అరియానా టార్చ‌ర్‌! గుక్క పెట్టి ఏడ్చిన మోనాల్‌ | Bigg Boss 4 Telugu: Monal Is Crying Because Of Ariyana | Sakshi
Sakshi News home page

గుక్క‌పెట్టి ఏడ్చిన మోనాల్‌, ఓదార్చిన బిగ్‌బాస్‌

Published Tue, Dec 8 2020 11:34 PM | Last Updated on Sat, Dec 12 2020 5:53 PM

Bigg Boss 4 Telugu: Monal Is Crying Because Of Ariyana - Sakshi

పంతొమ్మిది మంది కంటెస్టెంట్లు పాల్గొన్న‌ బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు అచ్చంగా ఆరుగురే మిగిలారు. ఎలాగైనా టైటిల్ కొట్టేయాల‌న్న క‌సితో వీళ్లంద‌రూ రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నారు. ఈ క్ర‌మంలో ఎంట‌ర్‌టైన్ చేస్తూ మిమ్మ‌ల్ని మీరు నిరూపించుకోమ‌ని బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో అరియానా బెస్ట్ రూల‌ర్‌గా నిలిచింది. ఇక త‌ర్వాతి టాస్కులో మోనాల్‌, అరియానా మ‌ధ్య మ‌ళ్లీ గొడ‌వ‌లు రాజుకున్నాయి. త‌న బొమ్మ‌ను పైన ప‌డేసినందుకు అరియానా మోనాల్‌ను నోటికొచ్చిన‌ట్లు తిట్టింది. దీంతో ఆమె గుక్క‌పెట్టి ఏడ‌వ‌గా ఓదార్చేందుకు ఎవ‌రూ లేక‌పోవ‌డం మ‌రీ దారుణం. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే దీన్ని చ‌దివేయండి..

అలా వేరే అబ్బాయితో ఉంటే న‌చ్చ‌దు
మ‌హారాణి కిరీటం ధ‌రించిన అరియానా ఇంట్లోవాళ్ల‌కు ఓ టాస్క్ ఇచ్చింది. మీకు న‌చ్చిన వ‌స్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాప‌కాన్ని పంచుకుకోవాల‌ని ఆదేశించింది. అలాగే దాన్ని ఇంట్లో న‌చ్చిన‌వాళ్ల‌కు ఇవ్వాల‌ని చెప్పింది. దీంతో సోహైల్ త‌న గుర్తుగా అభిజిత్‌కు స‌స్పెండ‌ర్‌, హారిక‌కు క‌త్తి, మోనాల్‌కు టీ ష‌ర్ట్‌, అరియానాకు ప‌ర్ఫ్యూమ్‌, అఖిల్‌కు జాకెట్‌ను ఇచ్చాడు. అనంత‌రం మ‌హారాణిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోనాల్ త‌న‌లో మంచీచెడు ఏంటో చెప్ప‌మ‌ని మంత్రి అఖిల్‌ను అడిగింది. ఒక మ‌నిషి నిన్ను ద్వేషించినా కూడా ఇష్ట‌ప‌డటం మంచి ల‌క్ష‌ణమైతే, సంతోషంలో త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం చెడు ల‌క్ష‌ణ‌మ‌ని చెప్పాడు. అలాగే నాతో ఉన్న‌ట్లుగా వేరే అబ్బాయితో ఉంటే నాకు న‌చ్చ‌ద‌ని మ‌న‌సులోని మాట‌ను చెప్పాడు. (చ‌ద‌వండి: అభితో ఉండ‌ట్లేదని హారిక‌ను తిడుతున్న నెటిజ‌న్లు)

హారిక కోసం అభిజిత్ క‌ల‌వ‌రింత‌
అనంత‌రం మోనాల్‌ స్కిట్ చేయ‌మ‌ని ఆదేశించింది. అందులో భాగంగా అభిజిత్ అమ్మాయిగా న‌టిస్తూ సోహైల్‌ను పార్టీకి ఒప్పించాల్సి ఉంటుంది. కానీ వీళ్ల మ‌ధ్య‌లో అరియానా, హారిక కూడా దూర‌డంతో స్కిట్టు ఆగ‌మాగం అయింది. కాసేపు న‌వ్వించిన‌ప్ప‌టికీ ఎటూ తేల‌కుండా లేకుండా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. మొత్తానికి ఈ అధికారం‌ టాస్కులో అరియానా బెస్ట్ రూల‌ర్‌గా ఎంపికైంది. దీంతో క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి వెళ్లిన ఆమె క‌న్నీటిప‌ర్యంత‌మైంది. ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు మీ ప్రేమ కావాలి. ఈ ఒక్క మెట్టు న‌న్ను ఎక్కించండి. నాకు ఓటేసి సాయం చేయండి అని అభ్య‌ర్థించింది. మ‌రోవైపు నిన్న హారిక రాజ్యంలో జ‌రిగిన గొడ‌వ‌తో అఖిల్‌, సోహైల్‌కు స‌రిగా మాట‌ల్లేవు. ఈ అన్న‌ద‌మ్ముల‌ను క‌లిపేందుకు మోనాల్ త‌న వంతు ప్ర‌య‌త్నించ‌గా చివ‌రికి వాళ్లు క‌లిసిపోయారు. ఇక అభిజిత్ హారిక‌ను ఎంత మిస్స‌వుతున్నాడో చెప్ప‌క‌నే చెప్పాడు. త‌న‌తో టైమ్ స్పెండ్ చేయ‌మ‌ని చెప్తూ ఓ లేఖ‌ను రాత్రి ఒంటిగంట‌కు హారిక బెడ్‌పై పెట్టాడు. అది చూసి ఆమె చ‌లించిపోయింది.

కంటెస్టెంట్ల‌కు ఓపిక‌కు ప‌రీక్ష..
కంటెస్టెంట్లు వారేంటో నిరూపించుకునేందుకు బిగ్‌బాస్ 'ఓపిక' అనే రెండో టాస్క్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంటు ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వ‌కుండా రోబోలా కూర్చోవాలి. మొద‌ట అరియానాతో టాస్క్ మొద‌ల‌వ‌గా ఆమెను ఇరిటేట్ చేసేందుకు సోహైల్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. ఆమె ఫేవరెట్ డ్రెస్ చింపుతాన‌ని బెదిరించాడు కానీ అంత ధైర్యం చేయ‌లేక‌పోయాడు. త‌న‌కిష్ట‌మైన‌ ఆర్వీ క‌ప్పును ప‌గ‌ల‌గొట్టినంత ప‌ని చేశాడు. త‌ర్వాత‌ మోనాల్ ఆమెకిష్ట‌మైన చింటూ బొమ్మ‌ను విసిరేసింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌లో ప‌నికి రానోళ్ల‌ను తోసేయండి: రాహుల్)

ఇన్ని రోజులు న‌టించావా..?
త‌ర్వాత మోనాల్ రోబోలా కూర్చోగా అరియానా త‌న మ‌న‌సులో ఉన్న‌దంతా క‌క్కేసింది. అవినాష్‌ను నువ్వు త‌న్ని మ‌రీ ఓ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చావ‌ని చెప్పింది. నా మీద ఎంత ప‌గుందో బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపింది. నా బొమ్మ‌ను హౌస్ అవ‌తల పడేద్దామ‌నుకున్నావు, న‌న్ను హ‌ర్ట్ చేయాల‌నుకున్నావు. మ‌న‌సులో ఇంతున్న‌ప్పుడు బ‌య‌ట‌కు న‌టించావా? అని క‌డిగి పారేసింది. ఒక్కో అంశాన్ని బాణాల్లా వదులుతూ ఆమె మ‌న‌సును గాయ‌ప‌ర్చింది. అనంత‌రం టాస్కు పూర్త‌వ‌గానే మోనాల్ లోప‌ల‌కు వెళ్లి ఒంట‌రిగా ఏడ్చేసింది. గేమ్ ఆడినా, ఆడ‌క‌పోయినా ప్రాబ్ల‌మే అని దుఃఖించింది. సోఫాలో ఒంట‌రిగా గుక్క‌పెట్టి మ‌రీ ఏడ్చింది. దీంతో బిగ్‌బాస్‌ ఆమె క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచాడు. (చ‌ద‌వండి: అవినాష్ అవుట్‌: అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌)

ఒంట‌రిగా ఏడ్చిన మోనాల్‌
అక్క‌డ ఆమె త‌న గోడు చెప్పుకుంది. నేస‌లు ఇక్క‌డ ఉండ‌టానికి అర్హురాలినే కాద‌న్న‌ట్లుగా చూస్తున్న ప్ర‌తిసారి ఎలిమినేష‌న్‌లా అనిపిస్తోంది అని త‌న గుండెల్లో ర‌గులుతున్న బాధ‌ను బ‌య‌ట‌పెట్టింది. దీంతో బిగ్‌బాస్ ఆమెకు ధైర్యం నూరిపోసేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే అదే స‌మ‌యంలో సోహైల్ టాస్కులో ఉన్నందున అత‌డు ఆమెను ఓదార్చ‌లేక‌పోయాడు. కానీ టాస్కు ముగిశాక సోహైల్ మోనాల్ బాధ‌ను చూసి త‌ట్టుకోలేక‌పోయాడు. ఆమెను అంత‌లా ఏడిపించినందుకు అరియానా మీద విరుచుకుప‌డ్డాడు. ఇద్ద‌రూ పెద్ద గొడ‌వ‌కు దిగ‌గా అరియానా కింద‌ప‌డీ మ‌రీ ఏడ్చింది. మ‌రి ఈ గొడ‌వ ఎలా స‌ద్దుమ‌ణిగింది? ఇందులో ఎవ‌రిది త‌ప్పు? ఎవ‌రిది ఒప్పు? అనేది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: మోనాల్‌ టాపికే బిస్కేటైంది.. అభిజిత్‌ కంటతడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement