
‘మిణుగురులు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్’. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్టంశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘బోల్డ్ కంటెంట్‌కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అయోధ్యకుమార్. అదిత్, హెబ్బా మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్.
ఇప్పటికే విడుదలైన మా సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద రెడ్డి, కెమెరా: ఉదయ్ గుర్రాల, సంగీతం: జోయ్ బరువా, నేపథ్య సంగీతం: వివేక్ ఫిలిప్.