Adith Arun
-
అదిత్ అరుణ్ రామ్ పోతినేని లాగా ఉన్నాడా..?
-
చిరంజీవికి పరిచయం చేస్తానంటే ఒప్పుకోలేదు: యంగ్ హీరో
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి అదిత్ అరుణ్ (త్రిగుణ్). తనకున్న టాలెంట్‌తో హీరోగా ఎదిగాడు. పలు చిత్రాలు చేసినప్పటికీ ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను చాలా సినిమాలు చేశాను. కానీ ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. నేను చిరంజీవికి వీరాభిమానిని. స్కూల్లో ఉన్నప్పుడే ఆయన్ను కలిశాను. మా ఇంట్లో చిరంజీవిది తప్ప ఎవరి ఫోటో ఉండదు. ఆయన కూతురు సుష్మితతో పరిచయముంది. నన్ను చిరుకు పరిచయం చేస్తానంది కానీ నేను ఒప్పుకోలేదు. ఏదో ఒక రోజు నా పేరు తనకు తెలుస్తుంది.. ఆరోజే తనను కలుస్తానని చెప్పాను. అది జీవితంలో మర్చిపోలేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది.. నేను ఉద్వేగం సినిమా చేశాను (త్వరలో రిలీజవుతుంది). ఆ సినిమా చివరి రోజు షూటింగ్... ఉదయం రెడీ అవుతున్నాను, ఇంతలో నాన్న నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అమ్మ చనిపోయిందని చెప్పాడు. నిర్మాతకు షూటింగ్‌కు రాలేనని ఎలా చెప్పాలా? అని చాలా టెన్షన్ పడ్డాను. సినిమాకు డబ్బుల్లేని రోజులు, ఫ్లాప్ అయినప్పుడు, సినిమా ఆగిపోయిననాడు.. ఎన్నడూ అంత టెన్షన్ పడలేదు. ఆరోజు మాత్రం ఓపక్క కన్నీళ్లు, మరోపక్క చెమటలు పట్టాయి. నిర్మాతకు చెప్తే వెంటనే షూటింగ్ క్యాన్సల్ చేశాడు. ఇంటికి రౌడీలను పంపించారు పా.రంజిత్.. అట్టకత్తి సినిమాకు నన్నే హీరో అనుకున్నాడు. కానీ అప్పటికే చేతిలో మరో సినిమా ఒప్పుకోవడంతో అది చేయలేకపోయాను. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీలవుతుంటాను. రెండేళ్లక్రితం.. కొందరు ఓ సినిమా షూట్ చేస్తున్నామని అడ్వాన్స్ ఇచ్చి ఫోటోలు తీశారు. తీరా నన్ను పక్కన పెట్టి ఓ హీరో కుమారుడిని పెట్టారు. నాకు కోపమొచ్చి అడ్వాన్స్ తిరిగివ్వలేదు. ఇంటికి రౌడీలను పంపించారు. బెదిరించారు.. అయినా బెదరలేదు' అని చెప్పుకొచ్చాడు అదిత్ అరుణ్. చదవండి: 58 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన సింగర్ తల్లి? -
మాకు పొలం ఉంది మా అమ్మ వ్యవసాయం చేస్తుంది
-
అందుకోసం ఏడు కేజీల బరువు పెరిగాను: హీరో
‘‘రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’ చిత్రాలు బయోపిక్స్ క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. ‘కొండా’ మూవీ బయోఫిక్షన్.. ఇందులో కొండా మురళి, సురేఖ జీవితంలో జరిగిన ఘటనలను తీసుకుని కల్పిత కథ రాశారు. బయోపిక్, బయోఫిక్షన్ చిత్రాల మధ్య వ్యత్యాసం ఉంది’’ అని హీరో త్రిగుణ్ అన్నారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించిన చిత్రం ‘కొండా’. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా త్రిగుణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కొండా’ సినిమా కోసం దాదాపు ఏడు కేజీల బరువు పెరిగాను. అప్పటి కాలేజీ రాజకీయాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఎమోషనల్‌గా కూడా ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఇక నేను నటించిన ‘ప్రేమ దేశం’, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దేవా కట్టా శిష్యుడు సురేష్ దర్శకత్వంలో ఒక సినిమా, మిస్కిన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. రాక్‌లైన్ వారి కొత్త బ్యానర్ ‘పర్పుల్ రాక్’లో ‘లైన్‌మేన్’, ‘కిరాయి’ అనే సినిమాలు చేస్తున్నాను’’ అని త్రిగుణ్ తెలిపారు. చదవండి: దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
ఆకట్టుకుంటున్న ‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్
యంగ్ హీరో తిృగున్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న తాజా చిత్రం‘కథ కంచికి మనం ఇంటికి’.యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చాణిక్య చిన్న దర్శకత్వం వహిస్తున్నారు.కామెడీ హారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది. సప్తగిరి, గెటప్ శ్రీనుల కామెడీ నవ్వులు పూయిస్తుంది.ట్రైలర్ మాదిరే సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. -
‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ మూవీ రివ్యూ
