Pooja jhaveri
-
గుడిలో పులిహోరలా అమ్మాయి ఫ్రెష్‌గా ఉంది
అల్లరి నరేశ్ హీరోగా, పూజా జవేరీ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం "బంగారు బుల్లోడు". తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు నరేశ్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎండకు అమ్మాయి కాళ్లు కాలుతున్నాయని నరేష్ అక్కడే ఉన్న బిందెను తన్నడం, తీరా అది వేడి నీళ్ల గిన్నె అని తెలియడంతో నాలుక్కరుచుకోవడం వంటి సీన్లు బాగున్నాయి. గుడిలో పులిహోరలాగా అమ్మాయి ఫ్రెష్‌గా ఉందని వెన్నెల కిషోర్ పెళ్లి సంబంధం కోసం తాపత్రయ పడటం యువతకు నవ్వు తెప్పిస్తోంది. ఎంటర్టైన్మెంట్ పక్కా అన్న నమ్మకాన్ని ఇస్తున్న ఈ ట్రైలర్‌పై నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత) ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు తగ్గిపోయాయి. కానీ నరేష్ చిత్రం వస్తుందంటే కుటుంబం అంతా కలిసి చూడొచ్చు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గిరి పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమాలోని స్వాతిలో ముత్యమంత పాటను రీమిక్స్ చేయడం విశేషం. బంగారు బుల్లోడు జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. కాగా నరేష్ ప్రస్తుతం నాందిలో నటిస్తున్నారు. పాత్ర డిమాండ్ మేరకు ఆయన కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించారు. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతుండగా సతీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: అందుకే సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను ) -
సరికొత్త డీటీయస్
‘నాటకం’ మూవీ ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘డీటీయస్’. పూజా జవేరి కథానాయిక. అభిరామ్ పిల్లాను దర్శకునిగా పరిచయం చేస్తూ గంగారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘నాటకం’ తర్వాత కొత్త కథల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అభిరామ్ చెప్పిన కథ నచ్చింది. గంగారెడ్డిగారికి కాన్సెప్ట్ నచ్చడంతో సినిమా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ తెలుగు తెరమీద చూడని సరికొత్త కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘యంగ్ టీమ్ చేస్తోన్న చిత్రమిది. ఇలాంటి కథకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి కార్తీక్. -
47 రోజుల సస్పెన్స్
పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన చిత్రం ‘47 డేస్’. ‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక. సత్యదేవ్ హీరోగా, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోయిన్లుగా నటించారు. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూస్తుంటే బాలచందర్‌గారి ‘47 డేస్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి ‘నాకు మొగుడు కావాలి’ సినిమా వాయిదా వేసి మరీ చేశాడు. ఏది ఏమైనా ఈ సినిమా కూడా మా ‘నాకు మొగుడు కావాలి’ అంత హిట్ అవ్వాలి’’ అన్నారు. ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉన్న నేను సినిమా రంగంలోకి వస్తానన్నప్పుడు నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. ఈ సినిమా ట్రైలర్ రఫ్ కట్ చూసిన రామ్‌గోపాల్ వర్మగారు.. ‘మీరు విజువల్స్‌తో స్టోరీ చెప్పారు’ అనడం పెద్ద ప్రశంసలా అనిపించింది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ప్రయత్నంగా ఈ సినిమా మొదలు పెట్టాం. చాలా ఓర్పుతో ఈ చిత్రాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు రఘు కుంచె. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్ ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు శశి భూషణ్, శ్రీధర్, విజయ్. ‘‘ఈ సినిమా హిట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు సత్యదేవ్. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, దర్శకుడు బీవీయస్ రవి, దర్శకుడు వెంకటేష్ మహా, సతీష్ కాశెట్టి, కత్తి మహేష్, లక్ష్మీ భూపాల్, భాస్కరభట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనిల్ కుమార్ సొహాని, సంగీతం: రఘు కుంచే, కెమెరా: జీకే. -
‘హీరో హీరోయిన్’ టీజర్ ఆవిష్కరణ!
-
పైరసీ చేసేది నేనే!
‘మీ హీరోల సినిమాలన్నీ పైరసీ చేసేది నేనే..’ అంటూ హీరో నవీన్ చంద్ర డైలాగ్‌తో ‘హీరో హీరోయిన్’ టీజర్ విడుదలైంది. ‘ప్రొడ్యూసర్ కూతురైతే ఏంటే.. నిన్నూ వదలను, పైరసీని వదలను..’ అనే మరో డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. టీజర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పైరసీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. నవీన్ చంద్ర హీరోగా, గాయత్రి సురేశ్, పూజా ఝవేరి హీరోయిన్లుగా ‘అడ్డా’ ఫేమ్ జి.యస్. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హీరో హీరోయిన్’. ‘ఎ పైరేటెడ్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సీనియర్ ఫొటోగ్రాఫర్ జనార్థన్, వీడియోగ్రాఫర్ పొన్నం శ్రీనివాస్ విడుదల చేశారు. కార్తీక్ మాట్లాడుతూ– ‘‘పైరసీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇండస్ట్రీలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపించే కుర్రాడిగా నవీన్ చంద్ర నటించారు. హీరోలకు, నిర్మాతలకు త్వరలోనే ఓ ప్రత్యేక షో వేస్తాం. దీనికి తమిళ పరిశ్రమ నుంచి విశాల్ కూడా వస్తున్నారు. ఇండస్ట్రీలోని హీరోల బైట్లతో రోలింగ్ వేయబోతున్నాం’’ అన్నారు. ‘‘తమ సినిమాలు పైరసీ అవుతాయని తెలిసినా లెక్క చేయకుండా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు హ్యాట్సాఫ్’’ అని నవీన్ చంద్ర అన్నారు. ‘‘మంచి మెసేజ్‌తో రూపొందుతోన్న ‘హీరో హీరోయిన్’ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు బి.ఎ.రాజు, సురేష్ కొండేటి అన్నారు. ‘‘రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మార్చిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని భార్గవ్ మన్నె అన్నారు. గాయత్రి సురేశ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ గంగాధరీ. -
ప్రభాస్ సరేనంటే.. పెళ్లికి రెడీ: హీరోయిన్
టాలీవుడ్‌లోని పెళ్లి కానీ హీరోల్లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఒకరు. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ పెళ్లి గురించి తొందరలేందటున్నారు ప్రభాస్‌ను ఆయన ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని ఓ హీరోయిన్ స్టేట్మెంట్ ఇచ్చింది. 'ద్వారక' సినిమాతో వెండితెరకు పరిచయమైన పూజ జవేరీకి ప్రభాస్ అంటే చాలా ఇష్టమట. ప్రభాస్ సరేనంటే ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పింది ఈ అమ్మడు. కాగా, బాహుబలి తర్వాత ప్రభాస్‌కు పెళ్లి పీటలెక్కే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ కోడై కూసింది. మరి పూజ ఇచ్చిన ఆఫర్‌కు ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ సినిమాతో బిజీగా ఉన్నారు. -
ద్వారక టీమ్‌తో మరో సినిమా చేస్తాం
‘‘ద్వారక’ చిత్రం హిట్ అయినందుకు హ్యాపీ. ఇరవైఏళ్ల మా కల ఈ సినిమాతో తీరింది. ‘ద్వారక’కు మంచి టీమ్ కుదిరింది. ఇదే టీమ్‌తో మరో సినిమా చేస్తాం. ఈ నెల 8, 9, 10న విజయ యాత్రకు వెళ్లబోతున్నాం’’ అని నిర్మాతలు ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోలు చెప్పారు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్.బి.చౌదరి సమర్పణలో శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద్వారక’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘తొలిరోజు నుంచే మా సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణ చూసి చాలా ఆనందంగా అనిపిస్తోంది. అన్ని వర్గాల వారు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా విడుదలైనప్పటి నుంచి చాలా మంది ఫోన్లు చేసి, అభినందించారు’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ‘‘నా గత చిత్రాల కంటే ఈ చిత్రంలో చాలా అందంగా ఉన్నానని పలువురు చెబుతుంటే హ్యాపీగా ఉంది’’ అని పూజా ఝవేరి చెప్పారు. నటుడు పృధ్వీ, రచయిత లక్ష్మీభూపాల్, సంగీత దర్శకుడు సాయికార్తీక్ తదితరులు పాల్గొన్నారు -
అందుకే ఇంత మంచి రిజల్ట్!
‘‘ప్రారంభం నుంచి ప్రేక్షకులను నవ్వించి, నవ్వించి... ముగింపులో మంచి సందేశం ఇచ్చిన చిత్రమిది. ప్రేక్షకులందరూ చక్కటి సందేశంతో కూడిన హాస్యభరిత చిత్రం తీశారంటుంటే ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రద్యుమ్న, గణేశ్. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు నిర్మించిన చిత్రం ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని ఏరియాల నుంచి చక్కటి స్పందన లభిస్తోందని నిర్మాతలు అంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చెప్పిన విశేషాలు..... ► ‘ద్వారక’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టై నర్. హీరో విజయ్ దేవరకొండతో పాటు సినిమా ఆసాంతం ‘30 ఇయర్స్’ పృథ్వీ చేసే కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తోంది. కామెడీ సీన్స్ ఎంత నవ్వించాయో... పతాక సన్నివేశాల్లో సందేశం అంతే ఆలోచింపజేస్తోందని ప్రేక్షకులు చెబుతున్నారు. మంచి చేయడం కోసం ఒక్కోసారి చెడ్డవాళ్లను మోసం చేయడం తప్పు కాదని చెప్పే చిత్రమిది. ► ముందు హీరోని అనుకుని తయారు చేసిన కథ కాదిది. కథపై ఏడాది పాటు వర్క్ చేశాం. పక్కాగా సిద్ధమైన తర్వాత సినిమా మొదలుపెట్టాం. అందుకే, ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. కథ రెడీ అయ్యాకే హీరో విజయ్ దేవరకొండను ఎంపిక చేశాం. మా నమ్మకాన్ని నిలబెడుతూ అతను అద్భుతంగా నటించాడు. విజయ్‌లో భిన్న కోణా లను ఆవిష్కరించిన చిత్రమిది. దొంగగా, దొంగ బాబాగా, ప్రేమికుడిగా, సమాజ శ్రేయస్సు కోరు కునే మంచి వ్యక్తిగా అద్భుత నటన కనబరిచాడు. ► విజయ్ దేవరకొండ, పృథ్వీల మధ్య మంచి కామెడీ టైమింగ్ కుదిరింది. వీళ్లిద్దరితో పాటు మురళీ శర్మ పాత్ర, ఆయన పలికిన డైలాగులు.. ప్రకాశ్‌రాజ్ పాత్ర బాగుందంటున్నారు. విజయ్, పూజా ఝవేరిల మధ్య ప్రేమ సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. సాయికార్తీక్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరొచ్చింది. ► సందేశం ఇస్తూ, వినోదం అందిస్తే ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారనే నమ్మకాన్ని మా సినిమా మరోసారి నిరూ పించింది. ప్రేక్షకులెవరూ ఇది చిన్న సినిమా అనడం లేదు. ఓ మంచి సినిమా అని చెబుతున్నారు. నిన్న మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత షోకి మరిన్ని వసూళ్లు పెరిగాయి. సెకండ్ షోకి థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టారు. శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ‘పెళ్లి చూపులు’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా అతడి కెరీర్లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. అంతేlస్థాయిలో వసూళ్లు రాబడుతుంది. ► ఓ సామాజిక బాధ్యత, సందేశంతో కూడిన వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలు తీయాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాం. భవిష్యతులోనూ ఇలాంటి మంచి చిత్రాలే తీస్తాం. ఈ ఏడాది మరో రెండు చిత్రాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. -
ఐదు వందలు కొట్టేశాడు!
విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు నిర్మించిన సినిమా ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి సమర్పకులు. మార్చి 3న అంటే.. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి హీరో విజయ్ దేవరకొండ చెప్పిన సంగతులు.... ♦ స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకులు ఫోనులు చేసి ‘ద్వారక’ గురించి అడుగుతుంటే.. ‘అరే, మళ్లీ మన సినిమా విడుదలకు వచ్చేసింది’ అనే ఎగ్జయిట్మెంట్ వస్తుంది. ‘పెళ్లి చూపులు’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకూ, వాళ్లు పెట్టిన టైమ్, మనీకి తగ్గ వినోదం దొరుకుతుంది. ♦ ఈ సినిమాలో ఎర్రశీను అనే పాత్రలో నటించాను. మనుగడ కోసం దొంగతనాలు చేసే స్థాయికి దిగజారతాడు. పరిస్థితుల ప్రభావం వల్ల బాబాగా మారతాడు. ♦ టీవీల్లో దొంగ బాబాల మాయలు – మంత్రాలు అనే వార్తలు చూసేవాణ్ణి. ఓసారి డిగ్రీలో ఉన్నప్పుడు నేనూ, నా స్నేహితుడు రోడ్ పక్కన బైక్ మీద మాట్లాడుకుంటుంటే... సడన్‌గా ఓ ఫకీరు వచ్చి రెండు మూడు మ్యాజిక్స్ చేసి మా దగ్గర 500లు కొట్టేశాడు. ‘ద్వారక’ చిత్రీకరణకు ముందు కొన్ని యూ ట్యూబ్ వీడియాలు చూశా. మా దొంగ బాబా కంటే వాళ్లు చేసిన వి చాలా ఓవర్‌గా ఉన్నాయి. మా స్క్రిప్ట్‌కి అంత ఓవర్ సెట్ కావడం లేదని దర్శకుడు చెప్పింది ఫాలో అయ్యా ♦ దర్శకుడు శ్రీనివాస్ రవీంద్రగారు 17 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందు నేను కేబీఆర్ పార్కులో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్స్ చేసేవాణ్ణి. నన్ను అక్కడ చూశారు. అప్పుడే ఈ కథ చెప్పారు. ‘ఎవడే..’ విడులైన తర్వాత మా నిర్మాతలు సిన్మా తీయడానికి ముందుకొచ్చారు. విజయ్ హీరోగా బాగుంటాడని కన్విన్స్ చేశారు. ‘ద్వారక’ కథ చెప్పే ముందు దర్శకుడు ఓ ఫిలాసఫీ చెప్పారు. ‘‘సినిమా ఎలా వస్తుందనేది మనకు తెలీదు. కానీ, మన కంటెంట్ ఏంటో మనకు తెలుసు. ‘రిలీజ్ తర్వాత ఏం రాశార్రా! ఏం చేశార్రా’ అని ప్రేక్షకులు అనుకోవాలి. జీవితంలో మనకంటూ ఓ పేరు రావాలి’’ అనేవారు. ఆయనలో నాకది నచ్చింది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వంద శాతం నిలెబెట్టుకున్నాననే అనుకుంటున్నా. ♦ డీఓపీ శ్యామ్ కె. నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, పృథ్వీ, ‘షకలక’ శంకర్.. భారీ స్టార్ కాస్ట్, మంచి టెక్నీషియన్లతో సినిమా చేశాం. ‘పెళ్లి చూపుల’కు ముందే మా నిర్మాతలు కథపై నమ్మకంతో భారీగా ఖర్చుపెట్టారు. పబ్లిసిటీ భారీగా చేస్తున్నారు. వాళ్ల నమ్మకానికి హ్యాపీ. ♦ మన పల్లెటూళ్లు, సిటీల్లో ప్రజలందరూ మంచి బాబాలు, దొంగ బాబాల గురించి వింటుంటారు. మా సినిమాలో అదే చెప్పాం. సరదా సరదాగా సాగే కథ చివర్లో ఓ మంచి విషయం కూడా చెప్పాం. ప్రతి ఒక్కరికీ కథ, సినిమా కనెక్ట్ అవుతాయి. సినిమా మంచి హిట్టవుతుందనే నమ్మకముంది. -
క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నా!
‘‘నేను డైరెక్టర్ కావాలనుకుని, అది కుదరక యాక్టర్ అయినవాణ్ణి కాదు. ఒక టైమ్ పెట్టుకుని హీరోగా ట్రై చేశా. 25 ఏళ్లలోపు హీరోగా నాకంటూ ఒక బ్రేక్ రాకపోతే రైటర్‌గా, డైరెక్టర్‌గా ట్రై చేద్దామనుకుని, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పుడే ‘ఎవడే సుబ్రమణ్యం’ అవకాశం వచ్చింది’’ అని విజయ్ దేవరకొండ చెప్పారు. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్బీ చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు నిర్మించిన ‘ద్వారక’ మార్చి 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు ♦ ‘ద్వారక’ అనే అపార్ట్మెంట్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆ అపార్ట్మెంట్లో రకరకాల మనుషులుంటారు. ద్వారకలో ఉన్న అంతమందిని ఈ కృష్ణుడు ఎలా హ్యాండిల్ చేశాడు? అన్నదే కథాంశం. ఈ కథ ‘పెళ్లి చూపులు’ తర్వాత వచ్చినా చేసేవాణ్ణి. అంత బాగా నచ్చింది. ♦ ఈ చిత్రంలో ఎర్ర శ్రీను అనే దొంగ పాత్ర నాది. ‘ద్వారక’ అపార్ట్మెంట్లోకి చేరిన నేను అక్కడి వారికి దేవుణ్ణి ఎలా అయ్యాను? అక్కడి పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాను? అన్నది ఆసక్తిగా ఉంటుంది. స్కీన్ర్‌ప్లే చాలా బాగుంటుంది. ♦ ‘ఎవడే సుబ్రమణ్యం’లో ఎనర్జిటిక్‌గా, ‘పెళ్లి చూపులు’లో బద్ధకస్తుడిలా కనిపించా. ‘ద్వారక’లో వాటికి పూర్తి భిన్నంగా కనిపిస్తా. సొసైటీలో బాబాలు ఎలా ఉన్నారన్నది నా పాత్ర చూస్తే తెలుస్తుంది. ♦ ‘పెళ్లి చూపులు’ టైమ్‌కి పాటలు మినహా ‘ద్వారక’ చాలావరకు పూర్తయింది. ఆ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. ‘ద్వారక’ నవంబర్ చివర్లో రావాల్సింది. కానీ, నోట్ల రద్దుతో ఆలస్యమైంది. ‘పెళ్లి చూపులు’ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెమ్యునరేషన్ కాస్త పెంచా. ♦ ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా, పరశురామ్గారితో మరో సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నందిని రెడ్డి ప్రాజెక్ట్ ఉంది. -
విజయ్ మా బంగారు కొండ
‘‘పెళ్లి చూపులు’ చిత్రానికి ముందే విజయ్ దేవరకొండతో ‘ద్వారక’ కథతో సినిమా తీయాలనుకున్నాం. కాకపోతే.. ‘పెళ్లిచూపులు’ ముందు మొదలైంది. దాంతో ఫస్ట్ ఆ చిత్రం విడుదలై, హిట్ అయింది. మా చిత్రం ఆలస్యమైనా ఆ విజయం మాకు కలిసి వచ్చింది. అందుకే విజయ్ మాకు బంగారు కొండ’’ అన్నారు నిర్మాతలు ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా రచయిత శ్రీనివాస్ రవీంద్రను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆర్బీ చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మించిన ‘ద్వారక’ మార్చి 3న విడుదలవుతోంది. నిర్మాతలు చెప్పిన విశేషాలు.. ► ఇప్పుడొస్తున్న రొటీన్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ‘ద్వారక’ ఉంటుంది. ప్రేమ, వినోదంతో పాటు సమాజానికి ఓ సందేశం ఉంటుంది. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ తరహాలో ఎంటర్టైనింగ్గా సాగే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు మా చిత్రంలో ఉంటాయి. ► ‘ద్వారక’ చిత్ర కథకు ముందు మేం పలు కథలు విన్నా, ఏవీ నచ్చలేదు. సీనియర్ రచయితశ్రీనివాస్గారు మంచి కథ తయారు చేశారు. తను కథ చెప్పగానే ‘ఈ సినిమా మనం చేస్తున్నాం’ అని ఫిక్స్ అయ్యాం. ► విజయ్‌లో మాకు నచ్చేది కథలు ఎంచుకునే విధానం. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నాడు. తనకు ‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఎంత క్రేజ్ వచ్చిందో, ‘ద్వారక’తో అంతకు మించి రెట్టింపు క్రేజ్ వస్తుందనే నమ్మకం మాకుంది. ► ఈ చిత్రంలో విజయ్ అందరూ అనుకుంటున్నట్లు బాబా కాదు. తను ఓ దొంగ. డబ్బు సంపాదించడం కోసం బాబాలా మారతాడు. డబ్బులు చేతికొచ్చాక తనని మంచి వైపు కొందరు లాగుతుంటే, మరికొందరు చెడువైపు లాగుతారు. ఫైనల్‌గా తను ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు? ఏం చేశాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ► ఈ చిత్రకథ నచ్చడంతో సీనియర్ నిర్మాత ఆర్.బి. చౌదరిగారు మాతో అసోసియేట్ అయ్యారు. ఆయన అనుభవం మాకు ఉపయోగపడింది. ► ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీతో పాటు ఇతర నటులు కథకు అనుగుణంగా కుదిరారు. ∙పూజా ఝవేరి కథానాయిక పాత్రకి కరెక్ట్‌గా సరిపోయింది. మన కుటుంబంలో ఓ అమ్మాయిలా ఉంటుంది. చాలా డెడికేటెడ్. ‘ద్వారక’లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర తనది. ► సినిమా అంటే మాకు ప్యాషన్. సమాజంపై బాధ్యతతో ఒక మంచి చిత్రం తీశామనే ఆత్మ సంతృప్తి ‘ద్వారక’తో మాకు కలిగింది. ► మా చిత్రానికి కథ, మాటలు, పాటలు, కెమెరా హైలెట్. సాయికార్తీక్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సాహిత్యం కూడా బాగా కుదిరింది. పాటలకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శ్యాం కె.నాయుడు కెమెరా పనితనం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, బ్రహ్మ కడలి ఆర్ట్ సినిమాకే హైలెట్. ► ‘పెళ్లి చూపులు’తో విజయ్‌కి బాగా క్రేజ్ రావడంతో ఈ చిత్రం బిజినెస్ కూడా బాగా జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ఏరియాల నుంచి సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు మా చిత్రం కొనడం ఆనందంగా ఉంది. ఓ రకంగా అది మా అదృష్టం. వారి ద్వారా మంచి థియేటర్లు దక్కాయి. ఓవర్సీస్లో స్నేహితుల సపోర్ట్‌తో సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. అక్కడ ప్రమోషన్ పూర్తి చేశాం. ఓ మంచి సినిమా చూశామనే ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకొస్తారు. -
‘ద్వారకా’ మూవీ స్టిల్స్
-
ఇదే కరెక్ట్ అనిపించింది!
‘‘నేను పీజీ వరకు వైజాగ్‌లో చదువుకున్నాను. చిన్నప్పటి నుండి సాహిత్యాభిమానిని. పీజీ కాగానే రెండేళ్లు వ్యాపారం చేసాను. అందులో కిక్ దొరకలేదు. ఒక స్నేహితుని ద్వారా అనుకోకుండా చిత్ర పరిశ్రమకు వచ్చాను. ఇదే కరెక్ట్ అనిపించింది’’ అని శ్రీనివాస్ రవీంద్ర అన్నారు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్బీ చౌదరి సమర్పణలో రూపొందిన ‘ద్వారక’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు శ్రీనివాస్ రవీంద్ర. ప్రద్యుమ్న చంద్రపాటి–గణేశ్ పెనుబోతు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 3న విడుదల కానుంది. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘తమ్మారెడ్డి భరద్వాజ, దశరద్, శ్రీను వైట్ల తదితరుల దగ్గర అసిస్టెంట్‌గా చేశా, పవన్‌కళ్యాణ్‌గారి దగ్గర ఏడాది పాటు రైటర్‌గా చేశా. దర్శకుడు శ్రీవాస్‌గారికి నాలుగు సంవత్సారాల కిందట ‘ద్వారక’ కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చటంతో మా ఇద్దరికీ పరిచయమైన ప్రద్యుమ్నగారికి చెప్పించారు. కథ విన్న వెంటనే, ఈ సినిమా మనం చేస్తున్నామని, షేక్‌హ్యాండిచ్చి అడ్వాన్సు ఇచ్చారు. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. కథ విషయానికి వస్తే, దేవుడు అంటే ఏంటి? అని హీరో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు దొంగ, రొమాంటిక్‌గా కూడా ఉంటాడు. కానీ, నేను సర్వాంతర్యామి అంటాడు. ఈ సినిమాలో మా హీరో ఎర్రశ్రీనుగా దొంగ పాత్రలో కనపడతాడు. హీరోయిన్ పాత్ర పేరు వసుధ. వసుధతో ప్రేమలో పడ్డ తర్వాత హీరో ఏవిధంగా పరిణతి చెందాడో చెప్పే కథే ఈ సినిమా. ఇది వ్యంగ్య హాస్య చిత్రం. అందరూ చూసే విధంగా ఉంటుంది ’’ అన్నారు. -
దొంగ స్వామీజీ ప్రేమ!
విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న చంద్రపాటి, గణేశ్ పెనుబోతు నిర్మించిన సినిమా ‘ద్వారకా’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. మార్చి 3న విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో దొంగ స్వామీజీగా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు. వైవిధ్యమైన కథ, కథనాలకి తోడు పూజా ఝవేరి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. -
దొంగతో ప్రేమలో పడ్తా!
కృష్ణానంద స్వామిగా మారిన ఓ దొంగ ఏం చేశాడు? దొంగను బాబాగా మార్చింది ఎవరు? ఏం జరిగింది? అనే కథతో రూపొందిన చిత్రం ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. విజయ్ దేవరకొండ, పూజా ఝవేరీ జంటగా నటించారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. పూజా ఝవేరీ మాట్లాడుతూ - ‘‘దొంగ బాబాగా విజయ్ దేవర కొండ, ప్రేమంటే ఆసక్తి లేని అమ్మాయి పాత్రలో నేను నటించాం. దొంగతో ఈ అమ్మాయెలా ప్రేమలో పడింది? వీళ్లిద్దరి ప్రేమకథ ఏ మలుపులు తిరుగుతుందనేది ఆసక్తి కరం. ఓ యాడ్‌లో చూసిన దర్శకుడు నన్ను హీరో యిన్‌గా సెలెక్ట్ చేశారు. హిస్టారి కల్, మైథలాజికల్ సిన్మా లంటే ఇష్టం. అన్ని రకాల పాత్రలు చేయాల నుంది. తమిళంలో ధనుష్ ‘రైల్’తో పాటు అథర్వ మురళి సినిమా మరొకటి చేశాను. తెలుగులో ఇది నాలుగో చిత్రం’’ అన్నారు. -
కృష్ణ.. గోపాలకృష్ణ
విజయ్ దేవరకొండ, పూజా ఝవేరి జంటగా ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రద్యుమ్న, గణేశ్ నిర్మిస్తున్న సినిమా ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. ‘కృష్ణ.. కృష్ణ.. గోపాలకృష్ణ’ నేపథ్య గీతంతో సాగే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ‘ఖైదీ నంబర్ 150’ సెట్స్‌లో హీరో చిరంజీవి, దర్శకుడు వినాయక్ విడుదల చేశారు. ‘‘నా అభిమాన హీరో మోషన్ పోస్టర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఆర్.బి.చౌదరి, దర్శక-నిర్మాతలు పాల్గొన్నారు. -
ఎల్ అంటే లవ్...7 అంటే...?
ఆదిత్, పూజా ఝవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ‘ఎల్ 7’ ఈ నెల 21న విడుదల కానుంది. ‘‘ఎల్’ అంటే లవ్.. ప్రేమకు, 7 సంఖ్యకు సంబంధం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు ఈ సినిమాను చక్కగా తీశారు. పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిం చింది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్, సహ నిర్మాతలు: బి.మోహన్‌రావు, సతీశ్ కొట్టె, పున్నయ్య చౌదరి. -
లవ్.. కామెడీ...
అరుణ్ ఆదిత్, పూజా ఝవేరీ జంటగా రాహుల్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘ఎల్ 7’. ’తుంగభద్ర’ సినిమా తర్వాత అరుణ్ ఆదిత్ చేస్తున్న చిత్రమిదే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. త్వరలో ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో సినిమా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు అరవింద్ శంకర్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. తొలి సినిమాతోనే మా దర్శకుడు ముకుంద్ పాండేకు మంచి పేరొస్తుంది. అన్ని వర్గాల వారు చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
'రైట్ రైట్' అన్నా స్పీడందుకునేలా లేదు..
స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్. మంచి సినిమాలతో మెప్పిస్తున్నా హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయినా తన ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. లవర్స్, కేరింత లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరైన సుమంత్, ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా 'రైట్ రైట్'. పూర్తి పల్లె వాతావరణంలో తెరకెక్కిన రైట్ రైట్ సుమంత్ అశ్విన్ కెరీర్‌కు స్పీడు పెంచిందో లేదో చూద్దాం. తండ్రి మరణంతో పోలీస్ ఆఫీసర్ కావాలన్న తన కలను పక్కన పెట్టి కండక్టర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఇ.రవి (సుమంత్ అశ్విన్). కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు రోజుకు ఒక్క ట్రిప్ మాత్రమే ఉండే గవిటి రూట్ అయితే బెటర్ అని రవికి అదే రూట్ డ్యూటీ వేస్తారు. వెళ్లే సమయమే కాని తిగిరి ఎప్పుడొస్తుందో చెప్పలేని గవిటి రూట్ బస్ డ్రైవర్ శేషు( కాలకేయ ప్రభాకర్). ఆ ఊరికి వెళ్లేది ఒక్క బస్సే కావటంతో బస్ డ్రైవర్, కండక్టర్లు ఊరి జనాలకు దగ్గరవుతారు. అదే బస్‌లో రెగ్యులర్‌గా వచ్చే కళ్యాణి(పూజ జవేరి)తో రవి ప్రేమలో పడతాడు. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా రవి, శేషుల బస్ కింద పడి ఓ వ్యక్తి గాయపడతాడు. కేసు అవుతుందన్న భయంతో ఆ వ్యక్తిని ఆ రూట్లో వస్తున్న జీపు డ్రైవర్‌కి అప్పగించి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆ బస్ కింద పడిపోయిన వ్యక్తి గవిటి సర్పంచ్ విశ్వానాథ్ గారి అబ్బాయి దేవా అని తెలుస్తుంది. రవి జీపులో ఎక్కించి పంపించిన దేవా ఊరి బయట లోయలో శవమై కనిపిస్తాడు. ఆ నేరం రవి మీద పడుతుంది. అసలు దేవా ఎలా చనిపోయాడు..? ఆ కేసు నుంచి రవి ఎలా బయటపడ్డాడు..? అన్నదే మిగతా కథ. ఇప్పటి వరకు అల్లరి పాత్రల్లో కనిపించిన సుమంత్ అశ్విన్ తొలిసారిగా ఓ బరువైన పాత్రను ఎంచుకొని విజయం సాధించాడు. డ్రైవర్ శేషుగా ప్రభాకర్ బాగా సెట్ అయ్యాడు. క్యారెక్టర్ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినా హీరోయిన్ పాత్రలో పూజ ఆకట్టుకుంది. పల్లె వాతావరణంలో సాగే లవ్ స్టోరికి చిన్న క్రైం ఎలిమెంట్ యాడ్ చేసి దర్శకుడు మను చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా.. కథనం లో మరింత వేగం చూపించాల్సింది. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్ కలిగించే పాయింట్లు పెద్దగా లేకపోవటం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరితో కథ నడిపిన దర్శకుడు స్లో నారేషన్తో ఇబ్బంది పెట్టాడు. ఇక సెకండ్ హాఫ్‌లో క్రైం థ్రిల్లర్‌గా టర్న్ అయినా కథలో వేగం మాత్రం కనిపించలేదు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద ఆవిష్కరించాడు. జెబి సంగీతం పర్వాలేదు. ఓవరాల్‌గా ప్రభాకర్‌తో కలిసి సుమంత్ అశ్విన్ రైట్ రైట్ అన్నా కెరీర్ మాత్రం స్పీడందుకునేలా లేదు. -
బస్సులో మిస్సుతో...!
ఓ లక్ష్యాన్ని సాధించడానికి తపన పడే ఒక యువకుడు అనుకోకుండా బస్ కండక్టర్ అవుతాడు. ఆ బస్‌లో అతనికో మిస్సు పరిచయమవుతుంది. ఆమెతో ఈ కండక్టర్‌కు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? చివరకు ఏమైంది? తెలియాలంటే మా ‘రైట్ రైట్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు హీరో సుమంత్ అశ్విన్. మను దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీసత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ‘బాహుబలి’ ప్రభాకర్ ఇందులో ప్రధాన పాత్ర చేశారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నేనిప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇందులో చాలా భిన్నమైన పాత్ర చేశా. నా క్యారెక్టర్ చాలా సహజంగా ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎంజాయ్ చేస్తూ చేశా. మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం మిస్టరీగా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్ది ఈ చిత్రంలో కీలక పాత్ర. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. సుమంత్ అశ్విన్ కెరీర్లో చెప్పకోదగ్గ చిత్రం అవుతుంది. ప్రభాకర్ పాత్ర ఇందులో హైలెట్‌గా నిలుస్తుంది. జె.బి. స్వర పరచిన పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. అన్నివర్గాల వారు చూసేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసఫ్, సహ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు. -
ఎక్స్ట్రార్డినరి!
ఆ కుర్రాడో బస్ కండక్టర్. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సులో బాధ్యతలు నిర్వహిస్తుం టాడు. ఆ బస్డ్రైవరూ, ఈ కండక్టరూ బాగా దోస్తులు అయిపోతారు. ఆ బస్ రూట్లో ఎన్ని మలుపులు ఉంటాయో- ఈ కండక్టర్ లైఫ్‌లో కూడా అన్ని మలుపులు ఉంటాయి. ఆర్డినరీ బస్సులో జాబ్ చేసే ఈ కుర్రాడి లైఫ్ ఎక్స్ట్రార్డినరీ కావడానికి ఓ అమ్మాయి ప్రేమ కారణమవుతుంది. అదేంటో తెలియాలంటే ‘రైట్ రైట్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మను. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ, ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తు న్నారు. ఇటీవల కేరళలో జరిపిన షెడ్యూల్స్‌లో చిత్రీకరణ మొత్తం పూర్తయిందనీ, మే నెలాఖరున గానీ , జూన్ ప్రథమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చే స్తామని నిర్మాతలు తెలిపారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ ఆధారంగా ఈ సినిమా రూపొందించామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత: జె. శ్రీనివాసరాజు. -
ధనుష్‌కు జోడీగా పూజా జవేరి
వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నటుడు ధనుష్. వేలై ఇల్లా పట్టాదారి వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఇటీవల విడుదలైన మారి కూడా సక్సెస్ అనిపించుకోవడంతో యమ ఖుషీగా ఉన్న ధనుష్ ప్రస్తుతం వేలై ఇల్లా పట్టాదారి -2 చిత్రాన్ని పూర్తి చేసి ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటిం గ్ శరవేగంగా జరుపుకుంటోంది. చాలా గ్యాప్ తరువాత ప్రభు సాల్మన్ కమర్షియల్ టచ్‌తో రూపొందిస్తున్న చిత్రం ఇది. నటి కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కథ డిమాండ్ చేయడంతో మరో హీరోయిన్ కోసం ఎక్కువగానే అన్వేషిం చారు. పలువురు నటీమణుల్ని పరిశీలించి న పిదప పూజాజవేరిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగులో ఒకటి అరచిత్రాలు చేసిన కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది.