
ఓ హిందీ సిన్మా చేసే ఛాన్సుందని ప్రభాస్ చెబుతున్నారు. అంతకంటే ముందు... ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘సాహో’ తర్వాత... ఓ అందమైన ప్రేమకథలో నటిస్తానని ప్రభాస్ పేర్కొన్నారు. అదీ మామూలు ప్రేమకథ కాదు! మన దేశంలో జరిగేదీ కాదు! 50 ఏళ్లు వెనక్కి వెళ్లి, 1960–70ల్లో యూరప్ నేపథ్యంలోని ప్రేమకథతో ప్రభాస్ సినిమా చేయబోతున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. వచ్చే ఏడాది జూలై కల్లా ఈ సిన్మాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట! అప్పుడు హిందీ సినిమా గురించి ఆలోచిస్తానన్నారు.