టైటిల్: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష,తదితరులు సమర్ఫణ: సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ: రామంత్ర క్రియేషన్స్ నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల దర్శకత్వం: కె వి గుహన్ సంగీతం: సైమన్ కె. కింగ్ ఎడిటింగ్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 24, 2021(సోనిలీవ్) సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్లర్ మూవీ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 24న సోనిలీవ్‌లో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తెలుగులో వస్తున్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావడం, డి. సురేష్ బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు సపోర్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) అనే నలుగురు సాఫ్ట్వేర్ టెకీలు మంచి స్నేహితులు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోకి మిత్ర వస్తుంది. చిష్ట్రీ ద్వారా విశ్వకి మిత్ర పరిచయమవుతుంది. దీంతో వీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అదికాస్త ముదిరి ప్రేమగా మారుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అని ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలానే మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు?, విశ్వని ఎందుకు ఉరివేసుకుని చావమన్నాడు. ఆ వ్యక్తి నుండి విశ్వ మిత్ర, చిష్ట్రిలను కాపాడాడా లేదా అనేది మిగతా సినిమా కథ.. ఎవరెలా చేశారంటే...? ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువ. వాళ్లు కూడా నేరుగా కలుసుకోరు. అంతా వెబ్ కెమెరాల ద్వారానే కలుసుకుంటారు. ఇల్లీగల్ హ్యాకర్ హెడ్ విశ్వగా అదిత్ అరుణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చావుబతుకుల కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే ఓ సిన్సియర్ లవర్ పాత్రలో లీనమై నటించాడు. . ‘అద్భుతం’తర్వాత శివానీ రాజశేఖర్ నటించిన మరో చిత్రం ఇదే. ఈ చిత్రంలో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేదు కానీ.. ఉన్నంతలో బాగానే నటించింది. తెరపై చాలా క్యూట్‌గా కనిపించింది. ఇక ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను అసలు సిసలు థ్రిల్ ను పరిచయం చేశాడు. వైవా హర్ష… తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు. ఎలా ఉందంటే..? ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాటా సైబర్ ఎటాక్. మనకు తెలియకుండా.. మన డేటాని హ్యాకర్లు దొంగిలించి ఇతరులకు అమ్ముకుంటున్నారు. దాని వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఇదే కాన్సెప్ట్‌ని తీసుకొని ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కె.వి. గుహన్. సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్నటాలెంట్ ని దుర్వినియోగం చేసి… విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి.. సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని అందరికి తెలిసేలా ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం… రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విషయమే. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంతో కాస్త తడపడ్డాడు. విశ్వ, క్రిస్టీ, అష్రఫ్, సదాలు ఏం చేస్తారన్న దానితో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ తర్వాత విశ్వ-మిత్రల ప్రేమ కథతో సన్నివేశాలను సాగదీశాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది. ఓ దుండగుడు చిష్ట్రీ, మిత్రలు ఉంటున్న అపార్ట్మెంట్కి రావడం.. చిష్ట్రీని కత్తితో దాడి చేయడంతో సినిమాపై ఆసక్తి పెరుగుంది. ఆ ఆగంతకుడు ఎవరు? అతనికి విశ్వకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే దానికి దర్శకుడు చూపించిన రీజన్ మాత్ర చాలా పేలవంగా ఉంది. ఆగంతకుడి నేపథ్యాన్ని సాదాసీదాగా మాటల రూపంలో చెప్పించాడు అంతే. ఆగంతకుడి ప్లాష్ బ్యాక్‌ని ఇంకాస్త బలంగా చూపిస్తే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సైమన్ కె. కింగ్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు చాలా ప్లస్ అయింది. కొన్ని సన్నివేశాల్లో విజువల్స్ గూజ్బమ్స్ తెప్పించేలా ఉన్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదు. రామంత్ర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రయత్నం మాత్రం బాగుంది. -
ఆకట్టుకుంటోన్న `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` క్యారెక్టర్ పోస్టర్స్
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన లభించగా.. తాజాగా ఈ చిత్రంలోని నటీనటుల పాత్రలకు సంబందించి క్యారెక్టర్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్ `విశ్వ`గా నటిస్తుండగా, శివాని రాజశేఖర్ `మిత్ర` పాత్ర పోషిస్తుంది. వారి మిత్రులుగా `అష్రఫ్` పాత్రలో ప్రియదర్శి, `చిష్ట్రి` పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారు. వైవా హర్ష, సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా నటుడు రియాజ్ ఖాన్ `ఖాన్`పాత్రధారిగా కనిపించనున్నారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. -
‘ఆ భయంలో నుంచి పుట్టిన కథే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈ చిత్రం’
‘‘కేవీ గుహన్గారివంటి అద్భుతమైన టెక్నీషియన్‌తో నా కుమార్తె శివానీ వర్క్ చేస్తుందని తెలిసి హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో శివానీకి కరోనా సోకింది. ఆ తర్వాత నాకూ కరోనా పాజిటివ్ అని తేలింది. తన వల్ల నాకు కరోనా వచ్చిందని శివానీ ఏడ్చింది. తను హీరోయిన్గా నటించిన ‘అద్భుతం’ సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో..ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమాకు అంతే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ అన్నారు. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు.. ఎక్కడ.. ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవి ప్రసాద్‌రాజు దాట్ల నిర్మించిన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘గుహన్‌గారు ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో షూట్ చేశారని తెలిసి షాక్ అయ్యాను. సినిమా చూశాను. పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘పూర్తిగా వెబ్‌క్యామ్‌తో సినిమా తీశాం. కరోనా సమయంలో అసలు బతుకుతామో లేదో అనే భయంకలిగింది. ఈ భయంలో నుంచి పుట్టిన కథే ఈ చిత్రం. అదిత్ పెర్ఫార్మెన్స్ చూసి షాకయ్యాను. శివానీ అమాయకత్వం నచ్చింది. యాక్ట్రస్‌గా నిరూపించుకోవాలనే కసి ఆమెలో కనిపించింది’’ అన్నారు కెవీ గుహన్. ‘‘నిర్మాత సురేష్‌బాబుగారు ప్రోత్సహిస్తున్నారు. మరో నిర్మాత ‘దిల్’ రాజు మా సినిమాను చూసి మెచ్చుకున్నారు’’ అన్నారు రవి. ‘‘ఇది నా 17వ సినిమా. నా కెరీర్ కొంచెం తగ్గినప్పుడు రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ నాకు బూస్ట్ ఇచ్చింది.’’ అన్నారు అదిత్. ‘‘ఈ ప్రాజెక్ట్ నాకు అదిత్ వల్లే వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కేవీ గుహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు శివానీ. ఈ కార్య క్రమంలో సంగీత దర్శకుడు సైమన్ కింగ్, తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలోకి 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' చిత్రం
WWW Movie Release In Sony Liv OTT: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేకర్ జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు విశేష ఆదరణ దక్కింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు' సినిమా డిజిటల్ రైట్స్‌ని ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం 'సోని లివ్'లో స్ట్రీమ్ అవనుంది. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ 'మా మొదటి చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోని వంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సోని లివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్ మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.' అని అన్నారు. అయితే సినిమాను ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించలేదు. -
'ఆమని ఉంటే పక్కన... ఏమని చెప్పను భావనా'..
అదిత్ అరుణ్, మేఘా ఆకాశ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘ఆమని ఉంటే పక్కన..’ పాటను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా చిత్రానికి హరిగౌర చక్కని సంగీతం అందించారు. లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కృష్ణకాంత్ రాసిన ‘ఆమని ఉంటే పక్కన..’ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారు. అదిత్ అరుణ్, మేఘా ఆకాశ్‌లపై చిత్రీకరించిన ఈ ప్రేమ పాట అందరికీ నచ్చుతుంది. అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ. -
WWW Movie: కన్నులు చెదిరే అందం సాంగ్ రిలీజ్
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు? ఎక్కడ? ఎందుకు?). ‘118’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి పి రాజుదాట్ల నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ధరణ్ దాట్ల సహనిర్మాత. ఈ చిత్రంలోని 'కన్నులు చెదిరే అందాన్ని వెన్నెల తెరపై చూశానే..' లిరికల్ సాంగ్ వీడియోను హీరో అడివి శేష్ విడుదల చేశాడు. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, యాసిమ్ నిజార్ ఆలపించారు. సైమన్ కె సింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. థ్రిల్లర్ జానర్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఓ విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని కేవీ గుహన్ పేర్కొన్నాడు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. చదవండి: Shah Rukh Khan: ఓటీటీలోకి బాలీవుడ్ బాద్షా! -
'నైలూ నది'' పాటను రిలీజ్ చేసిన తమన్నా
సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం హీరోయిన్ తమన్నా ఈ సినిమాలోని 'నైలూ నది' అనే పాటను రిలీజ్ చేశారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలు పోషించారు. (డియర్ కామ్రేడ్ నా ఫస్ట్ సినిమా అయ్యుండేది) ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి..) Team #WWWMovie Thanks @tamannaahspeaks for launching Melodious #NailuNadi Telugu song 💕 ICYMI, ▶️https://t.co/6reYS6uMoi 🎵 @simonkking ✍️ @ramjowrites 🎤 @sidsriram@kvguhan @AdithOfficial @Rshivani_1 @RamantraCreate @DrRaviPRaju @VijayDharan_D @baraju_SuperHit @adityamusic pic.twitter.com/DactvRXdyT — BARaju (@baraju_SuperHit) January 29, 2021 -
‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో చిత్రంగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ.. వేర్.. వై’(ఎవరు.. ఎక్కడ.. ఎందుకు) అనే ట్యాగ్‌లైన్‌తో మరో థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఆదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్, వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను సంక్రాతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. (చదవండి: చెక్ మాస్టర్) 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా సైబర్ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నువ్వు నవ్వినప్పుడు డబుల్ అందంగా ఉంటావ్ తెలుసా.. నిన్ను వచ్చి కలిసేవరకు ఈ కాల్ కట్ చేయను అంటూ సరదగా సాగిన టీజర్ ఆ తర్వాత నా సిస్టమ్ పని చేయడం లేదు.. బ్రూట్ ఫోర్స్ ఎటాక్ అంటూ థ్రిల్లర్ పార్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక రామంత్ర క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
విజువల్స్ బాగున్నాయి– రానా
‘‘గుహన్‌గారు ఒక యూనిక్ సినిమాటోగ్రాఫర్. ఆయనతో కలిసి పనిచేశాను. ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ పోస్టర్ చూస్తుంటే హై కాన్సెప్ట్ ఫిలిం అనిపిస్తోంది. ఈ సినిమాలో విజువల్స్ సరికొత్తగా ఉంటాయి. గుహన్‌గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు రానా. ‘118’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని రానా విడుదల చేశారు. కేవీ గుహన్ మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్లో ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా చేశాను. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న మా చిత్రాన్ని త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మిస్టరీ థ్రిల్లర్‌గా గుహన్‌గారు ఈ సినిమాని బాగా తీశారు’’ అన్నారు డా. రవి పి.రాజు ధాట్ల. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు గుహన్‌గారు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘కేవీ గుహన్‌గారి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన రానాగారికి థ్యాంక్స్’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ నిర్మాత విజయ్‌ధరన్ ధాట్ల. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కేవీ గుహన్. -
వేసవిలో ఆనందౖభైరవి
అంజలి, లక్ష్మీరాయ్, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రధారులుగా కర్రి బాలాజీ దర్శకత్వంలో ఎమ్వీవీ సత్యనారాయణ సమర్పణలో బి. తిరుపతిరెడ్డి, రమేష్‌రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆనందభైరవి’. ఈ సినిమా చిత్రీకరణ యాభై శాతం పూర్తయింది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ–‘‘అంజలి, లక్ష్మీరాయ్, అదిత్‌ల కెమిస్ట్రీ చూస్తుంటే నా కళ్లముందు సక్సెస్ కనిపిస్తోంది. సమాజంలో ఉన్న ఎన్నో నిజజీవిత పాత్రలు మా సినిమాలో కనపడతాయి’’అన్నారు. ‘‘ఆనంది పాత్రను పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అంజలి. ‘‘నేను నటిస్తున్న భైరవి పాత్ర చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ముంబైలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు లక్ష్మీరాయ్. ‘‘రొమాంటిక్ అబ్బాయి పాత్రలో నటించా’’ అన్నారు అరుణ్. ‘‘నెక్ట్స్ షెడ్యూల్స్ హైదరాబాద్, చెన్నైలో జరగనున్నాయి. వేసవిలో సినిమాను విడుదల చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. సాయికుమార్, రాశి, మురళీ శర్మ, ఎమ్వీవీ సత్యనారాయణ, బ్రహ్మాజీ, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ. -
కెమిస్ట్రీ కుదిరింది
అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆనంద భైరవి’. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. హరివేన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఇటికేల రమేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు. ఆ పాత్ర కోసం చాలా స్లిమ్ అయ్యారు. ఒక మధ్యతరగతి అమ్మాయి పాత్రలో తన హావభావాల్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆశ్చర్యపోయా. ఆ పాత్ర కోసం స్కూటీ రైడ్ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు స్కూటీ మీదనుంచి పడటంతో ఆమెకు గాయాలయ్యాయి. అయినా షూటింగ్లో పాల్గొన్నారు. సెకండ్ షెడ్యూల్లో లక్ష్మీరాయ్‌పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘అందమైన విశాఖపట్నంలో అంజలి, ఆదిత్ అరుణ్‌లపై కర్రి బాలాజీ చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. పృథ్వీ, బ్రహ్మాజీ, గుండు సుదర్శన్, జయవాణిలపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు బాగా వచ్చాయి. తర్వాతి షెడ్యూల్‌ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అని ఇటికేల రమేష్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ దత్తి, కెమెరా: పీజీ విందా, సంగీతం: మణిశర్మ. -
‘24 కిస్సెస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
కెమిస్ట్రీ కుదిరింది
‘మిణుగురులు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్’. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్టంశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘బోల్డ్ కంటెంట్‌కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అయోధ్యకుమార్. అదిత్, హెబ్బా మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. ఇప్పటికే విడుదలైన మా సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మా చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద రెడ్డి, కెమెరా: ఉదయ్ గుర్రాల, సంగీతం: జోయ్ బరువా, నేపథ్య సంగీతం: వివేక్ ఫిలిప్. -
నా స్థాయిని మరచి కిందకి దిగను
‘మిణుగురులు’ వంటి చిత్రం తర్వాత అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్’. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా రెస్పెక్ట్ క్రియేషన్స్, సిల్లీ మాంక్స్ కంబైన్స్ పతాకంపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ చేశారు. డైరెక్టర్ అయోధ్యకుమార్ మాట్లాడుతూ– ‘‘24 కిస్సెస్’ సినిమాని గతంలో వేరే నిర్మాతలతో స్టార్ట్ చేశా. అయితే.. నా క్రియేటివిటీ విషయంలో వారి వద్ద నాకు అంత ఫ్రీడమ్ దొరకలేదు. అందుకే సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాలగార్లతో ఈ చిత్రం తీశా. వీరు ఎక్కడా కల్పించుకోకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ‘మిణుగురులు’ వంటి సినిమా తీసిన అయోధ్యకుమార్ ‘24 కిస్సెస్’ లాంటి సినిమా తీయడమేంటి? అంటున్నారు. నేనెప్పుడూ నా స్థాయిని మరచి కిందకి దిగను. అలా అనుకుని ఉంటే ‘మిణుగురులు’ తర్వాత చాలా సినిమాలు చేసేవాణ్ణి. ఇదొక అందమైన ప్రేమకథ. చక్కని భావోద్వేగాలు ఉంటాయి’’ అన్నారు. ‘‘తుంగభద్ర’ పాటల వేడుకలో నువ్వు లవ్‌స్టోరీస్ చేయొచ్చుకదా? అని నానిగారు అన్నారు. రెగ్యులర్ ప్రేమకథలకి భిన్నంగా ఓ చిత్రం చేయాలనుకున్నా. అది ‘24 కిస్సెస్’తో తీరింది’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘సింపుల్ ప్రేమకథా చిత్రమిది. మంచి చిత్రంలో అవకాశమిచ్చిన అయోధ్యకుమార్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు హెబ్బా పటేల్. ‘‘అయోధ్యగారు రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. కథ నచ్చడంతో ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’’ అన్నారు సంజయ్‌రెడ్డి. మరో నిర్మాత అనిల్ పల్లాల, నటీనటులు అదితీ మ్యాకల్, అన్షు, మధు, కీర్తన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్ గురల్లా, లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
నవంబర్ 3న గరుడ వేగ
సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలైన గరుడవేగ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లవ్.. కామెడీ...
అరుణ్ ఆదిత్, పూజా ఝవేరీ జంటగా రాహుల్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘ఎల్ 7’. ’తుంగభద్ర’ సినిమా తర్వాత అరుణ్ ఆదిత్ చేస్తున్న చిత్రమిదే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. త్వరలో ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో సినిమా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు అరవింద్ శంకర్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. తొలి సినిమాతోనే మా దర్శకుడు ముకుంద్ పాండేకు మంచి పేరొస్తుంది. అన్ని వర్గాల వారు చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
'తుంగభద్ర' ఆడియో ఆవిష్కరణ