లవ్.. కామెడీ...
అరుణ్ ఆదిత్, పూజా ఝవేరీ జంటగా రాహుల్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘ఎల్ 7’. ’తుంగభద్ర’ సినిమా తర్వాత అరుణ్ ఆదిత్ చేస్తున్న చిత్రమిదే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. త్వరలో ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో సినిమా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు అరవింద్ శంకర్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. తొలి సినిమాతోనే మా దర్శకుడు ముకుంద్ పాండేకు మంచి పేరొస్తుంది. అన్ని వర్గాల వారు చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు.