
మిల్కీ బ్యూటీగా అభిమానుల్లో గుండెల్లో పేరు సంపాదించుకున్న భామ తమన్నా భాటియా. గతేడాది జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌లతో అలరించింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో మరి బోల్డ్‌గా నటించి తన గ్లామర్‌ను మరోసారి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మతో చేసిన రొమాన్స్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఈ సిరీస్‌లో అలా నటించడంపై తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
లస్ట్ స్టోరీస్-2 ఫస్ట్ పార్ట్ చూశాక బోల్డ్ సీన్స్ పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తమన్నా తెలిపింది. అలా నటిస్తే తప్పేముందని నాలో నేనే ప్రశ్నించికున్నానని పేర్కొంది. అయితే అలాంటి సీన్స్‌లో నటిస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని వెల్లడించింది. అందుకే బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేం లేదని అనిపించిందని తెలిపింది. అంతే కాదు.. ఒక నటిగా తాను అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చింది. అందుకే ఒక నటిగా తాను ఏం చేయాలో అదే చేస్తానంటోంది మిల్కీ భామ.
Comments
Please login to add a commentAdd a comment