Paddanandi Premalo Mari
-
వచ్చే నెల నిశ్చితార్థం...వచ్చే ఏడాది పెళ్లి!
‘పడ్డానండి ప్రేమలో మరి’... వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం ఇది. ఈ ఇద్దరూ ఏ ముహూర్తాన ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారో కానీ, రీల్ కోసం ప్రేమించుకోవడం మొదలుపెట్టి రియల్‌గా కూడా ప్రేమలో పడిపోయారు. కొన్ని రోజులుగా వరుణ్ సందేశ్, వితికా లవ్‌లో పడ్డారనే వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్త నిజమేనని ‘సాక్షి’కి తెలిపారు వితికా శేరు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సమయంలోనే వరుణ్, తానూ ప్రేమలో పడ్డామని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి సీక్రెట్‌గా సాగిన వీళ్ల లవ్‌స్టోరీ మీడియా ద్వారా వెలుగులోకొచ్చింది. అదే నిశ్చితార్థానికి దారి తీసింది. మీడియాలో వచ్చిన వార్తలు తెలుసుకున్న వరుణ్, వితికాల కుటుంబ సభ్యులు ఇద్దరితోనూ మాట్లాడారు. ఈ లవ్ బర్డ్స్‌కి పెద్దల సమ్మతం కూడా లభించేసింది. వచ్చే నెలలో నిశ్చితార్థం జరపాలనుకుంటున్నారు. నవంబరులో ఉంగరాలు మార్చుకోనున్న ఈ ప్రేమికులు వచ్చే ఏడాది నవంబరులో పెళ్లి పీటల మీద కూర్చుంటారు. త్వరలో నిశ్చితార్థ తేదీని ప్రకటిస్తారు. ఆ వేడుక రోజే వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. -
ఆకట్టుకుంటుంది!
వరుణ్‌సందేశ్, వితికాశేరు జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘పడ్డానండి ప్రేమలో మరి’. పాంచజన్య మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మించారు. మహేశ్ ఉప్పుటూరి దర్శకుడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ మాట్లాడుతూ -‘‘నా ‘హ్యాపీడేస్’, ‘కొత్తబంగారులోకం’ చిత్రాల తరహాలోనే ఇది కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. -
నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది: వరుణ్ సందేశ్
‘‘వరుణ్ సందేశ్ చేసే సినిమాలన్నీ బాగుంటాయి. మనింటి కుర్రాడిలా అందరికీ కనెక్ట్ అవుతాడు. అందుకే, తనంటే ఇష్టం. ‘అరుంధతి’లో నటించిన అరవింద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘పడ్డానండి ప్రేమలో మరి’. నల్లపాటి వంశీమోహన్ సమర్పణలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఖుద్దూస్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ‘అల్లరి’ నరేశ్ సీడీని ఆవిష్కరించి, భీమనేని శ్రీనివాసరావుకి ఇచ్చారు. ఈ వేడుకలో దశరథ్, మెహర్ రమేశ్, శివబాలాజీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ పాత్ర వినూత్నంగా ఉంటుంది. వినోద ప్రధానంగా సాగే చిత్రం’’ అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో కొన్ని నిరాశపరిచాయి. కానీ, ఈ సినిమా మంచి ఫలితాన్నిస్తుందనే నమ్మకం ఉంది. నా కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది’’ అని చెప్పారు. యువతరానికి కావల్సిన అంశాలతో రూపొందిన చిత్రం ఇదని నిర్మాత తెలిపారు. -
నా కెరీర్లో బెస్ట్ మూవీ : వరుణ్ సందేశ్
యువతరాన్ని లక్ష్యంగా తీసుకొని రూపొందుతోన్న ప్రేమకథ ‘పడ్డానండీ ప్రేమలో మరి’. వరుణ్‌సందేశ్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఉప్పుటూరి మహేశ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నల్లపాటి రామచంద్రప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం ప్రచార చిత్రాలను నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకుడు మారుజ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. తనకిది ప్రత్యేకమైన సినిమా అనీ, తన కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని వరుణ్‌సందేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి సినిమా చేశాననే తృప్తి ఈ చిత్రం అందించిందనీ నిర్మాత తెలిపారు. భిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. వితిక షేరు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్ ఎ.ఆర్, కెమెరా: భరణి కె.ధరన్. -
ప్రేమలో పడ్డానంటున్న వరుణ్ సందేశ్
‘స్టూడెంట్ నం.1’ చిత్రంలోని హిట్ పాట ‘పడ్డానండీ ప్రేమలో మరి’. ఇప్పుడా పాట పల్లవితో వరుణ్ సందేశ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో వితిక శేరు కథానాయిక. మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వంలో నల్లపాటి వంశీ మోహన్ సమర్పణలో పాంచజన్య మీడియా పతాకంపై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మిస్తున్న ‘పడ్డానండీ ప్రేమలో మరి’ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కుమార్తె నల్లపాటి కీర్తన కెమెరా స్విచాన్ చేయగా, రచయిత ఎమ్.వి.ఎస్. హరనాథరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత పోకూరి బాబూరావు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రేమతో సాగే కుటుంబ కథా చిత్రమిదని, ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతకు కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. పాటలను వెనిస్లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఆర్. ఖద్దూస్, కెమెరా: భరణి కె. ధరన్.