ఎక్స్‌ట్రార్డినరి! | Extraordinary Life boy | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రార్డినరి!

Published Tue, Apr 5 2016 10:57 PM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

ఎక్స్‌ట్రార్డినరి! - Sakshi

ఎక్స్‌ట్రార్డినరి!

ఆ కుర్రాడో బస్ కండక్టర్. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సులో బాధ్యతలు నిర్వహిస్తుం టాడు. ఆ బస్‌డ్రైవరూ, ఈ కండక్టరూ బాగా దోస్తులు అయిపోతారు. ఆ బస్ రూట్‌లో ఎన్ని మలుపులు ఉంటాయో- ఈ కండక్టర్ లైఫ్‌లో కూడా అన్ని మలుపులు ఉంటాయి. ఆర్డినరీ బస్సులో జాబ్ చేసే ఈ కుర్రాడి లైఫ్ ఎక్స్‌ట్రార్డినరీ కావడానికి ఓ అమ్మాయి ప్రేమ కారణమవుతుంది. అదేంటో తెలియాలంటే ‘రైట్ రైట్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మను. సుమంత్ అశ్విన్, పూజా ఝవేరీ, ‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తు న్నారు.
 
 ఇటీవల కేరళలో జరిపిన షెడ్యూల్స్‌లో చిత్రీకరణ మొత్తం పూర్తయిందనీ, మే నెలాఖరున గానీ , జూన్ ప్రథమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చే స్తామని నిర్మాతలు తెలిపారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ ఆధారంగా ఈ సినిమా రూపొందించామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు, సహ నిర్మాత: జె. శ్రీనివాసరాజు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement