అందుకే అమెరికా హక్కులు తీసుకున్నా... | Varun Sandesh's film to release on Feb 14 | Sakshi
Sakshi News home page

అందుకే అమెరికా హక్కులు తీసుకున్నా...

Published Tue, Feb 10 2015 11:25 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

అందుకే అమెరికా హక్కులు తీసుకున్నా... - Sakshi

అందుకే అమెరికా హక్కులు తీసుకున్నా...

 ‘‘హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ చేసే ప్రయాణంలో చోటు చేసుకునే అనూహ్యమైన మలుపులతో ‘పడ్డా నండి ప్రేమలో మరి’ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా విజయంపై నమ్మకంతో అమెరికాలో నేను పంపిణీ చేస్తున్నాను’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వంలో నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మించిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ ఈ నెల 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. యాక్షన్ అంశాలు మేళవించిన ఈ ప్రేమకథ అని వర్గాలనూ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. తదుపరి చిత్రం ‘లవకుశ’ చెబుతూ ‘‘ఇందులో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నా. తెలంగాణ, ఆంధ్రా కుర్రాళ్లుగా నేను కనిపిస్తాను’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement