ప్రభాస్ సరేనంటే.. పెళ్లికి రెడీ: హీరోయిన్
Published Mon, Mar 13 2017 7:53 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM
టాలీవుడ్‌లోని పెళ్లి కానీ హీరోల్లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఒకరు. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ పెళ్లి గురించి తొందరలేందటున్నారు ప్రభాస్‌ను ఆయన ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని ఓ హీరోయిన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. 'ద్వారక' సినిమాతో వెండితెరకు పరిచయమైన పూజ జవేరీకి ప్రభాస్ అంటే చాలా ఇష్టమట.
ప్రభాస్ సరేనంటే ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పింది ఈ అమ్మడు. కాగా, బాహుబలి తర్వాత ప్రభాస్‌కు పెళ్లి పీటలెక్కే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ కోడై కూసింది. మరి పూజ ఇచ్చిన ఆఫర్‌కు ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ సినిమాతో బిజీగా ఉన్నారు.
Advertisement
Advertisement