WWW Movie: కన్నులు చెదిరే అందం సాంగ్‌ రిలీజ్‌ | WWW Movie: Kannulu Chedire Song Released | Sakshi
Sakshi News home page

WWW Movie: కన్నులు చెదిరే అందం సాంగ్‌ రిలీజ్‌

Published Sun, May 30 2021 10:54 AM | Last Updated on Sun, May 30 2021 10:54 AM

WWW Movie: Kannulu Chedire Song Released - Sakshi

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు? ఎక్కడ? ఎందుకు?). ‘118’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి పి రాజుదాట్ల నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌ ధరణ్‌ దాట్ల సహనిర్మాత.

ఈ చిత్రంలోని 'కన్నులు చెదిరే అందాన్ని వెన్నెల తెరపై చూశానే..' లిరికల్‌ సాంగ్‌ వీడియోను హీరో అడివి శేష్‌ విడుదల చేశాడు. ఈ పాటను అనంత శ్రీరామ్‌ రాయగా, యాసిమ్‌ నిజార్‌ ఆలపించారు. సైమన్‌ కె సింగ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. థ్రిల్లర్‌ జానర్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఓ విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని కేవీ గుహన్‌ పేర్కొన్నాడు.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు.

చదవండి: Shah Rukh Khan: ఓటీటీలోకి బాలీవుడ్‌ బాద్‌షా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement