ప్రేమలో పడ్డానంటున్న వరుణ్ సందేశ్ | Varun Sandesh's 'Paddanandi Premalo Mari' shooting starts | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడ్డానంటున్న వరుణ్ సందేశ్

Jun 2 2014 11:05 PM | Updated on Sep 2 2017 8:13 AM

ప్రేమలో పడ్డానంటున్న వరుణ్ సందేశ్

ప్రేమలో పడ్డానంటున్న వరుణ్ సందేశ్

‘స్టూడెంట్ నం.1’ చిత్రంలోని హిట్ పాట ‘పడ్డానండీ ప్రేమలో మరి’. ఇప్పుడా పాట పల్లవితో వరుణ్ సందేశ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో వితిక శేరు కథానాయిక.

 ‘స్టూడెంట్ నం.1’ చిత్రంలోని హిట్ పాట ‘పడ్డానండీ ప్రేమలో మరి’. ఇప్పుడా పాట పల్లవితో వరుణ్ సందేశ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో వితిక శేరు కథానాయిక. మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వంలో నల్లపాటి వంశీ మోహన్ సమర్పణలో పాంచజన్య మీడియా పతాకంపై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మిస్తున్న ‘పడ్డానండీ ప్రేమలో మరి’ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత కుమార్తె నల్లపాటి కీర్తన కెమెరా స్విచాన్ చేయగా, రచయిత ఎమ్.వి.ఎస్. హరనాథరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత పోకూరి బాబూరావు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రేమతో సాగే కుటుంబ కథా చిత్రమిదని, ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతకు కావాల్సిన అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. పాటలను వెనిస్‌లో చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఆర్. ఖద్దూస్, కెమెరా: భరణి కె. ధరన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement