
ఆకట్టుకుంటుంది!
వరుణ్‌సందేశ్, వితికాశేరు జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘పడ్డానండి ప్రేమలో మరి’. పాంచజన్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మించారు. మహేశ్ ఉప్పుటూరి దర్శకుడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ -‘‘నా ‘హ్యాపీడేస్’, ‘కొత్తబంగారులోకం’ చిత్రాల తరహాలోనే ఇది కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.