ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తా! | sumanth ashwin interview in sakshi | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తా!

Published Wed, Oct 21 2015 12:04 AM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM

ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తా! - Sakshi

ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తా!

- సుమంత్ అశ్విన్
‘‘మొదటి నుంచి ‘కొలంబస్’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ‘నువ్వే కావాలి’, ‘మనసంతా నువ్వే’ లాంటి సూపర్‌హిట్ లవ్‌స్టోరీల తరువాత ఆ జాబితాలో చేరే సినిమా ఇది’’ అని నమ్మకంగా చెబుతున్నారు సుమంత్ అశ్విన్.
ఈ యువహీరో నటించిన ‘కొలంబస్’ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...

 
* ఈ కథ రాసింది మా నాన్నగారే. ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చా. మంచి నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్, మంచి దర్శకుడు రమేశ్ సామల దొరకడంతో ఈ ప్రాజెక్టుకు ఇంకా మంచి షేప్ వచ్చింది.
* ఇందులో ఇద్దరు హీరోయిన్లు సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి... చాలా అందంగా ఉంటారు. ఇద్దరు హీరోయిన్లు కాబట్టి అందరూ దీన్ని ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఇది కొత్త తరహాలో ఉంటుంది. అదేంటో తెర మీద చూస్తేనే బాగుంటుంది. ఇందులో నాది ఓ అమ్మాయిని నిజాయతీగా ప్రేమించే పాత్ర. ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తాను. ఎంతకైనా తెగిస్తాను. ఇది లవ్‌స్టోరీ అయినా కూడా ఫ్యామిలీస్‌కి, మాస్‌కి కూడా నచ్చుతుంది.
* నా వయసుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఎక్కువ ప్రేమకథలకు ప్రాధాన్యమిస్తున్నా. ఆమిర్‌ఖాన్ కూడా మొదట్లో ప్రేమ కథలే చేశాడు. ‘గులామ్’ తర్వాత తన ప్యాట్రన్ మార్చాడు. నేనూ అంతే. నటుడనేవాడు ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకూడదు. అన్ని తరహా పాత్ర లూ చేయాలి. నాకు విలన్‌గా కూడా చేయాలని ఉంది. అలాగే ప్రయోగాలు చేయాలని ఉంది.
* ఒక సినిమా చేస్తుంటే నా ప్రాణం మొత్తం దాని మీదే పెట్టేస్తా. స్నేహితులు, కుటుంబం, ఫోన్...ఇలాంటి విషయాలేవీ పట్టించుకోను. అంత కష్టపడతాను కాబట్టే నా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే హార్ట్ బ్రేక్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
* ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడిగా నాకు నిర్మాత పరిస్థితి ఏంటో తెలుసు. అందుకే బడ్జెట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. ‘కేరింత’ షూటింగ్ టైమ్‌లో ‘దిల్’ రాజుగారు ఒక నిమిషం ఆలస్యమైతే వెయ్యి రూపాయల నష్టమొస్తుందని చెప్పారు. ఆ మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.
* ప్రస్తుతం ‘రైట్ రైట్’ అనే సినిమా ఒప్పుకున్నా. హిస్టరీ, థ్రిల్లర్ జోనర్‌లో ఉండే చిత్రమిది. పూర్తి వివరాలు త్వరలో చెబుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement