే క్ష‌మించ‌మ‌ని కోరాడు. బిగ్‌బాస్ అయ్యాక‌ త‌ప్ప‌కుండా గుజ‌రాత్‌కు వ‌చ్చి క‌లుస్తానని మాటిచ్చాడు. అరియానాకు టాస్క్‌లో అంత‌ అగ్రెసివ్ వ‌ద్ద‌ని సూచించింది. సోహైల్.. చిన్న చిన్న మాట‌ల‌కు బాధ‌ప‌డొద్ద‌ని తెలిపింది. ఫైన‌ల్‌లో హారిక.. అఖిల్‌ను దాటేయాల‌ని కోరింది. ఆమె కోరిక విని అఖిల్ షాక్‌తో‌ నోరు తెరిచాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజితే‌: శ‌్రీకాంత్‌)

భావాల‌ను పాట‌లో వ్య‌క్తీక‌రించిన అఖిల్‌
ఈ మ‌ధ్య త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసిన‌ అఖిల్ మీద మోనాల్‌ గ‌ర‌మైంది. వ‌చ్చే ముందు ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని చిర్రుబిర్రులాడింది. ఒక పాట పాడ‌మ‌ని చెప్ప‌గా.. 'ఉండిపోరాదే, గుండె నీదేలే..' అంటూ గుండె లోతుల్లోని ప్రేమ‌ను వెలికితీస్తూ పాడ‌టంతో ఆమె కళ్ల వెంట నీళ్లు జ‌ల‌జ‌లా రాలాయి. నిన్ను బాధ‌పెట్టినందుకు సారీ అంటూనే వారం త‌ర్వాత వ‌చ్చి మాట్లాడ‌తాన‌న్నాడు. అయితే గొడ‌వ‌పెట్టుకునేందుకు మాత్రం రావ‌ద్ద‌ని మోనాల్ హెచ్చ‌రించ‌గా అదేంటో కాస్త మాకు కూడా చెప్పండ‌ని నాగ్ స‌ర‌దాగా జోక్ చేయ‌డంతో అంద‌రూ న‌వ్వేశారు. 

పార్టీ చేసుకున్న ఫైన‌లిస్టులు
టైటిల్ గెలిస్తే వ‌చ్చే ప్రైజ్‌మ‌నీతో అమ్మ కోసం ఇన్వెస్ట్ చేయాల‌న్న మోనాల్‌ క‌ల ప్ర‌స్తుతానికైతే క‌ల‌గానే మిగిలిపోయింది. అనంత‌రం టాప్ 5 కంటెస్టెంట్లు అఖిల్‌, సోహైల్‌, అభిజిత్‌, హారిక‌, అరియానా ఫైన‌ల్‌లో అడుగుపెట్టినందుకు చిందేస్తూ పార్టీ చేసుకున్నారు. మ‌రో ముఖ్య విష‌య‌మేంటంటే.. వీళ్ల‌లో ఒక‌రిని విన్న‌ర్ చేసే ఓటింగ్ ఈ రాత్రి నుంచే మొద‌లు కానుంది. కాబ‌ట్టి మీ ఫేవ‌రెట్ కంటెస్టెంటుకు ఓటేయడం అస్స‌లు మిస్స‌వ‌కండి. (చ‌ద‌వండి: హారిక త‌మ‌న్నా, మోనాల్ అనుష్క అంటోన్న‌ అభి)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement