వేసవిలో ఆనందౖభైరవి | Ananda Bhairavi Movie Shooting Updates | Sakshi
Sakshi News home page

వేసవిలో ఆనందౖభైరవి

Feb 3 2020 1:05 AM | Updated on Feb 3 2020 1:05 AM

Ananda Bhairavi Movie Shooting Updates - Sakshi

అంజలి

అంజలి, లక్ష్మీరాయ్, అదిత్‌ అరుణ్‌ ప్రధాన పాత్రధారులుగా కర్రి బాలాజీ దర్శకత్వంలో ఎమ్‌వీవీ సత్యనారాయణ సమర్పణలో బి. తిరుపతిరెడ్డి, రమేష్‌రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆనందభైరవి’. ఈ సినిమా చిత్రీకరణ యాభై శాతం పూర్తయింది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ–‘‘అంజలి, లక్ష్మీరాయ్, అదిత్‌ల కెమిస్ట్రీ చూస్తుంటే నా కళ్లముందు సక్సెస్‌ కనిపిస్తోంది. సమాజంలో ఉన్న ఎన్నో నిజజీవిత పాత్రలు మా సినిమాలో కనపడతాయి’’అన్నారు. ‘‘ఆనంది పాత్రను పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అంజలి.

‘‘నేను నటిస్తున్న భైరవి పాత్ర చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం ముంబైలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు లక్ష్మీరాయ్‌. ‘‘రొమాంటిక్‌ అబ్బాయి పాత్రలో నటించా’’ అన్నారు అరుణ్‌. ‘‘నెక్ట్స్‌ షెడ్యూల్స్‌ హైదరాబాద్, చెన్నైలో జరగనున్నాయి. వేసవిలో సినిమాను విడుదల చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. సాయికుమార్, రాశి, మురళీ శర్మ, ఎమ్‌వీవీ సత్యనారాయణ, బ్రహ్మాజీ, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు  సంగీతం: మణిశర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement